టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ ఇంటికి కొత్త జాగ్వార్ మోడల్ కారు వచ్చింది. జాగ్వార్-ఎఫ్ టైప్ మోడల్ ఎరుపు రంగులో ఉన్న కారును షమీ ఎంతో ఇష్టంగా కొనుగోలు చేశాడు. శుక్రవారం షమీకి అందించిన జాగ్వార్ ఎఫ్-టైప్ 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో కూడిన కూపే. దీని ఇంజన్ గరిష్టంగా 295 బిహెచ్‌పి పవర్.. 400 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ధర దాదాపు రూ. 98.13 లక్షలు(ఎక్స్ షో రూమ్).
కాగా షమీకి కార్లు, బైక్‌లంటే యమా క్రేజ్. ఇప్పటికే తన ఇంట్లో టయోట ఫార్చునర్, బీఎండబ్ల్యూ 5 సిరీస్, ఆడి కారు ఉన్నాయి. ఇటీవలే షమీ ఐకానిక్ బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 650ని ఉత్తర్ ప్రదేశ్ నుంచి తెప్పించుకున్నాడు. దానికి సంబంధించిన ఫోటోలను షమీ తన ఇన్‌స్టాగ్రామ్‌లోనూ పంచుకున్నాడు.
ఇటీవలే ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మంచి ప్రదర్వననే కనబరిచాడు. ఇంగ్లండ్‌తో తొలివన్డే ద్వారా150 వికెట్ల మార్క్ అందుకున్న షమీ.. అత్యంత వేగంగా ఆ ఘనతను సాధించిన తొలి టీమిండియా బౌలర్‌గా షమీ నిలిచాడు. 80 మ్యాచ్‌ల్లో 150 వికెట్ల మార్క్‌ను అందుకున్న షమీ ఓవరాల్‌గా అఫ్గనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌తో సంయుక్తంగా ఉన్నాడు. విండీస్‌తో వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న షమీ టి20 సిరీస్‌లో మాత్రం ఆడనున్నాడు.
చదవండి: ఇన్‌స్టాగ్రామ్‌లోనూ 'కింగే'.. ఒక్క పోస్టుకు ఎంత సంపాదిస్తున్నాడంటే?
Comments
Please login to add a commentAdd a comment