Abbottabad
-
క్రికెట్ మ్యాచ్‌లో వివాదం.. కాల్పుల్లో ఏడుగురు మృతి
పెషావర్: క్రికెట్ మ్యాచ్‌లో వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. క్రికెట్ ఆడుకుంటున్న చిన్నారుల మధ్య మొదలైన స్వల్ప వివాదం కాస్తా తుపాకులతో కాల్చుకునే స్థాయికిపోయింది. వివాదం కారణంగా రెండు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్‌లోని కైబర్ పక్తుంక్వా ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. డిప్యూటీ సూపరిండింటెంట్ ఆఫ్ పోలీస్ ఇజాజ్ ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం.. కొందరు చిన్నారులు క్రికెట్ ఆడుకుంటుండగా వారి మధ్య ఘర్షణ జరిగింది. ఇది కాస్తా వారి తల్లిదండ్రుల దాకా వెళ్లింది. పిల్లల తల్లిదండ్రులు కూడా గొడవపడి ఫిర్యాదు చేసేందుకు అబోట్టాబాద్ జిల్లాలోని పోలీస్ పోస్టు వద్దకు వచ్చారు. ఈ క్రమంలోనే రెండు గ్రూపులకు చెందిన వారి మధ్య వాగ్వాదం చెలరేగండంతో ఓ గ్రూపుకు చెందిన వారు కాల్పులు జరిపారు. మరో గ్రూపువాళ్లుకూడా కాల్పులు ప్రారంభించడంతో పోలీస్ స్టేషన్ ప్రాంగణం కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఈ ఘటనలో ఓ గ్రూపులో ముగ్గురు, మరో గ్రూపులో నలుగురు మృతిచెందారు. మరో వ్యక్తి గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి బాధ్యులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. -
బిన్ లాడెన్ బతికే ఉన్నాడు!
ఆల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ ఇంకా పాకిస్తాన్ లోనే ఉన్నట్లు తాము విశ్వసిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్ తెలిపారు. తాలిబన్ అధినేత ముల్లా ఒమర్ కూడ అక్కడే ఉన్నట్లు ఆమె అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే తమ వద్ద ఎటువంటి ఆధారాలు లేవని హిల్లరీ తెలిపారు. అధ్యక్షుడు బరాక్ ఒబామాకు టాప్ అడ్వైజర్ గా ఉన్న 68 ఏళ్ళ హిల్లరీ క్లింటన్... 2011, మే 2న ఆపరేషన్ లో భాగంగా ఆల్ ఖైదా నాయకుడు, తీవ్రవాది అయిన బిన్ లాడెన్ కనిపిస్తే చంపేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రస్తుతం బిన్ లాడెన్ సహా ఆల్ ఖైదా నాయకులు పాకిస్తాన్ లోనే ఉన్నట్లు ఆమె సందేహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆల్ ఖైదా సూత్రధారులపై నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని క్లింటన్ అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా ఆల్ ఖైదా వ్యవస్థాపకుడు బిన్ లాడెన్ బృందం 2001 సెప్టెంబర్ 11న ఆమెరికాలో జరిగిన దాడులకు బాధ్య వహించాల్సిందేనని క్లింటన్ అంటున్నారు. కాగా హిల్లరీ అనుమానాలను పాకిస్తాన్ నాయకులు ఖండిస్తున్నారు. -
లాడెన్ ఆల్‌ఖైదా పేరు మార్చాలనుకున్నాడా ?
వాషింగ్టన్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ ఆ సంస్థ పేరు మార్చాలనుకుంటున్నారా ? అంటే అవుననే అంటున్నాయి అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ వర్గాలు. యూఎస్ సైన్యం చేతిలో లాడెన్ హతమయ్య కొద్ది రోజుల మందు.. ఆల్ ఖైదా సంస్థ పేరు మార్చాలని భావించాడని.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జోష్ ఎర్నిస్ట్ బుధవారం వాషింగ్టన్లో వెల్లడించారు. యూఎస్‌లో డబ్ల్యూటీసీ టవర్‌పై దాడి చేయడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో విధ్వంసానికి పాల్పడటంతో లాడెన్ ఆలోచనలో పడ్డాడు. అల్ ఖైదా మారణహోమానికి ప్రతీకగా నిలిచిందని లాడెన్ భావించాడు. ఇలాగే విధ్వంసం సృష్టిస్తే ప్రపంచవ్యాప్తంగా ఆల్ ఖైదాకు మరింతచెడ్డ పేరు వస్తుందని అనుకున్నాడు. ఆ క్రమంలో ఆల్ ఖైదా పేరు మార్చాలనుకున్నాడు... అది కూడా ఇస్లాం మాతానికి చాలా దగ్గరగా ఉండేలా కొత్త పేరు పెట్టాలనుకున్నాడు. ఆ దిశగా ఆలోచనలు చేస్తూ...ఆల్‌ఖైదా నాయకులతో సమాలోచన చేసేందుకు చర్యలు కూడా చేపట్టాడని ఎర్నెస్ట్ వివరించారు. ఇంతలో లాడెన్ పాకిస్థాన్ అబోటాబాద్‌లోని బిలాల్ పట్టణంలో ఉన్నట్లు గుర్తించిన యూఎస్ సైన్యం... 2011, మే 2వ తేదీన అతడి నివాసంపై దాడి చేసి... అతడ్ని అంతమెందించింది. అనంతరం అతడి మృతదేహాన్ని యూఎస్ సైన్యం సముద్రంలో పడి వేసిన విషయం విదితమే.అయితే లాడెన్‌ను చంపేసిన తర్వాత అతడి నివాసంలో యూఎస్ సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది. ఆ క్రమంలో పలు కీలకమైన పత్రాలను సైన్యం స్వాధీనం చేసుకుంది. ఆ పత్రాలను పరిశీలించిన యూఎస్ ఉన్నతాధికారులకు పలు ఆసక్తికరమైన అంశాలు తెలిశాయి.