గాంధీనగర్: గుజరాత్ అహ్మదాబాద్ నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. సర్కేజ్-గాంధీనగర్ హైవేపై ఉన్న ఇస్కాన్ వంతెనపై జరిగిన డబుల్ యాక్సిడెంట్‌లో 9 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 13 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి దాటాక ఓ థార్ వాహనాన్ని ఓ డంపర్ ట్రక్కు వెనకాల నుంచి ఢీ కొట్టడంతో యాక్సిడెంట్ జరిగింది. ఆ సమయంలో జనం గుమిగూడి ఆ యాక్సిడెంట్‌ను చూస్తున్నారు. ఆ సమయంలో ఓ జాగ్వార్ కారు జనాల మీదకు దూసుకెళ్లింది.
ISKCON bridge Accidentలో గాయపడ్డ వాళ్లను వెంటనే ఆస్పత్రికి తరలించగా.. తొమ్మది మంది మృతి చెందారు. మృతుల్లో ఓ కానిస్టేబుల్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరో 13 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇదిలా ఉంటే.. జాగ్వార్ కారు మితిమీరిన వేగంతో దూసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
Scary live visual, Speeding Jaguar rams into a crowd gathered around a truck-car accident in #Ahmedabad, killing 9 people, many injured. pic.twitter.com/QwCPy1lSPG
— Nikhil Choudhary (@NikhilCh_) July 20, 2023
ఘటనపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం, గాయపడిన వాళ్లకు రూ. 50వేల సాయం రాష్ట్రప్రభుత్వం తరపున అందిస్తున్నట్లు ప్రకటించారు.
కారులో ఉంది ప్రముఖుడైన ప్రజ్నేష్ పటేల్ కుమారుడని తాత్యా పటేల్ అని తెలుస్తోంది. ఘటన తర్వాత కొందరు ఆ యువకుడిని చితకబాదిన దృశ్యాలూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ తర్వాత అతన్ని పోలీసులు ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.
#WATCH | #Ahmedabad car crash: Car driver being thrashed by locals pic.twitter.com/QGXjTMkABq
— TOI Ahmedabad (@TOIAhmedabad) July 20, 2023
Comments
Please login to add a commentAdd a comment