Mahesh Babu
-
SSMB 29: మహేశ్‌కి జక్కన్న కండీషన్.. నిర్మాతకు రూ. కోటి సేఫ్!
రాజమౌళి(SS Rajamouli )తో సినిమా అంటే నటీనటులు ఎంత ఇష్టపడతారో అంతే భయపడతారు కూడా. ఒక్కసారి ఆయనతో సినిమా కమిట్ అయితే చాలు.. షూటింగ్ పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరు ఆయన మాట వినాల్సిందే. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే జక్కన్న పెట్టే కండీషన్స్ ఫాలో అవ్వాల్సిందే. ప్రస్తుతం ఈ దర్శకధీరుడు మహేశ్ బాబు(Mahesh Babu)తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే షూటింగ్ కూడా ప్రారంభమైంది. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ మూవీ కాబట్టి… ఖర్చుల దగ్గర జక్కన్న చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అనవసరపు ఖర్చులు తగ్గించి, ఆ డబ్బంతా సినిమా క్వాలిటీ కోసం ఖర్చు చేయబోతున్నారట. ఈ నేపథ్యంలో జక్కన్న ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెట్లో ప్లాస్టిక్‌ని పూర్తిగా నిషేదించారట. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌ని సెట్లోకి అనుమతించట్లేదట. మహేశ్‌బాబుతో సహా ప్రతి ఒక్కరు ఈ రూల్‌ని పాటించాల్సిందేనట.నిర్మాతలకు రూ.కోటి వరకు సేఫ్రాజమౌళి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్లో రోజుకు దాదాపు రెండు వేల మంది వరకు పాల్గొంటున్నారట. అంత మందికి వాటర్ బాటిళ్లు అందించడం అంటే చాలా ఖర్చు అవుతుంది. అందుకే సెట్లో గాజు బాటిళ్లను ఏర్పాటు చేయిస్తున్నారట. దాహం వేస్తే ప్రతి ఒక్కరు దీనితోనే నీళ్లు తాగాలట. పర్సనల్‌గా తెచ్చుకున్న ప్లాస్టిక్ బాటిల్ అయితే ఉండొద్దని చెప్పారట. అలాగే ప్లాస్టిక్ వస్తువులను కూడా తప్పనిసరి పరిస్థితుల్లోనే వాడలని చెప్పారట. వీలైనంత వరకు ప్లాస్టిక్‌ని నిషేదించాలని యూనిట్‌ని ఆదేశించారట. దీని వల్ల నిర్మాతకు దాదాపు రూ. కోటి వరకు సేఫ్ అవుతుందట. ఈ నిర్ణయం కారణంగా డబ్బు ఆదా అవ్వడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు సహాయపడినట్లు అవుతుందని జక్కన్న ప్యామిలీ భావిస్తుందట. ఈ ఆలోచన కీరవాణి సతీమణి వల్లీకి వచ్చిందట. ఆమె చెప్పడంతోనే రాజమౌళి ప్లాస్టిక్ బాటిళ్లను నిషేదించారట.మహేశ్ సినిమాకు టైటిల్ కష్టాలు..మహేశ్- రాజమౌళి కాంబినేషన్లో సినిమా వస్తుందని చాలా రోజుల కిందటే ప్రకటించారు. ఆర్ఆర్ఆర్ తర్వాత తాను మహేశ్‌తో సినిమా చేస్తున్నానని రాజమౌళి ప్రకటించినప్పటికీ.. కథ అప్పటికీ ఫిక్స్ కాలేదు. ఆర్ఆర్ఆర్ రిలీజైన కొద్ది రోజులకి ఈ కథపై దృష్టి పెట్టాడు. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో మాత్రం జక్కన్నకు ఇంకా క్లారిటీ రాలేదట. గతంలో గరుడ, మహారాజ్ లాంటి టైటిల్స్ వినిపించినా... ఏది ఫైనల్ కాలేదు. ప్రస్తుతం షూటింగ్ చేస్తూనే టైటిల్ ఫైనల్ చేసే పనిలో ఉంది జక్కన్న టీమ్. టైటిల్ పెట్టే వరకు మీడియాకు దూరంగా ఉండాలని, ఎలాంటి ఈవెంట్స్ నిర్వహించొద్దని రాజమౌళి ఆదేశించారట. అందుకే ఎలాంటి హడావుడి లేకుండా షూటింగ్‌ని ప్రారంభించారు. టైటిల్ ఫిక్స్ అయిన తర్వాత చిన్న టీజర్‌ని రిలీజ్ చేస్తూ టైటిల్‌ని వెల్లడించాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట. -
ఈ స్టార్ హీరోల రెస్టారెంట్స్, పబ్స్ గురించి తెలుసా..?
ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న వ్యాపారరంగంలోకి కంగనా రనౌత్ అడుగుపెట్టారు. సినీ, రాజకీయ రంగాల్లో బిజీగా ఉన్న ఆమె హిమాచల్‌లోని మనాలిలో కేఫ్‌ను ప్రారంభించారు. హిమాలయాల నడిబొడ్డున ‘ది మౌంటెన్ స్టోరీ’ పేరుతో ఒక సుందరమైన రెస్టారెంట్‌ను ప్రారంభించడంతో అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే, హైదరాబాద్ వేదికగా కొందరు సినీ సెలబ్రిటీలు పలు రెస్టారెంట్స్లను ప్రారంభించారు. విలాసవంతమైన ఆహారం, బ్రేవరేజస్తో పాటు, అధునాతన జీవన శైలికి అద్ధం పట్టే అద్భుతమైన ఇంటీరియర్ ఫ్యాషన్ లుక్ నేటి రెస్టారెంట్ కల్చర్‌లో భాగమైపోయింది. అయితే నగర వాసుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరినీ ఆకర్షించేందుకు ఎవరికి వారు తమ సొంత స్టైల్లో యునీక్ యాంబియన్స్ కోసం తాపత్రయపడుతున్నారు.బంజారా హిల్స్‌లో మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ 'AN రెస్టారెంట్'తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ డిసెంబర్ 8, 2022న AN రెస్టారెంట్‌ని బంజారా హిల్స్‌లో ప్రారంభించారు. మినర్వా, ఆసియన్ ఫుడ్ గ్రూపులతో కలిసి వారు దీనిని ప్రారంభించారు. రెస్టారెంట్లో అద్భుతమైన ఇంటీరియర్స్, అగ్రశ్రేణి సర్వీస్‌తో పాటు వివిధ రకాల ప్రపంచ వంటకాలతో భారీగానే మెనూ లిస్ట్ ఉంటుంది. ఆహార ప్రియులకు తప్పకుండా నచ్చేలా ఇక్కడి ఫుడ్ ఉంటుందని చాలామంది పేర్కొన్నారు.విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల వన్–8 కమ్యూన్గత ఏడాదిలో హైదరాబాద్‌లోని హైటెక్ సిటీకి దగ్గరలో వన్–8 కమ్యూన్ పేరుతో ఒక లగ్జరీ రెస్టారెంట్‌ను కోహ్లీ, అనుష్క శర్మ ప్రారంభించారు. హైదరాబాద్‌కు ఉన్న రాజసాన్ని, రిచ్ ఫ్లేవర్‌ను ప్రతిబింబిస్తుంది. ఇందులోని కిచెన్.. పాక ప్రపంచానికి నూతన హంగులు అద్దిందని ఫుడ్ లవర్స్ చెబుతున్నారు. వన్–8 కమ్యూన్ బ్రాండ్ ఎథోస్‌కు కట్టుబడి, రెస్టారెంట్ డిజైన్ అందంగా, ఆహ్లాదంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా ఇక్కడి వింటేజ్ లుక్స్ నగరవాసులను విశేషంగా ఆకర్షిస్తుంది. జుహు, బెంగుళూరు, గుర్గావ్లలో ఇప్పటికే ఆదరణ పొందుతున్న ఈ రెస్ట్రో బార్‌ను ఇక్కడ ఏర్పాటు చేయడంతో చాలామంది చిల్ అవుతున్నారు. ఫుడ్ లవర్స్‌తో పాటు క్రికెట్ ప్రియులు సైతం ఆసక్తిగా ఇక్కడికి విచ్చేస్తున్నారు. రెస్ట్రో బార్లో భాగంగా రిచ్ ఫుడ్ డిషెస్‌తో పాటు బ్రేవరేజస్ అందుబాటులో ఉండటంతో అన్ని వర్గాల వారికీ హాట్ స్పాట్‌గా మారింది. కోహ్లీకి అత్యంత ఇష్టమైన కార్న్ బార్లీ రిసోట్టో, మష్రూమ్ గూగ్లీ డిమ్ సమ్, టార్టేర్ టాప్డ్ అవకాడో వంటి పలు వంటకాలను ప్రత్యేకంగా వండి వడ్డిస్తున్నారు.రకుల్ ప్రీత్ సింగ్ 'ఆరంభం'గచ్చిబౌలి 'ఎఫ్ 45' పేరుతో జిమ్‌ను ప్రారంభించిన రకుల్ ప్రీత్ సింగ్ .. జూబ్లీహిల్స్‌లో కూడా ఓ బ్రాంచ్ మొదలు పెట్టి లీజ్‌కు ఇచ్చేసింది. అయితే, ఆరోగ్యంపై అవగాహన పెంచే ప్రయత్నంలో, నటి రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాద్‌లో మిల్లెట్ ఆధారిత రెస్టారెంట్‌ను ప్రారంభించారు. హైదరాబాద్‌లోని మాదాపూర్ వద్ద 'ఆరంభం' పేరుతో ఒక రెస్టారెంట్‌ను ఓపెన్ చేశారు. Curefoods భాగస్వామ్యంతో, సాంప్రదాయ భారతీయ వంటకాల డొమైన్లో మిల్లెట్-ఎయిడెడ్ ఆరోగ్యకరమైన ఆహారాన్ని పరిచయం చేయడానికి ఆమె ఈ వెంచర్‌ను ప్రారంభించారు. మిల్లెట్‌ను భారతీయ ఆహారంలో ప్రధాన భాగం చేయడానికి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలతో ఈ చొరవ తీసుకున్నట్లు ఆమె చెప్పారు. రుచిలో రాజీ పడకుండా ఆరోగ్యకరమైన, పోషకమైన భోజనం అందిస్తున్నట్లు ఆమె రెస్టారెంట్‌పై ప్రశంసలు వచ్చాయి. అల్లు అర్జున్ హైలైఫ్పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో అభిమానులను సొంతం చేసుకున్న అల్లు అర్జున్ కూడా రెస్టారెంట్ వ్యాపారంలో ఉన్నారు. అంతర్జాతీయ రేంజ్లో గుర్తింపు ఉన్న హైలైఫ్ బ్రూయింగ్ కంపెనీ గురించి వినే వింటారు. హైలైఫ్ పేరుతో 2016లోనే జూబ్లీహిల్స్‌లో ఈ రెస్టారెంట్‌ను ఆయన ప్రారంభించారు. అంతర్జాతీయ హాస్పిటాలిటీ బ్రాండ్ M కిచెన్, నిర్మాత కేదార్ సెలగంశెట్టితో కలిసి రన్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్లోబఫెలో వైల్డ్ వింగ్స్ (B-డబ్స్) అనే అమెరికన్ రెస్టారెంట్‌ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ రెండూ కూడా హైదరాబాద్‌లోని పార్టీలకు స్వర్గధామంగా మారాయి. మీరు ఏదైనా సందర్బంలో పార్టీ కోసం వెతుకుతున్నట్లయితే, హైలైఫ్ మీకు సరైన స్థలమని చెప్పవచ్చు.అక్కినేని నాగార్జున యొక్క 'N గ్రిల్, N ఏషియన్'టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జునకు కూడా హైదరాబాద్‌లో ప్రముఖ రెస్టారెంట్స్ ఉన్నాయి. జూబ్లీహిల్స్ వద్ద N గ్రిల్ పేరుతో ఆయనకు ఒక రెస్టారెంట్ ఉంది. 2014లో ఎంటర్ప్రెన్యూర్ ప్రీతం రెడ్డి సహకారంతో ఆయన దీనిని ప్రారంభించారు. ఇది ఆధునిక గ్రిల్ హౌస్‌గా గుర్తింపు ఉంది. దీంతో పాటు జూబ్లీ హిల్స్‌లో కూడా ఎన్ ఏషియన్ అనే చైనీస్ రెస్టారెంట్‌ని కూడా నాగ్ ఏర్పాటు చేయడం విశేషం. రెండు రెస్టారెంట్లు భారతీయ, ఇటాలియన్, పాన్ ఆసియన్‌తో పాటు మెడిటరేనియన్ వంటకాలను అందించే విభిన్న మెనూకు ప్రసిద్ధి చెందాయి. హైదరాబాద్‌లో ప్రీమియం డైనింగ్ అనుభవం కోసం వెతుకుతున్న ఆహార ప్రియుల కోసం ఈ ప్రదేశాలు బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. నాగ చైతన్య 'షోయూ'ఫుడ్ బిజినెస్‌లోకి 2022లోనే నాగచైతన్య ఎంట్రీ ఇచ్చేశాడు. 'షోయూ' పేరుతో జూబ్లీహిల్స్ ప్రాంతలో ఓ సరికొత్త రెస్టారెంట్‌ను ఆయన ఓపెన్ చేశాడు. అక్కడ అనేక రకాల పాన్-ఆసియన్ వంటకాలు దొరుకుతాయి. క్లౌడ్ కిచెన్‌గా తన వ్యాపారాన్ని ఆయన ప్రారంభించారు. స్విగ్గీ ఫుడ్ డెలివరీ సంస్థతో హైదరాబాద్ చుట్టూ ఉన్న ఆహారప్రియులకు తమ వంటకాలను అందిస్తుంది. రుచికరమైన జపనీస్ మీల్స్ అక్కడి ప్రత్యేకత. బ్రాండ్ స్థిరమైన ప్యాకేజింగ్‌ను ఉపయోగించడం ద్వారా పర్యావరణ స్పృహతో కూడిన విధానాన్ని అవలంబిస్తుంది, క్లయింట్లు పర్యావరణ ప్రయోజనకరమైన భోజన అనుభవాన్ని కలిగి ఉండేలా రెస్టారెంట్ యాజమాన్యం చూస్తుంది.నవదీప్- BPM పబ్హీరో నవదీప్ కూడా చాలా రోజుల క్రితమే ఒక పబ్‌ను ప్రారంభించారు. సినిమాల్లో బిజీగా ఉంటూనే ఈ వ్యాపారంలో ఆయన రాణించారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో బీట్స్ పర్ మినిట్ అకా BPM పబ్‌ను నవదీప్ నడుపుతున్నాడు. చాలామంది సెలబ్రిటీలు అక్కడకు వెళ్తూ ఉంటారు. -
డ్రాగన్ డ్యాన్స్ చేస్తే.. పాన్ ఇండియా ఊగిపోదా..
-
ఎప్పటికీ నీతోనే.. నమ్రతకు మహేశ్ లవ్ నోట్
సినీ ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం కామన్. ఇప్పటికే చాలా మంది హీరోహీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారిలో కొంతమంది మాత్రమే ఇప్పటికీ కలిసి సంతోషంగా ఉంటున్నారు. అలాంటి వారిలో మహేశ్-నమ్రత జంట ఒకటి. పెళ్లయి ఏళ్లు గడుస్తున్న ఇప్పటి వరకు ఈ జంటపై చిన్న రూమర్ కూడా రాలేదంటే.. ఎంత అనోన్యంగా ఉంటున్నారో అర్థం చేసుకోవచ్చు. నేడు(ఫిబ్రవరి 10) ఈ బ్యూటిఫుల్ కపుల్ 20వ పెళ్లి రోజు. ఈ సందర్భంగా తన సతీమణికి సోషల్ మీడియా వేదికగా యానివర్సరీ విషెస్ తెలియజేశాడు మహేశ్. ‘నువ్వు, నేను.. అందమైన 20 వసంతాలు. ఎప్పటికీ నీతోనే నమ్రత..’ అంటూ నమ్రత, తను కలిసి ఉన్న నవ్వుతున్న ఫోటోని ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. మహేశ్ అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు మహేశ్-నమ్రత జంటకి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.సినిమా కలిపిందిమహేశ్ బాబు, నమ్రతలను ఒక్కటి చేసింది ఓ సినిమా. వీరిద్దరు జంటగా వంశీ అనే సినిమాలో నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మనసులు కలిశాయి. ఓసారి ఈ సినిమా అవుట్డోర్ షూటింగ్లో భాగంగా చిత్ర యూనిట్ న్యూజిలాండ్ వెళ్లారు. దాదాపు 25రోజుల పాటు అక్కడే షూట్ చేశారు. ఆ సమయంలోనే వీరి స్నేహం మరింత బలపడింది.నమ్రత మహేశ్ కంటే నాలుగేళ్లు పెద్ద. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి ముందే ఆమె మిస్ ఇండియా పోటీల్లో గెలుపొందింది. వంశీ సినిమా షూటింగు తొలిచూపులోనే మహేశ్‌ను ఇష్టపడింది. న్యూజిలాండ్ షెడ్యూల్ నుంచి తిరిగి వచ్చాక మొదట నమ్రతనే తన ప్రేమను వ్యక్తపరిచింది. అప్పటికే నమ్రత అంటే మహేశ్‌కు ఎంతో ఇష్టం ఉండటంతో ఆయన కూడా వెంటనే ఓకే చెప్పేశారు. దాదాపు ఐదేళ్ల ప్రేమాయణం అనంతరం 2005 ఫిబ్రవరి 10న నమ్రత-మహేశ్‌లు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. 2005లో తెలుగు సంప్రదాయం ప్రకారం చాలా సింపుల్‌గా వీరి పెళ్లి జరిగింది. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
ఓటీటీలో 'మహేశ్ బాబు' మేనల్లుడి సినిమా స్ట్రీమింగ్
'దేవకీ నందన వాసుదేవ' మూవీ ఓటీటీలోకి రానుంది. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది. 'హీరో' అనే సినిమాతో మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ మూవీ పెద్దగా ఆడలేదు. ఇప్పుడు ఇతడు మరోసారి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీనే ఈ 'దేవకీ నందన వాసుదేవ'. ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ స్టోరీ అందించారు. మైథలాజికల్ యాక్షన్ సినిమాకు ఒక వర్గం ప్రేక్షకుల నుంచి పర్వాలేదనిపించింది. మేనల్లుడి కోసం మహేష్ బాబు కూడా ఇందులో నటించబోతున్నాడని నెట్టింట ప్రచారం దక్కడంతో ఈ సినిమాకు భారీ బజ్ క్రియేట్ చేసింది. అయితే, బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.ఫిబ్రవరి 8 నుంచి 'దేవకీ నందన వాసుదేవ' చిత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్కు రానుంది. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కానీ, హిందీ వర్షన్లో మాత్రమే విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అయితే, ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. అదే సమయంలో కలర్స్ సినీప్లెక్స్ ఛానెల్లోనూ ఈ చిత్రం ప్రసారం కానుంది. తెలుగు మూవీ అయినప్పటికీ ఓటీటీ, టీవీలో మొదట హిందీ వర్షన్ రావడం విశేషం. అయితే, తెలుగు వర్షన్ కూడా ఫిబ్రవరి 8 నుంచే అందుబాటులోకి రావచ్చని నెట్టింట ప్రచారం జరుగుతుంది.ప్రశాంత్ వర్మ పేరుతో ఈ సినిమాని పాన్ ఇండియాలో కూడా ప్రమోట్ చేశారు. 'ఆదిపురుష్'లో హనుమంతుడిగా చేసిన దేవదత్తా.. ఇందులో విలన్‌గా చేశాడు. 'దేవకి నందన వాసుదేవ' సినిమాలో కృష్ణుడు, కంసుడు రిఫరెన్స్‌లతో కథను రాసుకున్నారు. సాయి మాధవ్ చాలా అద్భుతమైన డైలాగ్స్ రాశారు. ఎమోషనల్ డెప్త్ పట్టుకుని కథకి తగ్గట్టుగా మాటలందించారు. భీమ్స్ ఈ సినిమాకి తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో మెప్పించాడు. -
ఓటీటీలో 'ముఫాసా: ది లయన్ కింగ్' స్ట్రీమింగ్
హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘ది లయన్ కింగ్ (2019)’ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘ముఫాసా: ది లయన్ కింగ్’ అనే చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. బారీ జెంకిన్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. వాల్ట్ డిస్నీ పిక్చర్స్ పతాకంపై అడెలె రోమన్ స్కీ, మార్క్ సెరియాక్ ఈ సినిమాను నిర్మించారు. డిసెంబరు 20న విడుదలైన ఈ సినిమా ఇండియాలో కూడా ప్రేక్షకులను మెప్పించింది. సుమారు రూ. 1260 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 3,200 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఓటీటీకి రానున్నడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.‘ముఫాసా: ది లయన్ కింగ్’ చిత్రం ఫిబ్రవరి 18న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రీమియర్ అవుతుంది. అయితే, రెంటల్ విధానంలో అధనంగా డబ్బు చెల్లించి ఈ చిత్రాన్ని చూసే అవకాశం ఉంటుంది. ఆపై ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ, ఫాండాంగోతో సహా వీడియో-ఆన్-డిమాండ్ (VOD) ప్రాతిపదికన అందుబాటులో ఉంటుంది. ఇక్కడ కూడా అదనంగా రెంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి మాత్రమే ఈ చిత్రాన్ని ఉచితంగా చూసే అవకాశం ఉంటుందని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు సంబంధించిన ఒకరు స్క్రీన్‌రాంట్ మీడియాతో తెలిపారు.ఇంగ్లిష్, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన ‘ముఫాసా: ది లయన్ కింగ్’ చిత్రంలో టైటిల్ రోల్‌కు టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్‌బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో తెలుగు ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. హిందీ వెర్షన్లో ముఫాసా పాత్రకు షారుక్ ఖాన్, ముఫాసా చిన్నప్పటి పాత్రకు ఆయన కుమారుడు అబ్రం వాయిస్ అందించారు. ఈ చిత్రంలోని సింబా పాత్రకు షారుక్ పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్ వాయిస్ ఇవ్వడం విశేషం. -
హీరో మహేష్‌బాబు ఓటు తొలగింపు
గుంటూరు: శాసనమండలి కృష్ణా–గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించిన ఓటరు జాబితాలో ప్రముఖ సినీ నటుడు ఘట్టమనేని మహేష్‌బాబు పేరుతో నమోదైన ఓటును తొలగించినట్లు గుంటూరు నగరపాలకసంస్థ అదనపు కమిషనర్, ఏఈఆర్వో చల్లా ఓబులేసు గురువారం తెలిపారు. గుంటూరులో హీరో మహేష్‌బాబుకు ఓటు శీర్షికతో బుధవారం ‘‘సాక్షి’’ మెయిన్ ఎడిషన్‌లో ప్రచురితమైన కథనానికి ఏఈఆర్వో స్పందించారు. మహేష్‌బాబు పేరుతో ఓటు తప్పుగా నమోదైందని, ఫారం–7 విచారణ అనంతరం ఓటును తొలగించామని వివరించారు. గుంటూరు అర్బన్‌లో దరఖాస్తులపై బూత్ లెవల్ అధికారులతో విచారణ చేయించామన్నారు. అర్హులైన వారి దరఖాస్తులను ఆమోదించినట్లు పేర్కొన్నారు. -
మహేశ్ మూవీలో విలన్?
మహేశ్‌బాబు మూవీలో విలన్‌గా నటించనున్నారట ప్రియాంకా చోప్రా. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ ఫిల్మ్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా ఓ కీలక పాత్రకు ఎంపికయ్యారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇటీవల ప్రియాంకా చోప్రా హైదరాబాద్ రావడం, కొన్ని రోజులు ఇక్కడే ఉండటం వంటి అంశాలు ఈ మూవీలో ఆమె భాగమయ్యారనే విషయాన్ని పరోక్షంగా స్పష్టం చేస్తున్నట్లుగా ఉన్నాయి. కాగా ఈ మూవీలో ప్రియాంకా చోప్రా హీరోయిన్గా నటిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. కానీ ఆమె చేయనున్నది హీరోయిన్ రోల్ కాదని, నెగటివ్ షేడ్స్ ఉన్న విలన్ రోల్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఇటీవల మహేశ్–ప్రియాంక పాల్గొనగా హైదరాబాద్‌లో షూట్ జరిగింది. ఇది టెస్ట్ షూట్ అని, కాదు రెగ్యులర్ షూట్ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. -
మా మధ్య గొడవలు లేవు : శిల్పా శిరోద్కర్
బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ (Shilpa Shirodkar) కొద్దిరోజుల క్రితం హిందీ బిగ్‌బాస్ 18వ సీజన్‌కు వెళ్లొచ్చింది. టాప్ 5లో ఉంటుందనుకున్న ఆమె 100 రోజుల జర్నీ తర్వాత గ్రాండ్ ఫినాలే వీక్ మధ్యలోనే ఎలిమినేట్ అయింది. కానీ, చాలామంది అభిమానాన్ని ఆమె దక్కించుకుంది. అయితే ఈ షోకు వెళ్లడానికి ముందు నమ్రతతో గొడవపడినట్లు బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడే శిల్ప చెప్పింది. ఆ సమయంలో వారిద్దరూ రెండు వారాలు మాట్లాడుకోలేదంది. ఫ్యామిలీ వీక్‌లో నమ్రత రావాలని కూడా ఆమె కోరుకుంది. కానీ, నమ్రతకు బదులుగా శిల్ప కూతురు బిగ్‌బాస్‌కు వెళ్లింది. శిల్పకు సపోర్ట్‌గా ఆమె అక్కాబావ నమ్రత శిరోద్కర్ (Namrata Shirodkar)- మహేశ్‌బాబు(Mahesh Babu) తనకు సపోర్ట్ చేయలేదని ప్రచారం జరిగింది. రెండు కుటుంబాల మధ్య తీవ్రమైన గొడవ జరిగిందని రూమర్స్ రావడంతో శిల్ప శిరోద్కర్ మరోసారి రియాక్ట్ అయింది.'సోషల్ మీడియాలో పెడుతున్న పోస్ట్‌ల వల్ల బంధాలను జడ్జ్ చేయడం తప్పు. సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా సంబంధాలను అంచనా వేయకూడదు.. మనుషుల మధ్య అనుబంధాన్ని తెలిపేందుకు సోషల్ మీడియా పోస్ట్ అవసరం లేదు. మేమిద్దరమూ మా భావాలను బహిరంగంగా వ్యక్తీకరించుకోలేం.. ఆన్లైన్ వేదికగా అలాంటివి మాకు ఇష్టం ఉండదు. నాకు సపోర్ట్‌గా నమ్రత పోస్ట్ చేస్తేనే మా మధ్య సంబంధాలు ఉన్నాయని, లేదంటే గొడవలు ఉన్నాయని ఊహించుకోవడం చాలా తప్పు. నా గుర్తింపు కోసం నేను బిగ్ బాస్ 18కి వెళ్లాను. నమ్రత సోదరి గానో లేదా మహేష్ మరదలిని కావడం వల్లో వెళ్లలేదు. వాస్తవానికి మహేశ్ ఒక సూపర్ స్టార్. ఆయన చాలా పాపులర్. కానీ, వారు నా కెరీర్లో భాగం కావాలని అర్థం కాదు కదా..? మహేశ్, నమ్రత ఇద్దరూ చాలా ప్రైవేట్‌గా ఉండాలనుకుంటారు. దీంతో వారికి పొగరు అని అందరూ అనుకుంటారు. ఇదీ ముమ్మాటికి నిజం కాదు. వారిద్దరూ చాలా మంచివారు. మహేశ్ చాలా సింపుల్, కూల్‌గా మాట్లాడుతారు. అతను చాలా మంచి వ్యక్తి. మీకు ఏదైనా అవసరమైతే.., ఎల్లప్పుడూ మీ కోసం అండగా నిలబడుతాడు.' అని శిల్పా పేర్కొంది. బిగ్ బాస్‌లో శిల్పా శిరోద్కర్‌కు ఓటు వేయాలని మహేశ్, నమ్రత శిరోద్కర్ విజ్ఞప్తి చేసి ఉంటే.. ఆమె తప్పకుండా గెలిచి ఉండేది అని చాలామంది భావించారు. ఈ క్రమంలో శిల్ప ఇలా రియాక్ట్ అయింది.నమ్రతను కలిసిన శిల్పతాజాగా శిల్ప.. నమ్రతను కలిసింది. వీరిద్దరూ కలిసి జాలీగా ఉన్న ఫోటోలను నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్.. ఇద్దరూ ట్విన్స్‌లా ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. జనవరి 22న నమ్రత బర్త్‌డే సందర్భంగా శిల్ప ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. హ్యాపీ బర్త్‌డే.. ఐ లవ్యూ సో మచ్. నేను నిన్ను ఎంతగా మిస్ అయ్యానో అస్సలు ఊహించలేవు. నువ్వు ఎప్పటికీ నా సొంతమే అంటూ నమ్రతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. -
కెన్యా కాలింగ్?
మహేశ్‌బాబు(Mahesh Babu) హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో అడ్వెంచరస్ యాక్షన్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ అతి కానుందని సమాచారం. హైదరాబాద్ శివార్లలో ఈ సినిమా కోసం భారీ సెట్ వర్క్ జరుగుతోంది. అలాగే గత ఏడాది అక్టోబరులో దర్శకుడు రాజమౌళి(Rajamouli) కెన్యా వెళ్లి, అక్కడి లొకేషన్స్‌ను పరిశీలించిన సంగతి గుర్తుండే ఉంటుంది.ముందుగా ఈ సినిమా షూటింగ్ కెన్యాలోనే ప్రారంభం అవుతుందని, ఆ దిశగా రాజమౌళి ఆల్రెడీ ఏర్పాట్లు పూర్తి చేశారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. ఇక ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా ఓ కీలక పాత్రలో నటించనున్నారు. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ లీడ్ రోల్ చేస్తారనే ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతోంది. అయితే ఈ విషయంపై ఇంకా ఏదీ ఫైనలైజ్ కాలేదని, ఏదైనా ఉంటే మేమే చెబుతామని పృథ్వీరాజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027లో విడుదల కావొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు కీరవాణి స్వరకర్త. -
మహేశ్ బాబు, నేను కలిసి క్వశ్చన్ పేపర్ కొనేవాళ్లం: టాలీవుడ్ డైరెక్టర్
ఆకాష్ మురళి, అదితి శంకర్ జంటగా నటించిన చిత్రం ప్రేమిస్తావా. ఈ మూవీని పంజా ఫేం విష్ణు వర్ధన్ డైరెక్షన్లో తెరకెక్కించారు. ఈ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సంక్రాంతి కానుకగా తమిళంలో ‘నేసిప్పాయా’ పేరుతో విడుదలై మంచి విజయం సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మైత్రీమూవీ మేకర్స్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేసేందుకు ముందుకొచ్చింది. జనవరి 30న ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారు. ప్రేమజంట మధ్య లవ్, రిలేషన్ షిప్, గొడవలు నేపథ్యంలో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.ఈ సినిమా రిలీజ్ సందర్భంగా దర్శకుడు విష్ణు వర్ధన్ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ప్రస్తుత సమాజంలో రిలేషన్ షిప్స్ ఎలా ఉన్నాయనే కోణంలో ఈ మూవీని తెరకెక్కించినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా సూపర్ స్టార్ మహేశ్ బాబు ఓకే స్కూల్లో చదివినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా తన బెంచ్‌మేట్ అయిన ప్రిన్స్ మహేశ్ బాబు గురించి ఆసక్తిక విషయాలు పంచుకున్నారు. మహేశ్ బాబుతో తన అనుబంధం గురించి ఆయన మాట్లాడారు. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.డైరెక్టర్ విష్ణు వర్ధన్ మాట్లాడుతూ..' మహేశ్ బాబుతో చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే మేమిద్దరం బెంచ్‌మేట్స్. ఆయనతో చాలా మధురమైన, సరదా క్షణాలు ఉన్నాయి. కొన్నింటిని బయటికే చెప్పలేం. మేము చెన్నైలో చదివే రోజుల్లో నేను చాలా యావరేజ్ స్టూడెంట్. బిలో యావరేజ్ అనుకోండి. మహేశ్ బాబుకు తెలుగుతో పాటు తమిళం కూడా బాగా మాట్లాడతాడు. ఒక ఏరియాలో ప్రశ్న పత్రం అమ్ముతున్నారని కొందరు చెప్పారు. ఈ విషయం మహేశ్ బాబుతో చెప్పా. నేను వెంటనే మహేశ్ బాబును లాక్కొని అక్కడికి తీసుకెళ్లా. కానీ అక్కడకు వెళ్తే మా డబ్బులు పోయాయి కానీ క్వశ్చన్ పేపర్ అయితే దొరకలేదు. అన్నీ ఫేక్. మహేశ్ బాబు నటించిన చిత్రాల్లో ఒక్కడు సినిమా నాకు చాలా ఇష్టం. భవిష్యత్తులో ఛాన్స్ వస్తే మహేశ్ బాబు సినిమా తీస్తా' అని ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. నేను, #MaheshBabu డబ్బులిచ్చి QUESTION PAPER కొనేవాళ్ళం 😂 - Director #VishnuVardhan#Premisthava #TeluguFilmNagar pic.twitter.com/cq5gNxJovt— Telugu FilmNagar (@telugufilmnagar) January 30, 2025 -
ప్రియాంక చోప్రా..రెమ్యునరేషన్ ఇన్నికోట్ల..!
-
మహేశ్ బాబు- రాజమౌళి ప్రాజెక్ట్‌లో సలార్ హీరో.. క్లారిటీ ఇదే!
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు- దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో భారీ అడ్వెంచరస్ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ మూవీకి 'ఎస్ఎస్ఎంబీ29' అనే వర్కింగ్ టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పనులతో రాజమౌళి బిజీగా ఉన్నారు. ఇప్పటికే షూటింగ్ లోకేషన్స్ కోసం విదేశాలకు సైతం వెళ్లివచ్చారు మన డైరెక్టర్.అయితే ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త తెగ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా చేయనున్నారని నెట్టింట టాక్ నడుస్తోంది. సలార్‌తో తెలుగులోనూ సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సుకుమారన్ మహేశ్‌బాబు చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర చేయనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న వార్తలపై పృథ్వీరాజ్ సుకుమారన్ స్పందించారు. ప్రస్తుతం మలయాళంలో ఎంపురాన్ మూవీలో నటిస్తోన్న ఆయన దీనిపై క్లారిటీ ఇచ్చారు.నాకంటే మీకే ఎక్కువ విషయాలు తెలుస్తున్నాయని మీడియాతో అన్నారు. మహేశ్ బాబు చిత్రంలో నటించే విషయం గురించి ఇప్పుడే చెప్పలేను.. ప్రస్తుతానికైతే చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. అయితే ఇంకా ఏదీ ఫైనల్ కాలేదని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఓకే అయ్యాక ఈ విషయం గురించి మాట్లాడుకుందామని పృథ్వీరాజ్ సుకుమారన్ వెల్లడించారు. సలార్‌తో మరింత్ స్టార్డమ్ సొంతం చేసుకున్న పృథ్వీరాజ్.. సలార్-2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. సలార్ సమయంలో ప్రభాస్ నుంచి చాలా నేర్చుకున్నానని అన్నారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో ఎస్ఎస్ఎంబీ29 చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ భామ ప్రియాకం చోప్రాను హీరోయిన్గా ఎంపిక చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఇటీవలే ఆమె హైదరాబాద్‌లోని చిలుకురు బాలాజీ ఆలయాన్ని సందర్శించారు. కొత్త ప్రయాణం మొదలైంది అంటూ ఫోటోలను కూడా షేర్ చేశారు. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. -
సెట్లో ఫోన్లు నిషిద్ధం.. మహేశ్‌బాబు సహా అందరితో అగ్రిమెంట్!
రాజమౌళి (SS Rajamouli) సినిమా అంటే అంచనాలు ఆకాశాన్నంటాల్సిందే! అందులోనూ తెలుగు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu)తో అంటే బాక్సాఫీస్‌ను బ్లాస్ట్ చేసేందుకు జక్కన్న ఏదో గట్టిగా ప్లాన్ చేశాడనే అర్థం. వీరిద్దరి కాంబోలో ఇటీవలే #SSMB29 సినిమా లాంచ్ చేశారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథ రెండు భాగాలుగా రానుంది. తొలి భాగం ప్రేక్షకుల ముందుకు రావడానికి కనీసం రెండేళ్లయినా పట్టొచ్చని టాక్! ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) నటించనున్నట్లు ఒక వార్త తెగ వైరలవుతోంది.షూటింగ్ షురూ?!ఇప్పటికే తన సినిమా కోసం ఒక సింహాన్ని లాక్ చేసినట్లు ఓ పోస్ట్ పెట్టాడు రాజమౌళి. అంటే మహేశ్‌బాబును తన ప్రాజెక్ట్ కోసం లాక్ చేశానని చెప్పకనే చెప్పాడు. అలాగే షూటింగ్ షురూ అని కూడా హింట్ ఇచ్చాడు. ఈ పోస్టుకు మహేశ్‌బాబు స్పందిస్తూ.. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అని రిప్లై ఇచ్చాడు. ప్రియాంక చోప్రా.. ఫైనల్లీ అని కామెంట్ పెట్టింది. ఇదిలా ఉంటే తన సినిమా కోసం రాజమౌళి చాలా జాగ్రత్తపడుతున్నాడట! అగ్రిమెంట్ఎట్టి పరిస్థితుల్లోనూ కథ, షూటింగ్ క్లిప్స్, సినిమాలో నటించేవారి గురించి ఎలాంటి వివరాలు బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నాడట. ఈ విషయంలో చిత్రయూనిట్‌కు హెచ్చరికలు జారీ చేశాడట. నటీనటులు, సాంకేతిక నిపుణులతో నాన్ డిస్క్లోజ్ అగ్రిమెంట్ (NDA) చేయించినట్లు తెలుస్తోంది. మహేశ్‌బాబు, ప్రియాంక చోప్రాతోనూ ఈ ఒప్పందంపై సంతకం చేయించారట! ఈ అగ్రిమెంట్ ప్రకారం సినిమాకు సంబంధించిన ఏ చిన్న విషయాన్ని కూడా యూనిట్ సభ్యులు బయటకు చెప్పేందుకు వీల్లేదు. లీక్ చేశారంటే భారీ మూల్యం..దర్శకనిర్మాతల అనుమతి లేకుండా ఎవరైనా సమాచారాన్ని లీక్ చేస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదు. అలాగే హీరోతో సహా సెట్లో ఉన్న ఎవరూ ఫోన్లు తీసుకురావడానికి అనుమతి లేదని తెలుస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో తీస్తున్న సినిమా కాబట్టి ఆమాత్రం జాగ్రత్తలు పాటిస్తే తప్పేం కాదంటున్నారు సినీప్రియులు. జక్కన్న ప్లాన్ బానే ఉంది.. మరి ఆచరణ ఏమేరకు సాధ్యమవుతుందో చూడాలి! View this post on Instagram A post shared by SS Rajamouli (@ssrajamouli) చదవండి: గేమ్ ఛేంజర్ డిజాస్టర్‌పై స్పందించిన అంజలి.. బాధేస్తోందంటూ.. -
SSMB29 తొలి రోజే 1000 కోట్లు కొల్లగొడతాడా?
-
మహేశ్‌బాబు సినిమా కోసం 'ప్రియాంక చోప్రా' భారీ రెమ్యునరేషన్
మహేశ్‌బాబు(Mahesh Babu) - దర్శకధీరుడు రాజమౌళి SSMB29 భారీ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. అయితే, ఇందులో ప్రియాంక చోప్రా(Priyanka Chopra) కూడా నటిస్తున్నారు. ఆమె రెమ్యునరేషన్ గురించి నెట్టింట పెద్ద చర్చ నడుస్తుంది. ప్రియాంక చోప్రా సుమారు దశాబ్ధం పాటు బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా కొనసాగారు. అదే సమయంలో ఆమె హాలీవుడ్లో అవకాశాలు దక్కించుకుని పలు ప్రాజెక్ట్‌లలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా అక్కడ రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆమె అమెరికాలో స్థిరపడ్డారు. అయితే సుమారు పదేళ్ల తర్వాత ఒక ఇండియన్ (తెలుగు) సినిమాలో ప్రియాంక నటిస్తుండటం విశేషం. ఆమె ఎప్పుడో 2015 సమయంలో ఒప్పుకున్న 'ది స్కై ఈజ్ పింక్' చిత్రం 2019లో విడుదలైంది. బాలీవుడ్లో ఇదే ఆమె చివరి సినిమా.భారీ రెమ్యునరేషన్బాలీవుడ్కు మించిన రెమ్యునరేషన్లు తెలుగు చిత్ర పరిశ్రమ ఇస్తుంది. టాలీవుడ్లో ఇప్పటివరకు అత్యధిక పారితోషికం కల్కి సినిమా కోసం దీపికా పదుకోన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఆమె ఏకంగా సుమారు రూ. 20 కోట్లు తీసుకున్నట్లు అప్పట్లో భారీగా వార్తలు వచ్చాయి. అయితే, SSMB29 ప్రాజెక్ట్ కోసం ప్రియాంక చోప్రా ఏకంగా రూ.25 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతుంది. కానీ, హాలీవుడ్ మీడియా మాత్రం సుమారు రూ. 40 కోట్లు వరకు ఉంటుందని కథనాలు ప్రచురించాయి. ఆమెకు అంత పెద్ద మొత్తంలో పారితోషికం ఇచ్చేందుకు నిర్మాత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.అంత మొత్తం ఇవ్వడానికి కారణం ఇదేప్రియాంక చోప్రా మార్కెట్ బాలీవుడ్లో భారీగానే ఉంది. చాలా గ్యాప్ తర్వాత ఆమె నటించిన సినిమా వస్తుండటంతో హిందీ బెల్ట్‌లో మంచి బిజినెస్ చేసే ఛాన్స్ ఉంది. ఆపై హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా ప్రియాంక అప్పీయరెన్స్ సినిమాకు ప్లస్ అవుతుంది. SSMB29 ప్రాజెక్ట్‌ను హాలీవుడ్ రేంజ్లో జక్కన్న ప్లాన్ చేశాడు. దీంతో సులువుగా అక్కడి మార్కెట్‌కు సినిమా రీచ్ అవుతుందని తెలుస్తోంది. ఈ లెక్కలన్నీ వేసుకునే ప్రియాంక చోప్రాకు భారీ మొత్తంలో ఆఫర్ చేసినట్లు టాక్. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా వస్తే.. అప్పుడు ఆమె రెమ్యునరేషన్ లెక్కలు మారిపోతాయి. ఏదేమైనా అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా ప్రియాంక చోప్రా రికార్డ్ క్రియేట్ చేశారని ఆమె అభిమానులు చెప్పుకుంటున్నారు.హాలీవుడ్లో ఫుల్ బిజీబాలీవుడ్లో ఎన్నో సూపర్‌హిట్ సినిమాలలో నటించిన ప్రియాంక 'క్వాంటికో' అనే టెలివిజన్ సిరీస్‌తో హాలీవుడ్ చిత్ర పరిశ్రమకు దగ్గరయ్యారు. ఆ తర్వాత బేవాచ్, ఏ కిడ్ లైక్ జాక్,లవ్ అగైన్,టైగర్, వుయ్ కెన్ బీ హీరోస్, ది వైట్ టైగర్ తదితర చిత్రాలలో నటించి ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరించి అక్కడి వారిని మెప్పించారు. హాలీవుడ్‌కి చెందిన ప్రముఖ పాప్ సింగర్ నిక్ జోనాస్‌ని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెకు అదనపు గుర్తింపు లభించింది. -
సింహాన్ని లాక్ చేసిన రాజమౌళి.. స్పందించిన మహేశ్‌బాబు, ప్రియాంక
మహేశ్‌బాబు- ఎస్ఎస్ రాజమౌళి సినిమా పనులు ప్రారంభమయ్యాయి. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా ఈ మూవీపై అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్ శివారు ప్రాంతంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో 'SSMB 29' చిత్రాన్ని లాంచ్ చేశారు. చిత్ర యూనిట్‌తో పాటు మహేశ్‌బాబు(Mahesh Babu) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. కానీ, ఈ సినిమా కార్యక్రమానికి సంబంధించి చిత్ర యూనిట్ నుంచి ఆ సమయంలో ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. అయితే, తాజాగా జక్కన్న తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటో షేర్ చేసి అభిమానుల్లో జోష్ పెంచాడు.మహేశ్‌బాబు అభిమానుల దృష్టి అంతా SSMB29 సినిమాపైనే ఉంది. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రాజమౌళి( S. S. Rajamouli) ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఒక వీడియోను పంచుకున్నారు. ఒక సింహాన్ని లాక్ చేసినట్లు అందులో ఉంది. అంటే మహేశ్‌ను తన ప్రాజెక్ట్ కోసం లాక్ చేసినట్లు చెప్పేశాడు. జక్కన్న పోస్ట్‌కు కామెంట్ బాక్స్‌లో మహేశ్‌బాబు కూడా 'ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను..' అంటూ రెస్పాండ్ అయ్యాడు. ఆపై నమ్రతా శిరోద్కర్ (Namrata Shirodkar) కూడా చప్పట్ల ఎమోజీతో చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పింది. అయితే, 'ఫైనల్లీ' అంటూ బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కామెంట్ బాక్స్‌లో రియాక్ట్ కావడం విశేషం. ఇలా జక్కన్న చేసిన పోస్ట్‌కు చాలామంది సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. జక్కన్న పాస్‌పోర్ట్ చూపిస్తూ సింహం ఫోటోతో పోజ్ ఇచ్చారు. దీంతో SSMB29 సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లేనని మహేశ్ అభిమానులు అనుకుంటున్నారు.'ఫైనల్లీ' తేల్చేసిన ప్రియాంక చోప్రాహీరోయిన్ ప్రియాంక చోప్రా ఇప్పటికే హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. SSMB29 ప్రాజెక్ట్ కోసమే ఆమె ఇక్కడకు వచ్చినట్లు తేలిపోయింది. తాజాగా రాజమౌళి చేసిన పోస్ట్‌కు ఫైనల్లీ అంటూ ఆమె రెస్పాండ్ అయ్యారు. దీంతో మహేశ్‌బాబు- ఎస్ఎస్ రాజమౌళి సినిమాలో ప్రియాంక చోప్రానే హీరోయిన్ అని క్లారిటీ వచ్చేసింది. సింగర్, యాక్టర్ నిక్ జోనాస్‌తో పెళ్లి తర్వాత అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో స్థిరపడిన ప్రియాంక. చాలా రోజుల తర్వాత హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. ఈ చిత్రంలో మహేశ్‌బాబుకి జోడీగా నటించే హీరోయిన్ల జాబితాలో ప్రియాంకా చోప్రా, కియారా అద్వానీ, ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. ఫైనల్‌గా ప్రియాంకా చోప్రాని కథానాయికగా ఫిక్స్ చేశారని పరోక్షంగా క్లారిటీ వచ్చేసింది. త్వరలో అధికారికంగా ప్రకటన రావచ్చు అని తెలుస్తోంది.‘ఆర్ఆర్ఆర్’తో ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజమౌళి.. ఇప్పుడు హాలీవుడ్ రేంజ్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ చూడని సరికొత్త ప్రపంచాన్ని ఈ చిత్రంలో రాజమౌళి ఆవిష్కరించబోతున్నారని రచయిత విజయేంద్రప్రసాద్ ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథ రెండు భాగాలుగా రానుంది. తొలి భాగాన్ని 2027లో విడుదల చేస్తారని ప్రచారంలో ఉంది. ఈ ప్రాజెక్ట్‌లో హాలీవుడ్ నటీనటులతో పాటు టెక్నీషియన్స్ కూడా ఇందులో భాగం కానున్నారు. View this post on Instagram A post shared by SS Rajamouli (@ssrajamouli) -
గుంటూరు కారం సాంగ్.. ఆ దేశంలో క్రేజ్ చూశారా!
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు గతేడాది సంక్రాంతికి అభిమానులను అలరించాడు. త్రివిక్రమ్- మహేశ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం పొంగల్ బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. దాదాపు 13 ఏళ్ల తర్వాత మహేశ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో మూవీ రావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఊహించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద అభిమానులను ఆకట్టుకోలేకపోయింది.అయితే ఈ మూవీలో కుర్చీని మడతపెట్టి అనే సాంగ్ విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఈ సాంగ్‌లో టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల తన స్టెప్పులతో ఫ్యాన్స్‌ను ఊపేసింది. ఈ సినిమాలో ముఖ్యంగా తమన్ మ్యూజిక్ మహేశ్ బాబు ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులను అలరించింది.అయితే సినిమా రిలీజైన ఏడాది దాటిపోయినా కుర్చీని మడతపెట్టి సాంగ్‌కు క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. టాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను ఓ ఊపు ఊపేస్తోంది. తాజాగా నేపాల్‌లో ఈ పాటకు ఇద్దరు యువతులు డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోడ్డు పక్కన యువతులు గుంటూరు కారం సాంగ్‌కు స్టెప్పులు వేస్తూ కనిపించారు. అంతేకాకుండా నేపాల్‌లోని ఓ కళాశాలలో స్టూడెంట్స్ సైతం కుర్చినీ మడతపెట్టి అనే సాంగ్‌కు డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. ఇది చూసిన మహేశ్ బాబు ఫ్యాన్స్ గ్లోబల్ స్టార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. మహేశ్‌బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి ముఖ్య పాత్రల్లో నటించిన గుంటూరు కారం గతేడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైంది. మంచి కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీలో తమన్ అందించిన సంగీతం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా కుర్చీ మడతపెట్టి పాట అభిమానులకు గూస్బంప్స్ తెప్పించింది. ఈ సాంగ్ యూట్యూబ్‌లో రిలీజవగానే సెన్సేషనల్ హిట్ అయింది. మహేశ్, శ్రీలీల ఎనర్జిటిక్ డ్యాన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ పాట యూట్యూబ్‌లో ఏకంగా 50 కోట్ల (500 మిలియన్) వ్యూస్ సాధించింది. #KurchiMadathapetti Mania in NEPAL ❤️🔥Global sensation @urstrulyMahesh - @MusicThaman 🥁 #MaheshBabu | #GunturKaaram pic.twitter.com/mfJcQurGrS— VardhanDHFM (@_VardhanDHFM_) January 22, 2025 -
'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ పార్టీలో మహేశ్‌బాబు (ఫొటోలు)
-
లాస్ ఏంజెల్స్ టు హైదరాబాద్
ప్రముఖ హీరోయిన్ ప్రియాంక చోప్రా హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. అందులో విషయం ఏముందీ అనుకోవచ్చు. సింగర్, యాక్టర్ నిక్ జోనాస్‌తో పెళ్లి తర్వాత అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో స్థిరపడ్డారు ప్రియాంక. ఇప్పుడు ఇలా హైదరాబాద్‌లో అడుగుపెట్టడానికి కారణం ఏంటి? అనేది హాట్ టాపిక్‌గా మారింది. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూ΄పొందనున్న సినిమా కోసమే ఆమె భాగ్యనగరానికి చేరుకున్నారని టాక్. ఈ చిత్రంలో మహేశ్‌బాబుకి జోడీగా నటించే హీరోయిన్ల జాబితాలో ప్రియాంకా చోప్రా, కియారా అద్వానీ, ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. ఫైనల్‌గా ప్రియాంకా చోప్రాని కథానాయికగా ఫిక్స్ చేశారని భోగట్టా. ప్రియాంకా చోప్రా లాస్ ఏంజెల్స్ నుంచి హైదరాబాద్‌కి చేరుకోవడంతో ఈ మూవీ చిత్రీకరణ కోసమే ఆమె వచ్చారనే రూమర్లు వినిపిస్తున్నాయి. మరి... ఈ వార్త ఎంతవరకూ నిజమో తెలియాల్సి ఉంది. -
బిగ్‌బాస్ ఫినాలే ఛాన్స్ మిస్.. నమ్రతా, మహేశ్ బాబు సపోర్ట్‌పై శిల్పా రియాక్షన్
బిగ్‌బాస్ సీజన్-18 దాదాపు చివరిదశకు చేరుకుంది. ఈనెల 19న గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఇప్పటికే టాప్-6 కంటెస్టెంట్స్ మాత్రమే హౌస్‌లో మిగిలి ఉన్నారు. ముఖ్యంగా ఫైనలిస్ట్‌లో కచ్చితంగా ఉంటుందని భావించిన నమ్రతా శిరోద్కర్ సిస్టర్ శిల్పా శిరోద్కర్ ఊహించని విధంగా ఎలిమినేట్ అయింది. ఫైనలిస్ట్ అయ్యే అవకాశాన్ని ఒక్క అడుగు దూరంలోనే మిస్ చేసుకుంది. హౌస్ నుంచి బయటకు వచ్చిన ఆమె బిగ్‌బాస్ హౌస్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అలాగే తన సిస్టర్ నమ్రతా, మహేశ్ బాబు గురించి మాట్లాడింది. వాళ్లు సోషల్ మీడియాలో తనకు మద్దతు ప్రకటించకపోవడంపై కూడా స్పందించింది.ఎలిమినేషన్ గురించి శిల్పా మాట్లాడుతూ..'ఈ లిటీ షోకు నేను పెద్ద అభిమానిని. మిడ్వీక్లో ఎవిక్షన్ ఉంటుందని మనందరికీ తెలుసు. ఏ విషయంలోనూ నేను అబద్ధం చెప్పను. ఈ సీజన్లో టాప్ -3లో ఉండాలని ఆశించా. నా పేరు ప్రకటించినప్పుడు కాస్తా విచారంగా అనిపించింది. కానీ నా ఎలిమినేషన్ చాలా గౌరవంగా ఉంది. బిగ్ బాస్ నా పేరును కూడా ప్రకటించలేదు. నా లేఖను కూడా నేనే చదివా. ఈ షో అభిమానిగా హౌస్‌లో ప్రవేశించా. బిగ్ బాస్ హౌస్‌లో నా ప్రయాణంతో సంతోషంగా ఉన్నా' అని అన్నారు.అయితే శిల్పా శిరోద్కర్‌కు సోదరి నమ్రతా శిరోద్కర్, మహేష్ బాబు దంపతుల నుంచి ఆమెకు తగినంత సపోర్ట్ లభించలేదని కొందరు సోషల్ మీడియా పోస్ట్‌లు పెట్టారు. ప్రిన్స్ మహేశ్ బాబు అభిమానులు ఆమెకు ఓట్లు వేయాలని నమ్రతా కోరకపోవడంపై కొందరు అభిమానులు షాకయ్యారు.అయితే ఇదే విషయం శిల్పా మాట్లాడుతూ.. "ఒక కుటుంబంగా, మాకు ఒకరిపై ఒకరికి అలాంటి అంచనాలు ఉండవు. ఈ ఇంటి ద్వారా నేను అన్ని రకాల వ్యక్తులను కలిశాను. మన తెలివితేటలను బట్టే మనల్ని అంచనా వేస్తారని తెలుసుకున్నా. నమ్రతా నన్ను ఎంతగా ప్రేమిస్తుందో నాకు తెలుసు. అలా అని నాకు సపోర్ట్ చేయాలని నేను చెప్పను. ఇలాంటివీ మా మధ్య బంధాన్ని ప్రభావితం చేయలేవు. ఆమె నాకు మద్దతు ఇచ్చినా.. ఇవ్వకపోయినా.. తానేంటో నాకు తెలుసు..నేనేంటో తనకు తెలుసు.' అని వెల్లడించింది. మరోవైపు బిగ్‌బాస్ హౌస్‌లో వివియన్ ద్సేనా, కరణ్ వీర్ మెహ్రా తనకు స్నేహితులని శిల్పా శిరోద్కర్ తెలిపింది.బిగ్‌బాస్‌లో అనుభవం గురించి మాట్లాడుతూ..' ఇక్కడ నా ఆత్మగౌరవం గురించి ప్రశ్నించారని నాకు తెలుసు. కానీ నేను ఎలాంటి అంచనాలు లేకుండా షోలోకి ప్రవేశించా. అసలు నేను ఇన్ని రోజులు హౌస్‌లోని ఉంటానునుకోలేదు. ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తారని తెలుసు. మేం చేసే ప్రతి విషయం వారికి గుర్తుంటుంది. నా కుమార్తె హౌస్‌లోకి వచ్చినప్పుడు చాలా సంతోషం కలిగింది. అప్పుడే గెలిచినంత ఆనందం వేసింది.' అని పంచుకుంది. కాగా.. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన బిగ్‌బాస్ సీజన్-18 రియాలిటీ షో ఫైనల్ జనవరి 19 ఆదివారం జరగనుంది. -
పెద్దోడి సినిమాపై చిన్నోడి ప్రశంసలు.. గర్వంగా ఉందంటూ..
సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam Movie).. సినిమా టైటిట్ ఏ ముహూర్తాన పెట్టారో కానీ సంక్రాంతి కళ మొత్తం బాక్సాఫీస్ వద్దే కనిపిస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ చలో అంటూ థియేటర్‌కు క్యూ కట్టారు. సినిమాలంటే పెద్దగా ఇష్టపడని వాళ్లు కూడా కాసేపు సరదాగా నవ్వుకోవడానికైనా ఈ మూవీకెళ్దామని అనుకుంటున్నారు. అక్కడే అనిల్ రావిపూడి సక్సెస్ అయిపోయాడు.సూపర్ హిట్‌గా సంక్రాంతికి వస్తున్నాం2025 సంక్రాంతికి గేమ్ ఛేంజర్ (Game Changer Movie), డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు రిలీజయ్యాయి. రెండు రోజుల వ్యవధితో ఒక్కో సినిమా విడుదలైంది. జనవరి 10న వచ్చిన గేమ్ ఛేంజర్ ఎక్కువగా నెగెటివ్ టాక్ తెచ్చుకోగా జనవరి 12న రిలీజైన డాకు మహారాజ్ (Daaku Maharaaj Movie)కు స్పందన బాగుంది. చివరగా జనవరి 14న విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం మూవీ.. బ్లాక్‌బస్టర్ టాక్ సంపాదించుకుంది. వెంకటేశ్ కెరీర్లోనే అత్యధికంగా తొలి రోజే రూ.45 కోట్లు సంపాదించింది. (చదవండి: మంచు మనోజ్ అభిమానులపై మోహన్‌బాబు బౌన్సర్ల దాడి)గర్వంగా ఉందితాజాగా ఈ సినిమాపై హీరో మహేశ్‌బాబు (Mahesh Babu) స్పందించాడు. సంక్రాంతికి వస్తున్నాం అసలు సిసలైన పండగ సినిమా. ఈ మూవీ చూసి చాలా ఆనందించాను. వెంకటేశ్ సర్ మీరు అదరగొట్టారు. వరుస బ్లాక్‌బస్టర్స్ ఇస్తున్న అనిల్ రావిపూడిని చూస్తుంటే ఒకింత సంతోషంగా, ఒకింత గర్వంగా ఉంది. ఐశ్వర్య, మీనాక్షి తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. పిల్లాడు బుల్లిరాజు యాక్టింగ్ అయితే వేరే లెవల్. సినిమా యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు అని ట్వీట్ చేశాడు.పొంగల్ విన్నర్?ఇది చూసిన జనాలు సంక్రాంతికి వచ్చేస్తున్నాం సినిమాను పొంగల్ విన్నర్‌గా పేర్కొంటున్నారు. మరికొందరేమో మహేశ్‌బాబు.. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలకు ఎలాంటి రివ్యూ ఇవ్వకుండా కేవలం ఈ ఒక్క సినిమాకు ఇచ్చాడంటేనే ఏది హిట్టో తెలిసిపోతోందని కామెంట్లు చేస్తున్నారు. కాగా మహేశ్, వెంకటేశ్.. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అన్నదమ్ములుగా నటించారు. ఇందులో వెంకటేశ్ పెద్దోడిగా, మహేశ్ చిన్నోడిగా యాక్ట్ చేశారు.సినిమా విశేషాలుసంక్రాంతి సినిమా విషయానికి వస్తే.. వెంకటేశ్ (Venkatesh Daggubati) హీరోగా నటించగా ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ సినిమాలో బాగా హైలైట్ అయిన పాత్రల్లో బుల్లిరాజు ఒకటి. బుల్లి రాజుగా చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ భీమల నటించాడు. అతడి పాత్రకు అద్భుతమైన స్పందన లభిస్తోంది.గతేడాది సంక్రాంతికి డిజాస్టర్వెంకటేశ్ కెరీర్లో సంక్రాంతికి వచ్చిన మెజారిటీ సినిమాలు విజయం సాధించాయి. కానీ గతేడాది మాత్రం ఈ సమయానికి డిజాస్టర్ మూటగట్టుకున్నాడు. సైంధవ్ చిత్రంతో ఫ్లాప్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈసారి మాత్రం అలాంటి పొరపాటు మళ్లీ జరగకుండా జాగ్రత్తపడ్డాడు. సంక్రాంతికి వచ్చేస్తున్నాంతో బ్లాక్‌బస్టర్ పొంగల్ సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. జీవిత సూత్రాలుఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో నేటి తరానికి కొన్ని సూచనలు ఇచ్చాడు. జీవితాన్ని హాయిగా.. సంతోషంగా జీవించాలి. అత్యాశలకు పోకూడదు. అతిగా ఆలోచించకూడదు. మన ఆలోచనలు సానుకూలంగానే ఉండాలి. అదే సమయంలో మనం ఏదైనా కోరుకుంటున్నప్పుడు ఆ పనిని నిజాయితీతో చేయాలి. క్రమశిక్షణగా ఉండాలి... కష్టపడాలి. అప్పుడు సాధ్యమౌతుంది. లైఫ్‌లో ఎప్పుడూ హోప్‌ను కోల్పోకూడదు అని చెప్పాడు. Enjoyed watching #SankranthikiVasthunam , A proper festive film... @VenkyMama sir is just terrific👌👌👌So proud and happy for my director @AnilRavipudi for giving consecutive Blockbusters 👍👍👍@aishu_dil @Meenakshiioffl were superb in their characters. The kid "Bulli…— Mahesh Babu (@urstrulyMahesh) January 15, 2025 చదవండి: పీరియడ్స్ అన్నా పట్టించుకోరు... అతనొక్కడే...: నిత్యామీనన్ -
సుకుమార్ కూతురి చిత్రం.. ట్రైలర్ రిలీజ్ చేసిన మహేశ్ బాబు
పుష్ప సినిమా దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి(Sukriti Veni Bandreddi) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'గాంధీ తాత చెట్టు'(Gandhi Tatha Chettu) ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై అవార్డ్స్‌ను అందుకుంది. పద్మావతి మల్లాది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, గోపీటాకీస్ సంస్థలతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు నిర్మించారు. ఈ చిత్రానికి డైరెక్టర్ సుకుమార్ భార్య తబితా సుకుమార్ సమర్పకురాలుగా వ్యవహరించారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను(Gandhi Tatha Chettu Trailer) విడుదల చేశారు మేకర్స్. ప్రిన్స్ మహేశ్ బాబు చేతుల మీదుగా గాంధీతాత చెట్టు ట్రైలర్ రిలీజ్ చేశారు. గాంధీ తాత చెట్టు ట్రైలర్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. అందరి మనసులను హత్తుకునే సినిమాలా అనిపిస్తోంది. సుకృతికి, అలాగే ఈ సినిమా టీమ్ అందరికి నా అభినందనలు అంటూ ప్రిన్స్ మహేష్‌బాబు తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.తాజాగా రిలీజైన గాంధీ తాత చెట్టు ట్రైలర్ చూస్తే ఓ బాలిక ఇచ్చిన మాట కోసం గాంధీ మార్గాన్ని ఎంచుకున్న కథగా తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. గాంధీ పేరు పెట్టుకున్న ఓ అమ్మాయి.. ఆయన బాటను, సిద్దాంతాలను అనుసరిస్తూ, తన తాతకు ఇష్టమైన చెట్టును, తన ఊరును ఎలా రక్షించుకుంది అనే కథాంశంతో సినిమా తెరకెక్కినట్లుగా తెలుస్తోంది. గాంధీగా సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ఈ సినిమాలో నటించారు. ట్రైలర్ అందరి హృదయాలకు హత్తుకునే విధంగా ఉంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా సుకుమార్ కూతురి నటన అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ట్రైలర్ విడుదల చేసిన సూపర్‌స్టార్ మహేష్‌బాబుకు నిర్మాతలు, దర్శకురాలు, చిత్ర సమర్పకురాలు తబితా సుకుమార్ తమ కృతజ్ఞతలు తెలియజేశారు.కాగా.. ఇప్పటికే ఈ 'గాంధీ తాత చెట్టు' సినిమా పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించడమే కాకుండా ఎన్నో అవార్డులను కైవసం చేసుకుంది. ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి పురస్కారం పొందారు. దీంతో పుష్ప అభిమానులు సుకుమార్ కూతురు అనిపించుకున్నావ్ అంటూ ఆమెను ప్రశంసిస్తున్నారు. తండ్రి నేషనల్ అయితే, కూతురు ఇంటర్నేషనల్ అంటూ వరుసగా ట్వీట్లు చేస్తున్నారు.ఈ సందర్భంగా దర్శకురాలు పద్మావతి మల్లాది మాట్లాడుతూ 'ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడా చూసిన ద్వేషాలు, అసూయ..ఇలా ఓ నెగెటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం.. గొడవలు ఇలా ఎన్నో ఘర్షణలు కనిపిస్తున్నాయి.ఇక సాధారణంగా మనకు అహింస అనగానే మనకు మన జాతిపిత మహాత్మగాంధీ గుర్తొస్తారు. ఇలాంటి తరుణంలో గాంధీ గారి సిద్ధాంతాలు అభిమానిస్తూ, ఆయన బాటను అనుసరించే ఓ పదమూడేళ్ల అమ్మాయి తను పుట్టిన ఊరిని కాపాడుకోవడం కోసం ఏం చేసింది? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు చూపించాల్సిన సినిమా. అందరి హృదయాలను హత్తుకునే భావోద్వేగాలు ఈ చిత్రంలో ఉంటాయి. చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ ఓ అనీర్వచనీయమైన అనుభూతికి లోనవుతారు. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకముంది. ఈ నెల 24న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం' అని అన్నారు. కాగా.. ఈ చిత్రంలో ఆనంద్ చక్రపాణి, రఘురామ్, భాను ప్రకాశ్, నేహాల్ ఆనంద్ కుంకుమ, రాగ్ మయూర్ ముఖ్య పాత్రలు పోషించారు. -
పెద్దోడి ట్రైలర్ విడుదల చేయడం ఆనందంగా ఉంది: మహేశ్ బాబు
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన చిత్రం సంక్రాంతి వస్తున్నాం. ఈ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందించారు. శ్రీ వెంకటేశ్వర బ్యానర్లో దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పొంగల్ కానుకగా ఈ నెల 14న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్‌కు అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. నిజామాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో రిలీజ్ చేశారు. సూపర్ స్టార్, టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు చేతుల మీదుగా ట్రైలర్‌ను విడుదల చేశారు.ఈ సందర్భంగా చిత్రబృందానికి మహేశ్ బాబు అభినందనలు తెలిపారు. మా పెద్దోడి మూవీ ట్రైలర్ విడుదల చేయడం అనందంగా ఉందన్నారు. అనిల్ రావిపూడి, వెంకటేశ్ కాంబోలో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని మహేశ్ బాబు పోస్ట్ చేశారు. జనవరి 14న రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటూ ట్వీట్ చేశారు.కాగా.. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీని ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మాజీ పోలీస్ ఆఫీసర్‌గా వెంకటేశ్, ఆయన భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేశ్ నటించారు. వెంకటేశ్ మాజీ ప్రేయసి పాత్రలో మీనాక్షీ చౌదరి కనిపిస్తారు.కేవలం 72 రోజుల్లోనే షూటింగ్ పూర్తి..సాధారణంగా స్టార్ హీరోలతో సినిమా అంటే ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం ఏడాది సమయం అయినా పడుతుంది. కానీ ఈ రోజుల్లో మాత్రం ఏ స్టార్ హీరో సినిమా అయినా సరే రెండు, మూడు నెలల కంటె ఎక్కువ సమయం తీసుకోవట్లేదు. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను కేవలం 72 రోజుల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించాడు.నాలుగైదు నిమిషాలే వృథాఇటీవల ప్రచార కార్యక్రమంలో భాగంగా అనిల్‌రావిపూడి మాట్లాడుతూ.. సినిమా మేకింగ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ సినిమా షూటింగ్‌ని కేవలం 72 రోజుల్లోనే పూర్తి చేశామని తెలిపారు. అంతేకాదు ఐదారు నిమిషాల ఫుటేజ్ మాత్రమే వృథా అయిందని పేర్కొన్నారు.అనిల్ రావిపూడి మాట్లాడుతూ..' ఈ చిత్రం అనౌన్స్ చేసినప్పుడే ఈ సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించాం. తక్కువ సమయం షూటింగ్ ముగించుకోవాలనుకున్నాం. స్క్రిప్ట్ సమయంలోనే ఎడిటింగ్ చేసేశాం. ఫలానా సీన్ మూడు నిమిషాలు తీయాలనుకుంటే అంతే తీశాం. అందుకే 72 రోజుల్లో షూటింగ్ పూర్తయింది. మొత్తం సినిమా దాదాపు 2.26 గంటల నివిడితో పూర్తయితే.. 2.22 గంటల నిడివితో సెన్సార్‌కు పంపాం. కేవలం ఐదారు నిమిషాలు మాత్రమే ఎడిట్ చేయాల్సి వచ్చింది. ఈ మూవీకి ఎంత బడ్జెట్ అవసరమో అంతకు ఏమాత్రం తగ్గకుండా తీశాం. క్వాలిటీ విషయంలోనూ అస్సలు రాజీపడలేదు’ అని అన్నారు.సంక్రాంతి బరిలో మూడు సినిమాలు..మరోవైపు ఈ సంక్రాంతి బరిలో మొత్తం మూడు సినిమాలు విడుదల కానున్నాయి. వెంకటేశ్ సంక్రాంతి వస్తున్నాం మూవీతో పాటు రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ జనవరి 10న విడుదల కానుంది. బాలకృష్ణ-బాబీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘డాకు మహారాజ్’ చిత్రం కూడా జనవరి 12న ప్రేక్షకుల ముందుకురానుంది. Looks like a sure shot🎯🔥Glad to launch the trailer of my peddhodu @VenkyMama garu and my blockbuster director @AnilRavipudi's #SankranthikiVasthunam Wishing you a both a victorious hattrick and the entire team a memorable Sankranthi. Looking forward to the film on Jan 14th!!…— Mahesh Babu (@urstrulyMahesh) January 6, 2025 -
గేమ్ ఛేంజర్‌తో పోటీ పడనున్న మూవీ.. మహేశ్ బాబు చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్
బాలీవుడ్ హీరో సోనూ సూద్ హీరోగా నటించిన తాజా చిత్రం ఫతే. అరుంధతి సినిమాతో టాలీవుడ్లో ఫేమస్ అయిన సోనూ సరికొత్త థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమాను తానే దర్శకత్వం వహించడం మరో విశేషం. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి.కాగా.. ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, శక్తి సాగర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సోనాలి సూద్, ఉమేష్ కెఆర్ బన్సాల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సైబర్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సైబర్ మాఫియా బారిన ఒక అమ్మాయిని హీరో ఏవిధంగా రక్షించాడు? అనే కోణంలో రూపొందించారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న బాలీవుడ్లో విడుదల కానుంది. దక్షిణాది భాషల్లో రిలీజ్ చేస్తారో లేదో ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే పాన్ ఇండియా రేంజ్లో అదే రోజున గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ కూడా రిలీజవుతోంది. ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు. పొంగల్ బరిలో నిలిచిన ఫతే హిందీలో గేమ్ ఛేంజర్‌తో పోటీ పడడం ఖాయంగా కనిపిస్తోంది. దక్షిణాది భాషల్లోనూ ఫతే రిలీజైతే గనక చెర్రీ మూవీతో బాక్సాఫీస్ వద్ద పోరు తప్పేలా లేదు.తాజాగా ఈ మూవీ మరో ట్రైలర్‌ను కూడా విడుదల చేయనున్నట్లు సోనూ సూద్ ట్వీట్ చేశారు. తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు చేతుల మీదుగా ఫతే ట్రైలర్-2 రిలీజ్ చేశారు. ఈ మేరకు ట్విటర్లో పోస్ట్ చేశారు మహేశ్ బాబు.తెలుగులో ప్రత్యేక గుర్తింపు..కాగా.. అనుష్క లీడ్ రోల్లో నటించిన అరుంధతి సినిమాలో పశుపతిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్న బాలీవుడ్ నటుడు సోనూ సూద్. టాలీవుడ్లో జులాయి, అతడు లాంటి సూపర్ హిట్ చిత్రాలతో మెప్పించారు. తెలుగు పలువురు స్టార్ హీరోల సినిమాల్లో ప్రతినాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. An action-packed spectacle that looks absolutely amazing! Wishing all the very best to my dear friend @SonuSood Can’t wait for everyone to witness this magic on screen! 😊 #Fateh https://t.co/d9CZlhWnnk— Mahesh Babu (@urstrulyMahesh) January 6, 2025 Love you brother ❤️ https://t.co/jXadXxOqQt— sonu sood (@SonuSood) January 6, 2025 This will Hit you Hard 🔥Be Ready🪓 #Fateh Trailer-2 🩸https://t.co/DtgNrqoBd0In cinemas on 10th January.@Asli_Jacqueline @ZeeStudios_ @condor_dop @Vm_buffy @ShaktiSagarProd @Fateh4Bharat pic.twitter.com/5UKXIAqEeX— sonu sood (@SonuSood) January 6, 2025 This will Hit you Hard 🔥Be Ready🪓 #Fateh Trailer-2 🩸 pic.twitter.com/s0U9s1Iyri— sonu sood (@SonuSood) January 6, 2025