వైఎస్ జగన్ యువభేరీ 27కు వాయిదా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 21న కాకినాడలో చేపట్టిన యువభేరీ కార్యక్రమంలో స్వల్ప మార్పు జరిగింది.
ఈ కార్యక్రమాన్ని 27న నిర్వహించనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. యువభేరీ సభకు పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ కోరింది.