
చండీగఢ్ : తనకు నచ్చిన కారు కొనివ్వలేదని తల్లిదండ్రులు బహుమతిగా ఇచ్చిన బీఎండబ్ల్యూ కారును నదిలో వదిలాడు ఓ పుత్రరత్నం. పైగా అదేదో ఘనకార్యం చేసినట్లు వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఘటన హరియాణాలోని యమునానగర్‌లో చోటు చేసుకుంది.
యమునానగర్ పట్టణానికి చెందిన ఓ యువకుడికి జాగ్వార్ కారు అంటే ఎంతో ఇష్టం. తనకు జాగ్వార్ కారును బహుమతిగా కొనివ్వాలని కుమారుడు తల్లిదండ్రుల్ని కోరాడు. తల్లిదండ్రులు కుమారుడికి నచ్చిన జాగ్వార్ కారు కాదని, బీఎండబ్ల్యూ కారు కొని బహుమతిగా ఇచ్చారు. బీఎండబ్ల్యూ కారంటే ఇష్టం లేని కుమారుడు దాన్ని తీసుకెళ్లి యమునానగర్ నదిలో వదిలేసి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. ఈ తతంగాన్ని వీడియో తీయించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో ఆధారంగా యువకుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment