Jaguar car
-
కొత్త డిజైన్, స్టైలిష్ లుక్‌లో జాగ్వార్ కారు (ఫొటోలు)
-
యాక్సిడెంట్‌ను చూడబోతే.. 9 మంది మృతి
గాంధీనగర్: గుజరాత్ అహ్మదాబాద్ నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. సర్కేజ్-గాంధీనగర్ హైవేపై ఉన్న ఇస్కాన్ వంతెనపై జరిగిన డబుల్ యాక్సిడెంట్లో 9 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 13 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి దాటాక ఓ థార్ వాహనాన్ని ఓ డంపర్ ట్రక్కు వెనకాల నుంచి ఢీ కొట్టడంతో యాక్సిడెంట్ జరిగింది. ఆ సమయంలో జనం గుమిగూడి ఆ యాక్సిడెంట్‌ను చూస్తున్నారు. ఆ సమయంలో ఓ జాగ్వార్ కారు జనాల మీదకు దూసుకెళ్లింది. ISKCON bridge Accidentలో గాయపడ్డ వాళ్లను వెంటనే ఆస్పత్రికి తరలించగా.. తొమ్మది మంది మృతి చెందారు. మృతుల్లో ఓ కానిస్టేబుల్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరో 13 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇదిలా ఉంటే.. జాగ్వార్ కారు మితిమీరిన వేగంతో దూసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు. Scary live visual, Speeding Jaguar rams into a crowd gathered around a truck-car accident in #Ahmedabad, killing 9 people, many injured. pic.twitter.com/QwCPy1lSPG — Nikhil Choudhary (@NikhilCh_) July 20, 2023 ఘటనపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం, గాయపడిన వాళ్లకు రూ. 50వేల సాయం రాష్ట్రప్రభుత్వం తరపున అందిస్తున్నట్లు ప్రకటించారు. కారులో ఉంది ప్రముఖుడైన ప్రజ్నేష్ పటేల్ కుమారుడని తాత్యా పటేల్ అని తెలుస్తోంది. ఘటన తర్వాత కొందరు ఆ యువకుడిని చితకబాదిన దృశ్యాలూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ తర్వాత అతన్ని పోలీసులు ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. #WATCH | #Ahmedabad car crash: Car driver being thrashed by locals pic.twitter.com/QGXjTMkABq — TOI Ahmedabad (@TOIAhmedabad) July 20, 2023 -
ఖరీదైన కారు కొనుగోలు చేసిన టీమిండియా పేసర్..
టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ ఇంటికి కొత్త జాగ్వార్ మోడల్ కారు వచ్చింది. జాగ్వార్-ఎఫ్ టైప్ మోడల్ ఎరుపు రంగులో ఉన్న కారును షమీ ఎంతో ఇష్టంగా కొనుగోలు చేశాడు. శుక్రవారం షమీకి అందించిన జాగ్వార్ ఎఫ్-టైప్ 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో కూడిన కూపే. దీని ఇంజన్ గరిష్టంగా 295 బిహెచ్పి పవర్.. 400 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ధర దాదాపు రూ. 98.13 లక్షలు(ఎక్స్ షో రూమ్). కాగా షమీకి కార్లు, బైక్‌లంటే యమా క్రేజ్. ఇప్పటికే తన ఇంట్లో టయోట ఫార్చునర్, బీఎండబ్ల్యూ 5 సిరీస్, ఆడి కారు ఉన్నాయి. ఇటీవలే షమీ ఐకానిక్ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 650ని ఉత్తర్ ప్రదేశ్ నుంచి తెప్పించుకున్నాడు. దానికి సంబంధించిన ఫోటోలను షమీ తన ఇన్‌స్టాగ్రామ్‌లోనూ పంచుకున్నాడు. ఇటీవలే ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మంచి ప్రదర్వననే కనబరిచాడు. ఇంగ్లండ్‌తో తొలివన్డే ద్వారా150 వికెట్ల మార్క్ అందుకున్న షమీ.. అత్యంత వేగంగా ఆ ఘనతను సాధించిన తొలి టీమిండియా బౌలర్‌గా షమీ నిలిచాడు. 80 మ్యాచ్‌ల్లో 150 వికెట్ల మార్క్‌ను అందుకున్న షమీ ఓవరాల్‌గా అఫ్గనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌తో సంయుక్తంగా ఉన్నాడు. విండీస్‌తో వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న షమీ టి20 సిరీస్‌లో మాత్రం ఆడనున్నాడు. చదవండి: ఇన్‌స్టాగ్రామ్‌లోనూ 'కింగే'.. ఒక్క పోస్టుకు ఎంత సంపాదిస్తున్నాడంటే? -
రాక్‌స్టార్‌తో రతన్ టాటా! ఎప్పుడు? ఎక్కడ ?
ఈ దేశాన్ని, ఇక్కడి నేలని, ఇక్కడి ప్రజలను ప్రేమించే పారిశ్రామికవేత్తల్లో ముందు వరుసలో వినిపించే పేరు రతన్టాటాది. లక్షల కోట్ల రూపాయల సంపద ఉన్నా.. సింపుల్‌గా జీవించడం ఆయనకే చెల్లుతోంది. సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్‌గా ఉండని రతన్ టాటా హఠాత్తుగా ఓ ట్వీట్ చేశారు. అది కూడా ఒక రాక్‌స్టార్ గురించి. స్థితప్రజ్ఞతకు మారు పేరులా కనిపించే రతన్‌టాటానే ఫోటో దిగేలా చేసిన ఆ రాక్ స్టార్ గన్స్ అండ్ రోజెస్ బ్యాండ్‌కి చెందిన స్లాష్. గన్స్ అండ్ రోజెస్ అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌కి చెందిన గన్స్ అండ్ రోజెస్ బ్యాంక్‌కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ బృందం నిర్వహించే బ్యాండ్స్‌కి ఫుల్ క్రేజ్ ఉంది. 1987 నుంచి ఈ రాక్‌బ్యాండ్ బృందం అలుపెరుగని ప్రదర్శనలు ఇస్తూ లెక్కకు మిక్కిలిగా అభిమానులను సంపాదించింది. అందులో ఒకరే మన రతన్ టాటా. జాగ్వర్ వల్లే బిజినెస్ రొటీన్ వర్క్‌లో భాగంగా రతన్ టాటా అమెరికాలోని గప్లిన్లో ఉన్న జాగ్వర్ షోరూమ్‌కి వెళ్లారు. అదే సమయంలో జాగ్వర్ కారు కొనుగోలు చేసేందుకు గన్స్ అండ్ రోజెస్ బ్యాంక్‌కి చెందిన స్లాష్ అక్కడికి వచ్చారు. వెంటనే స్లాష్తో కలిసి ఓ ఫోటో దిగి తన ముచ్చట తీర్చుకున్నారు రతన్ టాటా. ఈ ఫోటోని తీసింది మరో ప్రముఖుడైన బ్రియాన్ అల్లాన్. తాజాగా ఈ ఫోటోను రతన్ టాటా ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. The Day I visited Galpin Jaguar on one of my retail outlet visits, I was excited to meet this gentleman from Guns N’ Roses who was taking delivery of his new Jaguar XKR. A very polite rockstar, Slash 🎸 Clicked by Brian Allan pic.twitter.com/BUeKZ1zkWl — Ratan N. Tata (@RNTata2000) January 14, 2022 చదవండి: ఫెస్టివల్ సీజన్ సందర్భంగా రతన్‌టాటా స్పెషల్ గ్రీటింగ్స్..! -
2025 నాటికి మార్కెట్లోకి 10 టాటా ఎలక్ట్రిక్ వాహనాలు
ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటార్స్ 2025 నాటికి భారతీయ వాహన రంగంలోకి 10 కొత్త బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలను(బీఈవీలు) తీసుకురావలని యోచిస్తున్నట్లు కంపెనీ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. సుస్థిర మొబిలిటీ సొల్యూషన్స్ అందించే ప్రపంచ అగ్రగామి సంస్థల్లో టాటా మోటార్స్ ఉండేలా ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లు ప్రకటించారు. భారతదేశంతో పాటు ఐరోపాలో సెల్, బ్యాటరీ తయారీ కోసం పలు ఒప్పందాలను చేసుకుంటున్నట్లు వివరించారు. టాటా మోటార్స్ గత సంవత్సరం ప్రారంభించిన నెక్సన్ ఈవీ 4,000 యూనిట్లను విక్రయించింది. "రాబోయే సంవత్సరాల్లో మరిన్ని ఈవీ అమ్మకాలు జరుగుతాయని మేము ఆశిస్తున్నాము. టాటా మోటార్స్ భారత మార్కెట్లో ఈ మార్పుకు నాయకత్వం వహిస్తుంది. 2025 నాటికి, టాటా మోటార్స్ 10 కొత్త బీఈవీ వాహనాలను మార్కెట్లోకి తీసుకొనిరావలని యోచిస్తుంది. దేశవ్యాప్తంగా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను కల్పించడానికి మేము పెట్టుబడి పెట్టేందుకు సిద్దంగా ఉన్నాము" అని కంపెనీ ఛైర్మన్ చంద్రశేఖరన్ 2020-21 కంపెనీ వార్షిక నివేదికలో వాటాదారులకు తెలిపారు. టాటా గ్రూప్ భారతదేశం, ప్రపంచ వినియోగదారుల ఆలోచనలకు అనుగుణంగా కొత్త ఉత్పత్తులను వేగంగా తీసుకొనిరావడానికి సిద్దంగా ఉన్నట్లు పేర్కొన్నారు. జాగ్వార్ 2025 నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్ గా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ వాల్యూమ్ లలో 60 శాతం 2030 నాటికి పూర్తి బీఈవీ వాహనాలుగా మారతాయి అని అన్నారు. చదవండి: సరికొత్తగా టాటా టియాగో.. ధర ఎంతంటే..! -
మాదాపూర్‌లో జాగ్వార్ కార్ హల్చల్.. ఒకరు మృతి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో శనివారం రాత్రి జాగ్వార్ కారు బీభత్సం సృష్టించింది. మాదాపూర్ ఫ్లై ఓవర్ వద్ద పాదచారుడిపై దూసుకెళ్లింది. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. సంఘటన తెలుసుకున్న వెంటనే పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కేపీహెచ్ కాలనీ నుంచి మాదాపూర్ వైపు జాగ్వార్ కారు శనివారం రాత్రి 9 గంటల సమయంలో అతి వేగంగా దూసుకుంటూ వచ్చింది. ఈ సమయంలో రోడ్డు దాటుతున్న వ్యక్తిని వేగంతో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే కర్ఫ్యూ అమల్లో ఉండడంతో రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. దీంతో కారులో ఉన్న వ్యక్తి వేగంగా నడుపుతూ నిబంధనలు అతిక్రమించాడు. అసలు కర్ఫ్యూ సమయంలో బయటకు ఎందుకు వచ్చాడు? అనేది తెలియాల్సి ఉంది. చదవండి: తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు చదవండి: ఒకేసారి నాలుగు ప్రాణాలు: కుటుంబాన్ని చిదిమేసిన కరోనా -
ఇక మన రోడ్లపైనా ఎలక్ట్రిక్ కార్ల హవా
ముంబై, సాక్షి: ఇటీవల ప్రపంచ మార్కెట్లను వేడెక్కిస్తున్న ఎలక్ట్రిక్ కార్ల ట్రెండ్ దేశీయంగానూ ఊపందుకోనుంది. 2021లో పలు దిగ్గజ కంపెనీలు దేశీ మార్కెట్లో విభిన్న ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. దేశీయంగా ఎలక్ట్రిక్ కార్ల పోటీకి ఆడి, జాగ్వార్, టెస్లా తదితరాలు సై అంటున్నట్లు ఆటో రంగ నిపుణులు పేర్కొంటున్నారు. వెరసి గతంలో ఎన్నడూలేని విధంగా దేశీ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో పలు మోడళ్లు రంగ ప్రవేశం చేయనున్నట్లు తెలియజేశారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం 2,500 వాహనాల వరకూ దిగుమతి చేసుకునేందుకు అనుమతించడం మద్దతిస్తున్నట్లు చెప్పారు. దీంతో అత్యున్నత సాంకేతికతతో కూడిన ఆధునిక వాహనాలు దేశీ రహదారులపై పరుగులు తీసేందుకు సన్నద్ధమవుతున్నట్లు వివరించారు. ఆటో రంగ నిపుణులు వెల్లడించిన వివరాలు చూద్దాం.. ఆడి ఈ-ట్రాన్ ఆడి సంస్థ రూపొందిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల్లో ఈ-ట్రాన్ కీలక మోడల్. పూర్తి ఎలక్ట్రిఫికేషన్ దిశలో ఆడి తీసుకువస్తున్న ఈ-ట్రాన్ బ్రాండ్ దేశీయంగా విడుదలకానున్న తొలి విలాసవంత(హైఎండ్) కారుగా నిలవనుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 17,641 వాహనాలు విక్రయమయ్యాయి. దేశీ మార్కెట్లో తొలిగా విడుదలైన మోడల్‌గా ప్రయోజనాలు పొందే వీలుంది. తొలి దశలో పూర్తిగా నిర్మితమైన వాహనం(సీబీయూ)గా తక్కువ సంఖ్యలోనే దిగుమతికానున్నాయి. అయితే రెండు ఎలక్ట్రిక్ మోటార్ల ద్వారా విడివిడిగా యాక్సిల్స్‌ను నడిపించే శక్తితో వాహనం, అమ్మకాలు వేగాన్ని అందిపుచ్చుకోనున్నాయి. జనవరి చివర్లో విడుదలకానున్న ఈ-ట్రాన్ గరిష్టంగా 357 కిలోమీటర్లు ప్రయాణించగలదని అంచనా. జాగ్వార్ 1-పేస్ 2019 వరల్డ్ కార్గా ఎంపికైన జాగ్వార్ 1-పేస్ వాహనాలు ఇటీవల పరిశీలనాత్మకంగా ముంబైలో సందడి చేస్తున్నాయి. యూఎస్ దిగ్గజం టెస్లా ఇంక్ సైతం రేసులోకి రానుండటంతో అతిత్వరలోనే కారు విడుదల తేదీ ఖరారయ్యే వీలుంది. 90 కిలోవాట్స్ లిథియం అయాన్ బ్యాటరీతో, 394 బీహెచ్పీ గరిష్ట శక్తిని అందుకోనుంది. టాప్ఎండ్ హెచ్ఎస్ఈ మోడల్ ద్వారా దేశీయంగా తయారవుతున్న రెండో ఎలక్ట్రిక్ లగ్జరీ కారుగా నిలవనుంది. గరిష్టంగా 470 కిలోమీటర్లు ప్రయాణించగలదని అంచనా. అంచనా ధర రూ. 1.5-2 కోట్లు. (జీప్ స్పీడ్‌కు ఫియట్ క్రిస్లర్ సై) టెస్లా మోడల్-3 యూఎస్ కంపెనీ టెస్లా రూపొందించిన ఎలక్ట్రిక్ కారు మోడల్-3 దేశీయంగా విడుదలకానున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశాక ఆసక్తి బాగా పెరిగింది. గ్లోబల్ ఆటో రంగంలో సంచలనాలకు నెలవుగా నిలుస్తున్న మోడల్-3 ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో వేగవంత విక్రయాలను సాధిస్తోంది. టెస్లా ఇంక్ తయారీలో అత్యధిక అమ్మకాలు సాధిస్తున్న ఈ వాహనం ఎంట్రీలెవల్ విభాగంలో పోటీకి దిగనుంది. 5 సెకన్లలోపే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల మోడల్-3 గరిష్టంగా 420 కిలోమీటర్లు ప్రయాణించగలదని అంచనా. డాష్‌బోర్డుకు అనుసంధానించిన ల్యాప్‌టాప్ మోడల్ 15 అంగుళాల టచ్ స్క్రీన్‌తో రానుంది. ఏప్రిల్ తదుపరి మార్కెట్లో విడుదలకావచ్చు. అంచనా ధర: రూ. 60 లక్షలు. (ప్రపంచ కుబేరుడిగా ఎలన్ మస్క్?) పోర్ష్ టేకెన్ కంపెనీకున్న దశాబ్దాల ఇంజినీరింగ్ సామర్థ్యాలతో నాలుగు డోర్లు కలిగిన ఎలక్ట్రిక్ కారును టేకెన్ బ్రాండుతో పోర్ష్ రూపొందించింది. కోవిడ్-19 కారణంగా విడుదల ఆలస్యమైన టేకెన్ ఫిబ్రవరిలో దేశీ మార్కెట్లలో ప్రవేశించే వీలుంది. పోర్ష్ నుంచి వస్తున్న తొలి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ కారు ఇది. ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో అత్యంత శక్తికలిగిన కారు కూడా. 79.2 కిలోవాట్స్ బ్యాటరీ, 600 బీహెచ్పీ శక్తితో రూపొందింది. గరిష్టంగా 500 కిలోమీటర్లు ప్రయాణించగలదని అంచనా. 3.5 సెకన్లలోనే 0-100 కిలోమీటర్ల వేగం అందుకోగలదు. 800 వోల్డ్ ఫాస్ట్ చార్జింగ్ ద్వారా 20 నిముషాల్లోనే 80 శాతం చార్జింగ్కు వీలున్నట్లు కంపెనీ చెబుతోంది. అంచనా ధర: రూ. 2.2-2.5 కోట్లు వోల్వో ఎక్స్‌సీ40 రీచార్జ్ స్వీడిష్ దిగ్గజం వోల్వో రూపొందించిన పూర్తి ఎలక్ట్రిక్ కారు ఎక్స్‌సీ 40 రీచార్జ్. వోల్వో తయారీ ఎస్60 మోడల్ విడుదల తదుపరి మార్కెట్లో ప్రవేశించనుంది. ట్విన్ మోటార్లు కలిగిన రీచార్జ్ 408 బీహెచ్పీ పవర్‌ను కలిగి ఉంది. 78 కిలోవాట్ల బ్యాటరీతో వెలువడనుంది. ఏసీ లేదా 150 కిలోవాట్స్ డీసీ ఫాస్ట్ చార్జర్ ద్వారా చార్జ్ చేసుకోవచ్చు. తొలిసారి ఆండ్రాయిడ్ ఆధారిత ఎంటర్టైన్మెంట్ సిస్టమ్‌ను వోల్వో ఏర్పాటు చేసింది. గరిష్టంగా 400 కిలోమీటర్లు ప్రయాణించే అవకాశముంది. అంచనా ధర: రూ. 50 లక్షలు. టాటా ఆల్ట్రోజ్ఈవీ ఓవైపు ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో విలాసవంత మోడళ్ల హవా ప్రారంభంకానున్నప్పటికీ మరోపక్క దేశీ ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ అందుబాటు ధరల్లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై దృష్టిపెట్టి సాగుతోంది. దేశంలోనే చౌక ఎలక్ట్రిక్ కారుగా టాటా నెక్సాన్ ఈవీను తీసుకువచ్చిన కంపెనీ ప్రీమియం ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌గా ఆల్ట్రోజ్ ఈవీని రూపొందించింది. అందుబాటు ధరల ఈ కార్ల వినియోగదారులు టాటా మోటార్స్ దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న చార్జింగ్ నెట్వర్క్ ద్వారా లబ్ది పొందేందుకూ వీలుంటుంది. గరిష్టంగా 300 కిలోమీటర్లు ప్రయాణించే వీలుంది. ఫిబ్రవరిలో మార్కెట్లో ప్రవేశించవచ్చు. అంచనా ధర: రూ. 14 లక్షలు. -
బీఎండబ్ల్యూ కారును నదిలో తోసేశాడు.. ఎందుకంటే..
చండీగఢ్ : తనకు నచ్చిన కారు కొనివ్వలేదని తల్లిదండ్రులు బహుమతిగా ఇచ్చిన బీఎండబ్ల్యూ కారును నదిలో వదిలాడు ఓ పుత్రరత్నం. పైగా అదేదో ఘనకార్యం చేసినట్లు వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఘటన హరియాణాలోని యమునానగర్‌లో చోటు చేసుకుంది. యమునానగర్ పట్టణానికి చెందిన ఓ యువకుడికి జాగ్వార్ కారు అంటే ఎంతో ఇష్టం. తనకు జాగ్వార్ కారును బహుమతిగా కొనివ్వాలని కుమారుడు తల్లిదండ్రుల్ని కోరాడు. తల్లిదండ్రులు కుమారుడికి నచ్చిన జాగ్వార్ కారు కాదని, బీఎండబ్ల్యూ కారు కొని బహుమతిగా ఇచ్చారు. బీఎండబ్ల్యూ కారంటే ఇష్టం లేని కుమారుడు దాన్ని తీసుకెళ్లి యమునానగర్ నదిలో వదిలేసి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. ఈ తతంగాన్ని వీడియో తీయించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో ఆధారంగా యువకుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
‘దేవుడే రక్షించాడు’
కారు ప్రమాదంలో గవాస్కర్ సురక్షితం లండన్: మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆదివారం నాలుగో టెస్టు ముగిసిన అనంతరం జాగ్వార్ కారులో సన్నీతో పాటు అతడి స్నేహితుడు చంద్రేశ్ పటేల్, మరో వ్యాఖ్యాత మార్క్ నికోలస్ మాంచెస్టర్ నుంచి లండన్‌కు ప్రయాణమయ్యారు. భారీ వర్షంలో వేగంగా ప్రయాణిస్తున్న వీరి కారును ఎదురుగా వస్తున్న మరో వాహనం ఢీకొంది. అప్పటికీ డ్రైవర్ కారును కుడి వైపు తిప్పి ప్రమాదం నుంచి తప్పించాలనుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది. వెనుక సీట్లో ఎడమ వైపున గవాస్కర్ కూర్చోగా ఎదురుగా వచ్చిన వాహనం కూడా అదే వైపున ఢీకొంది. అయితే జాగ్వార్ పూర్తిగా దెబ్బతినగా కారులో సన్నీతో పాటు ప్రయాణిస్తున్న ఇతరులు కూడా అదృష్టవశాత్తు బతికి బయటపడ్డారు. ఈ సమయంలో వీరి డ్రైవర్ కాస్త వేగంగానే నడుపుతుండగా వెనక నుంచి గవాస్కర్ హెచ్చరించినట్టు సమాచారం. ఆ తర్వాత షాక్‌కు గురైన వీరంతా సమీప రైల్వే స్టేషన్‌కు నడుచుకుంటూ వెళ్లి లండన్‌కు రైలులో వెళ్లారు. ‘నిజంగా మమ్మల్ని దేవుడే రక్షించాడు. ఘటన సమయంలో భారీ వర్షం కురుస్తోంది. మా కారు కూడా చాలా వేగంగా వెళుతోంది. ప్రమాదం చాలా దారుణంగా ఉన్నా మాకెవరికీ గాయాలు కాలేదు. నేను మాత్రం షాక్‌తో వ ణికిపోయాను’ అని గవాస్కర్ చెప్పారు.