isckon
-
Bangladesh: ఆగని దాడులు.. టార్గెట్ ఇస్కాన్.. మరో అరెస్టు
ఢిల్లీ/ఢాకా: తాత్కాలిక ప్రభుత్వంలో ఉన్న బంగ్లాదేశ్‌లో.. హిందు ఆలయాలపై దాడులు ఆగడం లేదు. తాజాగా అల్లరి మూకలు ఛట్టోగ్రామ్‌లోని మూడు ఆలయాలపై రాళ్లు రువ్వి దాడికి తెగబడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు ధృవీకరించారు. మరోవైపు.. ఇస్కాన్ లక్ష్యంగా అణచివేత చర్యలు చేపట్టింది అక్కడి ప్రభుత్వం.తాజాగా.. బంగ్లాదేశ్‌లో మరో ఇస్కాన్ సభ్యుడి అరెస్టు అయ్యారు. ఛట్టోగ్రామ్లో ఇస్కాన్‌కు చెందిన శ్యామ్‌దాస్ ప్రభు అరెస్టు అయినట్లు ఇస్కాన్ కోల్‌కతా ప్రతినిధి రాధారమణ్ దాస్ ‘ఎక్స్’లో వెల్లడించారు. ఇటీవల చిన్మయ్ కృష్ణదాస్‌ను బంగ్లాదేశ్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ జెండాను అవమానించారని.. తద్వారా తీవ్ర ఉద్రిక్తతలకు కారణం అయ్యారనే అభియోగాలు మోపి ఆయన్ని రాజద్రోహం కింద అరెస్ట్ చేశారు. అయితే.. ఆ అరెస్ట్‌ను నిరసిస్తూ బంగ్లా వ్యాప్తంగా హిందూ సంఘాలు తీవ్ర ఆందోళన చేపట్టాయి. ఈ క్రమంలో కోర్టు ఆయనకు బెయిల్ నిరాకరించగా.. ఆ టైంలో(మంగళవారం) తలెత్తిన అల్లర్లలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరణించడం.. పరిస్థితిని మరింత తీవ్రంగా మార్చేసింది.మరోవైపు ఇస్కాన్‌పై నిషేధం దిశగా అక్కడి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం అందుకు అంగీకరించలేదు. దీంతో మరో దోవలో ఇస్కాన్‌పై చర్యలకు ఉపక్రమించింది. ఇస్కాన్‌కు చెందిన 17 బ్యాంక్ అకౌంట్లను నెలరోజులపాటు ఫ్రీజ్ చేసింది.బంగ్లాదేశ్ జనాభా 17 కోట్లకు కాస్త పైనే. ఇందులో 8 శాతం హిందూ జనాభా ఉంది. మైనారిటీలుగా కొన్ని హక్కులను హిందువులు అక్కడ అనుభవిస్తూ వస్తున్నారు. అయితే అనూహ్య పరిణామాల నడుమ షేక్ హసీనా పదవి నుంచి దిగిపోగా.. ఆ తర్వాత సైన్యం సహకారంతో మహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో హిందువులపై, ఆలయాలపై దాడులు పెరిగిపోయాయి. దీంతో చిన్మయ్ కృష్ణదాస్ రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టారు. -
బీజేపీ ఎంపీ మేనకా గాంధీకి బిగ్ షాక్..
ఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, మేనకాగాంధీకి బిగ్ షాక్ తగిలింది. ఎంపీ మేనకా గాంధీపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేసేందుకు ఇస్కాన్ సిద్ధమైంది. ఈ మేరకు నోటీసులు జారీ అయ్యాయి. అయితే, ఇటీవల మేనకా గాంధీ.. గోశాలల్లో ఉన్న గోవుల్ని ఇస్కాన్ అమ్ముకుంటున్నదని సంచలన ఆరోపణలు చేశారు. దీంతో, ఇస్కాన్ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇక, మేనకా గాంధీ వ్యాఖ్యలపై కోల్‌కతాలోని ఇస్కాన్ ఉపాధ్యక్షుడు రాధారమణ్ దాస్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. మేనకా గాంధీ వ్యాఖ్యలు దురదృష్టకరమని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్కాన్ భక్తుల్ని ఆమె వ్యాఖ్యలు బాధించాయన్నారు. ఆమెపై వంద కోట్ల పరువునష్టం కేసు వేసేందుకు న్యాయ ప్రక్రియ చేపట్టామని, ఇవాళ ఆమెకు నోటీసు జారీచేశామని చెప్పుకొచ్చారు. మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ అయిన ఆమె ఎటువంటి ఆధారాలు లేకుండా ఇంత పెద్ద సంస్థపై ఎలా ఆరోపణలు చేశారని ఆయన మండిపడ్డారు. #Breaking ISKCON sends Rs 100 cr defamation notice to Maneka Gandhi over 'biggest cheat' remark #ISKCON #ManekaGandhi #Defamation #Cows — MANOJ KUMAR (@ManojBroadcast) September 29, 2023 అంతకుముందు కూడా.. మేనకా గాంధీ చేసిన ఆరోపణలను ఇస్కాన్ ఖండించింది. ఆమె ఆరోపణలు నిరాధారమైనవని, తప్పుడువని ఇష్కాన్ పేర్కొన్నది. గోవులు, ఆవుల సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తామని ఇస్కాన్ జాతీయ ప్రతినిధి యుదిష్టర్ గోవింద దాస్ తెలిపారు. కేవలం ఇండియాలోనే కాదు, యావత్ ప్రపంచవ్యాప్తంగా తాము గోవుల్ని ఆదరించనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. Sad reality of ISCON Temple ISCON temple exposed by Maneka Gandhi ji#ISKCON | @yudhistirGD | #ManekaGandhi | Maneka Gandhi | मेनका गांधी pic.twitter.com/2hgc7ED7Aq — INDIA Alliance (@2024_For_INDIA) September 27, 2023 ఇదిలా ఉండగా.. మేనకా గాంధీ ఇస్కాన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఇస్కాన్ వాళ్లు దేశంలోనే దారుణమైన మోసాలకు పాల్పడుతున్నారని.. గోశాలల నిర్వహణ పేరిట ఆవుల్ని కసాయివాళ్లకు అమ్మేసుకుంటున్నారంటూ తీవ్ర ఆరోపణలే చేశారు. ఇస్కాన్.. దేశంలోనే అతిపెద్ద మోసపూరిత సంస్థ. ఇది గోశాలలను నిర్వహణ పేరిట ప్రభుత్వాల నుంచి లబ్ధి పొందుతోంది. ఓ చోట ఉన్న ఇస్కాన్ గోశాలకు వెళ్లినప్పుడు అక్కడ ఒక ఆవు కూడా లేదు. అన్నింటిని కసాయివాళ్లకు అమ్మేశారు. అలాంటి వాళ్లు రోడ్లపైకి చేరి హరేరామ్.. హరేకృష్ణ అంటూ వల్లేస్తుంటారు. పాల మీదే ఆధారపడి బతుకుతున్నాం అని చెప్పుకుంటారు అని ఆరోపించారు. ఇది కూడా చదవండి: పంజాబ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్.. ‘ఇండియా’ కూటమిపై కేజ్రీవాల్ క్రేజీ కామెంట్స్ -
ఇస్కాన్‌పై బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు
ఢిల్లీ: బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్‌పై( ISKCON) సంచలన ఆరోపణలు చేశారు. ఇస్కాన్ వాళ్లు దేశంలోనే దారుణమైన మోసాలకు పాల్పడుతున్నారని.. గోశాలల నిర్వహణ పేరిట ఆవుల్ని కసాయివాళ్లకు అమ్మేసుకుంటున్నారంటూ తీవ్ర ఆరోపణలే చేశారామె. ఇస్కాన్.. దేశంలోనే అతిపెద్ద మోసపూరిత సంస్థ. ఇది గోశాలలను నిర్వహణ పేరిట ప్రభుత్వాల నుంచి లబ్ధి పొందుతోంది. అనంతపూర్ ఇస్కాన్ గోశాలకు వెళ్లినప్పుడు అక్కడ ఒక ఆవు కూడా లేదు. అన్నింటిని కసాయివాళ్లకు అమ్మేశారు. అలాంటి వాళ్లు రోడ్లపైకి చేరి హరేరామ్.. హరేకృష్ణ అంటూ వల్లేస్తుంటారు. పాల మీదే ఆధారపడి బతుకుతున్నాం అని చెప్పుకుంటారు అని ఆరోపించారామె. #BJP MP and former minister #MenakaGandhi telling what #ISKCON is doing at #Gaushalas #Bhakts and @IskconInc should react on this.. pic.twitter.com/RdpLMBsZP1 — manishbpl (@manishbpl1) September 26, 2023 అయితే.. మేనకా గాంధీ చేసిన ఆరోపణలను ఇస్కాన్ ఖండించింది. పశు సంరక్షణలో ఇస్కాన్ ఎల్లప్పుడూ ముందు ఉంటుందని ఇస్కాన్ ప్రతినిధి యుధిష్టిర్ గోవిందా దాస్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. కేంద్ర మాజీ మంత్రి అయిన మేనకా గాంధీ, యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్ కూడా అనే సంగతి తెలిసిందే. Response to the unsubstantiated and false statements of Smt Maneka Gandhi. ISKCON has been at the forefront of cow and bull protection and care not just in India but globally. The cows and bulls are served for their life not sold to butchers as alleged. pic.twitter.com/GRLAe5B2n6 — Yudhistir Govinda Das (@yudhistirGD) September 26, 2023 -
యాక్సిడెంట్‌ను చూడబోతే.. 9 మంది మృతి
గాంధీనగర్: గుజరాత్ అహ్మదాబాద్ నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. సర్కేజ్-గాంధీనగర్ హైవేపై ఉన్న ఇస్కాన్ వంతెనపై జరిగిన డబుల్ యాక్సిడెంట్లో 9 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 13 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి దాటాక ఓ థార్ వాహనాన్ని ఓ డంపర్ ట్రక్కు వెనకాల నుంచి ఢీ కొట్టడంతో యాక్సిడెంట్ జరిగింది. ఆ సమయంలో జనం గుమిగూడి ఆ యాక్సిడెంట్‌ను చూస్తున్నారు. ఆ సమయంలో ఓ జాగ్వార్ కారు జనాల మీదకు దూసుకెళ్లింది. ISKCON bridge Accidentలో గాయపడ్డ వాళ్లను వెంటనే ఆస్పత్రికి తరలించగా.. తొమ్మది మంది మృతి చెందారు. మృతుల్లో ఓ కానిస్టేబుల్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరో 13 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇదిలా ఉంటే.. జాగ్వార్ కారు మితిమీరిన వేగంతో దూసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు. Scary live visual, Speeding Jaguar rams into a crowd gathered around a truck-car accident in #Ahmedabad, killing 9 people, many injured. pic.twitter.com/QwCPy1lSPG — Nikhil Choudhary (@NikhilCh_) July 20, 2023 ఘటనపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం, గాయపడిన వాళ్లకు రూ. 50వేల సాయం రాష్ట్రప్రభుత్వం తరపున అందిస్తున్నట్లు ప్రకటించారు. కారులో ఉంది ప్రముఖుడైన ప్రజ్నేష్ పటేల్ కుమారుడని తాత్యా పటేల్ అని తెలుస్తోంది. ఘటన తర్వాత కొందరు ఆ యువకుడిని చితకబాదిన దృశ్యాలూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ తర్వాత అతన్ని పోలీసులు ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. #WATCH | #Ahmedabad car crash: Car driver being thrashed by locals pic.twitter.com/QGXjTMkABq — TOI Ahmedabad (@TOIAhmedabad) July 20, 2023 -
26న ఇస్కాన్ రథయాత్ర
అనంతపురం కల్చరల్ : ఇస్కాన్ స్వర్ణోత్సవాల సందర్భంగా ఈ నెల 26, 27 తేదీలలో రెండు రోజుల పాటు ధర్మవరం పట్టణంలో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ జిల్లా ప్రతినిధి దామోదర గౌరంగదాసు తెలిపారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఇస్కాన్ మందిరంలో రథయాత్ర పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ తొలిరోజు నగరవీధుల్లో శోభాయమానంగా అలంకరించిన జగన్నాథ రథయాత్ర, రెండవరోజు నాదోత్సవం ఉంటాయన్నారు. ఇస్కాన్ దక్షిణ భారత దేశ అధ్యక్షులు సత్యగోపీనాథ్ ముఖ్యఅతిథిగా విచ్చేసి రథయాత్ర ప్రాధాన్యతను వివరిస్తారన్నారు. వందలాది మంది కళాకారుల సమక్షంలో సాగే రథయాత్రలో జిల్లా వాసులు విరివిగా పాల్గొనాలని కోరారు. -
వైభవంగా బలరామ జయంతి
నెల్లూరు(బృందావనం): నగరంలోని ఇస్కాన్‌సిటీలోని ఇస్కాన్ మందిరంలో గురువారం బలరామ జయంతిని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశేష పూజలు, అభిషేకాలు, ఊంజల్ సేవ నిర్వహించారు. భక్తులు సంకీర్తనలను అలపించారు. ఈ సందర్భంగా ఇస్కాన్ నెల్లూరు మందిరం అధ్యక్షుడు సుఖదేవ్స్వామి దైవసందేశాన్ని అందించారు. బలరాముడిని పూజించడం ద్వారా పొందే ఆధ్యాత్మిక శక్తి,అనుగ్రహంతో జీవితాన్ని సుఖసంతోషాలతో గడపగలమని పేర్కొన్నారు. -
జై జగన్నాథా
వైభవంగా సాగిన జగన్నాథుడి రథయాత్ర గూడూరులో కోలాహలం గూడూరు: హరేరామ..హరేకృష్ణ నామస్మరణతో గూడూరు పట్టణం శనివారం మార్మోగింది. ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్రను వైభవంగా నిర్వహించారు. యాత్రలో భాగంగా భక్తులు చేసిన పండరి భజనలు, కోలాటాలు ఆకట్టుకున్నాయి. రథంపై కొలువైన జగన్నాథుడిని దర్శించుకునేందుకు పట్టణ వాసులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు తరలివచ్చారు. గూడూరులో 4వ జగన్నాథ రథయాత్రను పట్టణంలోని డీఎన్ఆర్ కమ్యూనిటీ హాలు ప్రాంతంలో ఐసీఎస్ రోడ్డు మీదుగా పట్టణ వీధుల్లో సాగింది. ప్రతి ఇంటి ముంగిట్లో ముగ్గులు తీర్చిదిద్ది రథయాత్రకు స్వాగతం పలికారు. చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో అలరించారు. కుమ్మరివీధి యూత్ కడివేటి చంద్రశేఖర్, కంప్యూటర్ శీను, బుజ్జి, పురుషోత్తం, కాటూరు శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రసాద పంపిణీ జరిగింది. యాత్రకు ఎలాంటి అవాంతరాలు లేకుండా ఎస్సైలు సుధాకర్, నరేష్ చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, డీఎస్పీ శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. -
బృందావనంలో 70 అంతస్తుల ఆలయం
చిలిపి చేష్టల కృష్ణుడికి నిర్మిస్తున్న మరో అద్భుత ఆలయం నమూనా ఇది. కృష్ణుడు చిన్నతనంలో తిరుగాడిన ప్రదేశంగా పేర్కొనే ఉత్తరప్రదేశ్‌లోని బృందావనంలో.. దేశంలోని అతిపెద్ద ఆలయాల్లో ఒకటిగా 70 అంతస్తులుగా దీనిని నిర్మించనున్నారు. ‘అంతర్జాతీయ కృష్ణ చైతన్య సమాజం (ఇస్కాన్)’ 62 ఎకరాల విస్తీర్ణంలో.. 213 మీటర్ల ఎత్తుతో ‘బృందావన్ చంద్రోదయ మందిర్’ పేరిట ఈ ఆలయాన్ని నిర్మించనుంది. ఆలయం చుట్టూ దాదాపు 30 ఎకరాల్లో అడవిని పెంచనున్నారు. ఈ ఆలయంలో రథయాత్ర, పల్లకి, ఊయల ఉత్సవం సహా ఏడాది పొడవునా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం నిర్మాణానికి నేడు శంకుస్థాపన జరుగనుంది.