26న ఇస్కాన్‌ రథయాత్ర | isckon rathayathra on 26th | Sakshi

26న ఇస్కాన్‌ రథయాత్ర

Published Sat, Nov 12 2016 11:07 PM | Last Updated on Mon, Sep 4 2017 7:55 PM

isckon rathayathra on 26th

అనంతపురం కల్చరల్‌ : ఇస్కాన్‌ స్వర్ణోత్సవాల సందర్భంగా ఈ నెల 26, 27 తేదీలలో రెండు రోజుల పాటు ధర్మవరం పట్టణంలో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్‌ జిల్లా ప్రతినిధి దామోదర గౌరంగదాసు తెలిపారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఇస్కాన్‌ మందిరంలో రథయాత్ర పోస్టర్లను విడుదల చేశారు.

అనంతరం మాట్లాడుతూ తొలిరోజు నగరవీధుల్లో శోభాయమానంగా అలంకరించిన జగన్నాథ రథయాత్ర, రెండవరోజు నాదోత్సవం ఉంటాయన్నారు. ఇస్కాన్‌ దక్షిణ భారత దేశ అధ్యక్షులు సత్యగోపీనాథ్‌ ముఖ్యఅతిథిగా విచ్చేసి రథయాత్ర ప్రాధాన్యతను వివరిస్తారన్నారు. వందలాది మంది కళాకారుల సమక్షంలో సాగే రథయాత్రలో జిల్లా వాసులు విరివిగా పాల్గొనాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement