aarilova
-
విశాఖలో విష సంస్కృతికి మళ్లీ ‘లైసెన్సు’
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ నేతలు తమ కాసుల కక్కుర్తితో యువతను పెడదారి పట్టించేందుకు సైతం వెనుకాడటం లేదు. ఈవెంట్ల పేరుతో రేవ్ పార్టీలు నిర్వహిస్తూ విశాఖలో విష సంస్కృతికి బీజం వేస్తున్నారు. తాజాగా రుషికొండ ఇసుక తిన్నెలపై ఈవెంట్ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించారు. అయితే వీటిని ఈవెంట్ల కింద చూపిస్తూ.. కాశీ విశ్వనాథ్(జిల్లా మంత్రి అనుచరుడు)కు చెందిన ‘విశ్వనాథ్ బీచ్ ఫ్రంట్ ప్రైవేటు లిమిటెడ్’ పర్యాటక శాఖ నుంచి అనుమతి తెచ్చుకుంది. వాస్తవానికి సాగరతీరంలో పర్యావరణ అనుమతులు లేకుండా ఈవెంట్ల నిర్వహణకు లైసెన్స్ ఇవ్వకూడదని గతేడాది హైకోర్టు ఆదేశాలిచ్చింది. కానీ మంత్రి అనుచరుడు కావడం, ముడుపులు ముట్టడంతో ఎలాంటి అడ్డు చెప్పకుండా.. పర్యాటక శాఖ అనుమతులిచ్చేసింది. రేవ్ పార్టీతో బోణీ.. రుషికొండ సాగరతీరం సర్వే నంబర్ 61లో బీచ్ సంబంధిత క్రీడలు, ఈవెంట్ల నిర్వహణ పేరిట విశ్వనాథ్ బీచ్ ఫ్రంట్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ సరిగ్గా ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ) నుంచి 15 ఏళ్లకు గానూ లీజు అనుమతులు తెచ్చుకుంది. నెలకు రూ.2 లక్షల చొప్పున ఏడాదికి రూ.24 లక్షలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుంది. ఉన్నత స్థాయిలో అధికార బలాన్ని ఉపయోగించి ఆగమేఘాలపై లైన్ క్లియర్ చేయించుకుంది. ఏపీటీడీసీలో ప్రాజెక్ట్సు చూసే ఓ ఉన్నతాధికారి ఇందుకు సహకరించడంతో అనుమతులు తేలిగ్గా వచ్చేశాయి. విశ్వనాథ్ బీచ్ ఫ్రంట్ ఏపీటీడీసీతో లీజు ఒప్పందం కుదుర్చుకుందన్న సంగతి ఆ శాఖలో చాలామంది అధికారులకు తెలియకపోవడం గమనార్హం. జిల్లాకు చెందిన మంత్రికి విశ్వనాథ్ ప్రధాన అనుచరుడిగా ఉండడం వల్ల లీజు పని సులువైనట్లు తెలిసింది. ఈ సంస్థ ఈవెంట్లకు అవసరమైన రెస్టారెంట్లు, ఇతర ఏర్పాట్లను కూడా పూర్తి చేయలేదు. కానీ ఈ సంస్థ రెండ్రోజుల క్రితం రేవ్ పార్టీతో ‘ఈవెంట్‌కు’ బోణీ కొట్టింది. మద్యంతో పాటు మాదకద్రవ్యాలను సేవించిన పలువురు యువతీ, యువకులు ఒళ్లు మరిచి చిందులేశారు. మసక చీకట్లో ఇసుక తిన్నెలపై ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ విశాఖ ఖ్యాతిని మంటగలిపారు. ఎక్సైజ్ అధికారుల అత్యుత్సాహం.. ఇక ఈవెంట్ పేరిట నిర్వహిస్తున్న ఈ రేవ్ పార్టీకి ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఈనెల 13వ తేదీ రాత్రి తమ ఈవెంట్లో మద్యం సరఫరా చేసేందుకు అనుమతించాలని.. ఆ రోజు ఉదయం కాశీ విశ్వనాథ్ కుమారుడు నరేంద్రకుమార్ అడగ్గానే అనుమతులిచ్చేశారు. వాస్తవానికి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడానికి ఎక్సైజ్ శాఖ అనుమతించకూడదు. లిక్కర్ షాపుల మాదిరిగానే ఈవెంట్లలో సైతం రాత్రి 11 గంటలకే మద్యం సరఫరా ముగించాలి. కానీ తెల్లవారుజాము వరకు కూడా యువతీయువకులు తాగి ఊగినా పట్టించుకోవడం మానేశారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్ అధికారులకు భారీగా ముడుపులు ముట్టినట్లు తెలిసింది. ఒకరి అరెస్టు.. రుషికొండ రేవ్ పార్టీ వ్యవహారంలో సీతమ్మధారకు చెందిన ఎం.సత్యనారాయణను పోలీసులు అరెస్టు చేశారు. ఆరిలోవ పోలీసులు అతని నుంచి మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, రుషికొండ విశ్వనాథ్ బీచ్ ఫ్రంట్ ప్రైవేటు లిమిటెడ్ లీజుదారుడు బి.నరేంద్రకుమార్, రేవ్ పార్టీ నిర్వాహకుడు సోను ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఏపీటీడీసీ డీవీఎం ప్రసాదరెడ్డి మాట్లాడుతూ.. విశ్వనాథ్ బీచ్ ఫ్రంట్ సంస్థ రేవ్ పార్టీ నిర్వహించిన ఘటనపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు. హైకోర్టు ఆదేశాలు తోసిరాజని.. సాగరతీరంలో పర్యావరణ అనుమతుల్లేకుండా ఎలాంటి ఈవెంట్లు, నిర్మాణాలకు అనుమతులు ఇవ్వవద్దని 2018 మే 1న హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తొట్లకొండలో ఓ రెస్టారెంట్ ఏర్పాటుకు సంబంధించి విశాఖ టౌన్ ఫిషర్ ఉమెన్ డ్రైఫిష్ కోపరేటివ్ సొసైటీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. ఈ మేరకు ఏపీటీడీసీకి ఆదేశాలిచ్చింది. కాగా, ఫిషర్మెన్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు చెందిన తెడ్డు శంకర్ మాట్లాడుతూ.. తాజా వ్యవహారంపై కోర్టు ధిక్కరణ కేసు వేస్తామని చెప్పారు. -
స్నేహితులే చంపేశారు
ఆరిలోవ(విశాఖ తూర్పు) : ఆరిలోవలో నాలుగు రోజుల కిందట దాడి చేసి ఓ యువకుడిని హత్య చేసిన నలుగురు నిందితులు గురువారం పోలీసులకు చిక్కారు. వీరంతా స్నేహితులే. మృతుడు, మిగిలిన వారి మధ్య మనస్పర్థలు రావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెల్ ఏసీపీ బి.మోహనరావు ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలను వెల్లడించారు. జీవీఎంసీ ఒకటో వార్డు ఐదో సెక్టార్ ప్రాంతం జైభీంనగర్, దుర్గాబజార్, ప్రగతినగర్ కాలనీలకు చెందిన బూరాడ ప్రసన్నకుమార్(24), సవరవిల్లి వెంకటరమణ, కొయ్య సతీష్, పొట్నూరు శ్యామ్, గుబ్బల పవన్ కుమార్‌లు స్నేహితులు. ప్రసన్నకుమార్ డైట్లో శిక్షణ పొంది, ఇటీవల టెట్ రాశాడు. మిగిలిన నలుగురు దీనదయాళ్‌పురం వద్ద జీవీఎంసీ కుక్కలు పట్టే కేంద్రంలో తాత్కాలిక ఉద్యోగులు. ప్రసన్న బాక్సర్. ‘నాతో మీరు ఫైటింగ్‌కు రాగలరా’ అంటూ తరచూ స్నేహితులపై పంచ్‌లు విసిరేవాడు. ఇటీవల వీరి నలుగురితో ప్రసన్నకు స్నేహం చెడింది. ఈ నేపథ్యంలో సవరవిల్లి వెంకటరమణ తండ్రి అప్పన్నను కొద్ది రోజుల కిందట ప్రసన్న తీవ్రంగా కొట్టాడు. వెంకటరమణతో తన తండ్రి జరిగిన విషయాన్ని చెప్పాడు. వెంకటరమణ మిగిలిన ముగ్గురు స్నేహితులకు ఈ విషయం తెలిపాడు. వారంతా ప్రణాళిక వేసుకుని ఈ నెల 10న ఆరిలోవ ఆఖరి బస్టాప్ మద్యం షాపు వద్ద మద్యం సేవించి, ప్రగతినగర్‌లో ఓ ఖాళీ స్థలం వద్ద మాటువేశారు. వారిలో ఒకరు ఇంట్లో ఉన్న ప్రసన్నను పిలిచాడు. ఖాళీ స్థలానికి వెళ్లిన ప్రసన్నను నలుగురూ కలసి ఇంటి నిర్మాణం కోసం ఉన్న రాళ్లతో బాదారు. ప్రసన్నను చంపాలనే ఆలోచనతోనే వీరంతా అతని తల, చేతులు, కాళ్లపై తీవ్రంగా కొట్టారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన ప్రసన్న తల్లిదండ్రులు, అక్క బావలను కొట్టి పరారయ్యారు. గాయాలపాలై అపస్మారక స్థితిలో ఉన్న ప్రసన్నను తండ్రి చిన్నారావు(ఏఆర్ కానిస్టేబుల్), బంధువులు కలసి పినాకిల్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రసన్న ఈ నెల 13 రాత్రి మృతి చెందాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితులు నలుగురూ గురువారం మధ్యాహ్నం ముడసర్లోవ దరి గోల్ఫ్ క్లబ్ పక్కన తుప్పల్లో పోలీసులకు పట్టుబడ్డారు. హత్యకు గురైన ప్రసన్న ఎస్టీ కులానికి చెందిన యువకుడు. దాడికి పాల్పడిన వారిలో ముగ్గురు ఎస్సీ సామాజిక వర్గానికి చెందగా కొయ్య సతీష్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. సతీష్‌పై హత్య కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, మిగిలిన ముగ్గురిపై హత్య కేసు నమోదు చేసినట్లు ఏసీపీ మోహనరావు తెలిపారు. వీరిని రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఎస్ఐ పాపారావు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
ఆరిలోవలో మిస్సైల్ కలకలం
-
ఆరిలోవలో మిస్సైల్ కలకలం
విశాఖపట్నం: విశాఖ జిల్లా ఆరిలోవ పోలిస్ స్టేషన్ పరిధిలో సోమవారం మిసైల్ కలకలం సృష్టించింది. డైరీ ఫార్మ్ జంక్షన్ వద్ద ఈ మిస్సైల్‌ను స్థానికులు గుర్తించారు. ఈ సమాచారాన్ని వెంటనే స్థానికులు పోలీసులకు తెలియజేశారు. సంఘటనాస్థలానికి చేరుకుని మిస్సైల్‌ను స్థానిక పోలీస్‌స్టేషన్‌లో భద్రపరిచారు.