ఈ దేశాన్ని, ఇక్కడి నేలని, ఇక్కడి ప్రజలను ప్రేమించే పారిశ్రామికవేత్తల్లో ముందు వరుసలో వినిపించే పేరు రతన్‌టాటాది. లక్షల కోట్ల రూపాయల సంపద ఉన్నా.. సింపుల్‌గా జీవించడం ఆయనకే చెల్లుతోంది. సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్‌గా ఉండని రతన్ టాటా హఠాత్తుగా ఓ ట్వీట్ చేశారు. అది కూడా ఒక రాక్‌స్టార్ గురించి. స్థితప్రజ్ఞతకు మారు పేరులా కనిపించే రతన్‌టాటానే ఫోటో దిగేలా చేసిన ఆ రాక్ స్టార్ గన్స్ అండ్ రోజెస్ బ్యాండ్‌కి చెందిన స్లాష్.
గన్స్ అండ్ రోజెస్
అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌కి చెందిన గన్స్ అండ్ రోజెస్ బ్యాంక్‌కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ బృందం నిర్వహించే బ్యాండ్స్‌కి ఫుల్ క్రేజ్ ఉంది. 1987 నుంచి ఈ రాక్‌బ్యాండ్ బృందం అలుపెరుగని ప్రదర్శనలు ఇస్తూ లెక్కకు మిక్కిలిగా అభిమానులను సంపాదించింది. అందులో ఒకరే మన రతన్ టాటా.
జాగ్వర్ వల్లే
బిజినెస్ రొటీన్ వర్క్‌లో భాగంగా రతన్ టాటా అమెరికాలోని గప్లిన్‌లో ఉన్న జాగ్వర్ షోరూమ్‌కి వెళ్లారు. అదే సమయంలో జాగ్వర్ కారు కొనుగోలు చేసేందుకు గన్స్ అండ్ రోజెస్ బ్యాంక్‌కి చెందిన స్లాష్ అక్కడికి వచ్చారు. వెంటనే స్లాష్‌తో కలిసి ఓ ఫోటో దిగి తన ముచ్చట తీర్చుకున్నారు రతన్ టాటా. ఈ ఫోటోని తీసింది మరో ప్రముఖుడైన బ్రియాన్ అల్లాన్. తాజాగా ఈ ఫోటోను రతన్ టాటా ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.
The Day I visited Galpin Jaguar on one of my retail outlet visits, I was excited to meet this gentleman from Guns N’ Roses who was taking delivery of his new Jaguar XKR. A very polite rockstar, Slash 🎸
— Ratan N. Tata (@RNTata2000) January 14, 2022
Clicked by Brian Allan pic.twitter.com/BUeKZ1zkWl
చదవండి: ఫెస్టివల్ సీజన్ సందర్భంగా రతన్‌టాటా స్పెషల్ గ్రీటింగ్స్..!
Comments
Please login to add a commentAdd a comment