ముగిసిన బాల్ బ్యాడ్మింటన్ పోటీలు
చాగల్లు : స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో మూడు రోజుల పాటు నిర్వహించిన అంతర జిల్లాల అండర్–17 స్కూల్ గేమ్స్ బాలబాలికల బాల్ బ్యాడ్మింటన్ పోటీలు శనివారంతో ముగిశాయి. బాలుర విభాగంలో ప్రథమస్థానంలో తూర్పు గోదావరి జిల్లా జట్టు, ద్వితీయస్థానంలో విశాఖపట్టణం, తృతీయస్థానంలో గుంటూరు, నాలుగోస్థానంలో విజయనగరం జట్లు నిలిచాయి. బాలికల విభాగంలో విశాఖపట్టణం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లా జట్లు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయస్థానాల్లో నిలిచాయి. ముగింపు కార్యక్రమానికి మంత్రి పీతల సుజాత, ఎమ్మెల్యే కేఎస్ జవహర్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఏఎంసీ చైర్మన్ ఆళ్ల హరిబాబు, ఎంపీపీ కోడూరి రమామణి, సర్పంచ్‌లు జొన్నకూటి వెంకాయమ్మ, ఓబా దుర్గ, స్కూల్ గేమ్స్ జిల్లా ఆర్గనైజేషన్ కార్యదర్శి సాయి శ్రీనివాస్, పోటీల ఆర్గనైజింగ్ కార్యదర్శి సీహెచ్ సతీష్‌కుమార్, కె.రామ్‌కుమార్, పీఈటీలు పాల్గొన్నారు.