టీమిండియాకు గుడ్ న్యూస్. చాలాకాలం తర్వాత స్టార్ పేసర్ మహ్మద్ షమీ క్రికెట్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ప్రస్తుతం ఎన్‌సీఏలో శిక్షణలో ఉన్న షమీ.. అక్టోబర్‌లో మొదలయ్యే రంజీ ట్రోఫీలో బరిలో ఉంటాడని సమాచారం. షమీ ఈ ఏడాది చివర్లో జరిగే ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపిక కావడం ఖాయమని బీసీసీఐ కార్యదర్శి జై షా చెప్పాడు.
షమీని త్వరలో జరిగే బంగ్లాదేశ్ సిరీస్‌కు ఎంపిక చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. షమీ ప్రస్తుతం గాయం నుంచి పూర్తిగా కోలుకుని ప్రాక్టీస్‌లో బిజీగా ఉన్నాడు. షమీ రాకతో టీమిండియా పేస్ బలం మరింత పెరగనుంది. షమీ తుది జట్టులోకి వస్తే టీమిండియాకు తిరుగుండదు. భారత్ ఈ ఏడాది బంగ్లాదేశ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాలతో కీలక సిరీస్‌లు ఆడనుంది.
ఈ ఏడాది భారత్ ఆడబోయే మ్యాచ్‌ల వివరాలు..
సెప్టెంబర్ 19-23 వరకు బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ (చెన్నై)
సెప్టెంబర్ 29-అక్టోబర్ 1 వరకు బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్ (కాన్పూర్)
అక్టోబర్ 6- బంగ్లాదేశ్‌తో తొలి టీ20
అక్టోబర్ 9- బంగ్లాదేశ్‌తో రెండో టీ20
అక్టోబర్ 12- బంగ్లాదేశ్‌తో మూడో టీ20
అక్టోబర్ 16-20 వరకు న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్ (బెంగళూరు)
అక్టోబర్ 24-28 వరకు న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్ (పూణే)
నవంబర్ 1-5 వరకు న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్ (ముంబై)
నవంబర్ 8- సౌతాఫ్రికాతో తొలి టీ20 (డర్బన్)
నవంబర్ 10- సౌతాఫ్రికాతో రెండో టీ20 (క్వెబెర్బా)
నవంబర్ 13- సౌతాఫ్రికాతో మూడో టీ20 (సెంచూరియన్)
నవంబర్ 15- సౌతాఫ్రికాతో నాలుగో టీ20 (జొహనెస్‌బర్గ్)
నవంబర్ 22-26 వరకు ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ (పెర్త్)
డిసెంబర్ 6-10 వరకు ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్ (అడిలైడ్)
డిసెంబర్ 14-18 వరకు ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ (బ్రిస్బేన్)
డిసెంబర్ 26-30 వరకు ఆస్ట్రేలియాతో నాలుగో టెస్ట్ (మెల్‌బోర్న్)
జనవరి 3-7 వరకు ఆస్ట్రేలియాతో ఐదో టెస్ట్ (సిడ్నీ)
Comments
Please login to add a commentAdd a comment