Abdul Jabbar
-
భోపాల్ గ్యాస్ బాధితుల ఉద్యమ నేత కన్నుమూత
1984 భోపాల్ గ్యాస్ బాధితుల తరపున సుదీర్ఘ కాలంగా పోరాడుతున్న ఉద్యమ నేత అబ్దుల్ జబ్బర్ ఇకలేరు. తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ఘటనలో 20 వేల మంది బాధితుల న్యాయం కోసం పోరాడిన ఆయన అనారోగ్యంతో మరణించారు. గురువారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వైద్య ఖర్చులను భరిస్తామని కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయనను మెరుగైన చికిత్స నిమిత్తం ముంబైకి తరలించాలని ప్రయత్నించారు. కానీ ఇంతలోనే ఆయన కన్నుమూయడం విషాదం. ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన పారిశ్రామిక ప్రమాదమైన భోపాల్ గ్యాస్ ప్రమాదంలో అబ్దుల్ జబ్బర్ తన తల్లి, తండ్రి, సోదరుడిని కోల్పోయారు. ఈ ప్రమాదంలో జబ్బర్ కూడా ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్‌తో బాధడ్డారు. అంతేకాకుండా ప్రమాదం కారణంగా 50 శాతం దృష్టిని కోల్పోయినప్పటికీ జబ్బర్ న్యాయం కోసం తన పోరాటం ఎప్పుడూ ఆపలేదు. భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితుల తరపున పోరాడేందుకు 1987లో, ‘భోపాల్ గ్యాస్ పీడిత్ మహీళా ఉద్యోగ్ సంఘటన్’ను ప్రారంభించారు. కాగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ పురుగుమందుల ప్లాంట్ నుండి డిసెంబర్ 2-3, 1984 అర్థరాత్రి మిథైల్ ఐసోసైనేట్ వాయువు లీక్ కావడంతో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికి అనేకమంది దీని కారణంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మరోవైపు భోపాల్ గ్యాస్ విషాదం జరిగిన కొద్దిసేపటికే.. అమెరికా పౌరుడైన యూనియన్ కార్బైడ్ సీఈఓ వారెన్ ఆండర్సన్ తప్పించుకున్నాడు. ఈ కేసులో విచారణకు హాజరుకాలేదు. అతను 2013లో అమెరికాలో మరణించాడు. -
ఖలీఫా గారూ.. శుభవార్త
అది ఖలీఫా హజరత్ ఉమర్ ఫారూఖ్ (రజి) పాలనాకాలం. ప్రజల యోగ క్షేమాలు తెలుసుకోవడానికి గాను ఆయన మారువేషంలో స్వయంగా గస్తీ తిరిగేవారు. ఒకరోజు అలా మదీనా పట్టణంలోని వీధులలో తిరుగుతున్నారు. ఒక ఇంటి నుండి మహిళ ఏడుస్తున్న శబ్దం వినిపించి ఆ ఇంటి దగ్గరకు వెళ్లారు. ఇంటి ముందర కూర్చున్న వ్యక్తిని చూసి సలాం చేసి ‘ఎవరు నీవు?’ అని అడిగారు. ఆ వ్యక్తి ‘అయ్యా! నేనొక ఎడారి నివాసిని, మన ఖలీఫా వారి వద్దకు వెళ్లి వారి దయాదక్షిణ్యాలతో సహాయం పొందాలని వచ్చాను’ అని చెప్పాడు. ‘మరి ఇక్కడ ఎవరో ఏడుస్తున్నట్లు వినిపిస్తోందే! అది ఎవరు?’ అని ప్రశ్నించారు. ‘నా భార్య నిండు గర్భవతి. పురుటినొప్పులతో బాధపడుతోంది’ అని బదులు పలికాడా వ్యక్తి. ‘ఆమె వద్ద ఎవరైనా ఉన్నారా?’ అని అడుగగా ఎవ్వరూ లేరని ఆ వ్యక్తి విచారంగా చెప్పాడు. వెంటనే ఖలీఫాగారు ఇంటికెళ్లి తన భార్య హజరత్ ఉమ్మె కుల్సుం (రజి)తో ‘ఒక నిరుపేద స్త్రీ పురిటి నొప్పులతో బాధపడుతోంది. ఆమె వద్ద ఎవ్వరూ లేరు. కొన్ని వస్త్రాలు, నూనె, కాన్పు సమయంలో అవసరమయ్యే సామాగ్రి తీసుకుని నాతో రండి’ అని చెప్పారు. ఆమె ఒక మట్టి పాత్ర, కొంత పిండి, నెయ్యి, బెల్లం తదితర సామగ్రి తీసుకుని ఖలీఫా గారి వెంబడి వెళ్లారు. ఆ ఇంటికి చేరిన తర్వాత భార్యను లోపలికి పంపి ఖలీఫా గారు బయట కూర్చున్న వ్యక్తి వద్దకు వచ్చి కూచోని పొయ్యి వెలిగించి, కుండను పొయ్యిమీద ఉంచి కుండలో నీళ్లు పోసి పిండి, బెల్లం, నెయ్యి ఖర్జూరాలు వేసి రుచికరమైన పదార్థాన్ని తయారు చేశారు. అంతలోనే ఖలీఫా భార్య లోపలి నుండి ‘ఓ ఖలీఫాగారూ, మీ స్నేహితునికి పుత్రుడు జన్మించిన శుభవార్త తెల్పండి’ అన్నారు.‘ఖలీఫా గారు’ అన్న సంబోధన విన్న ఆ పల్లెటూరి వ్యక్తి నిశ్చేష్టుడై అలాగే నిలబడిపోయాడు. అతన్ని చూసిన ఖలీఫా ఆ కుండను ఆ వ్యక్తి ముందుంచి ‘నువ్వు ఏమీ ఆలోచించ వద్దు, రాత్రంతా మేల్కొని ఉన్నారు కదా, నీవు, నీ భార్య కడుపు నిండా తిని విశ్రాంతి తీసుకుని, తెల్లవారగానే నా వద్దకు రండి. మీకు అవసరమైన సామగ్రి ఇచ్చి, ధనసహాయం చేస్తాను’ అని చెప్పి, తన భార్యను తీసుకొని తమ నివాసానికి వెళ్లిపోయారు. – అబ్దుల్ జబ్బార్ -
ఉగ్రవాది సెంట్రింగ్ జబ్బార్ దోషే: కొచ్చి కోర్టు
సాక్షి, హైదరాబాద్: కాశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్ నుంచి త్రుటిలో తప్పించుకుని, 2008లో కేరళ పోలీసులకు పట్టుబడిన ఉగ్రవాది అబ్దుల్ జబ్బార్‌ను కొచ్చి న్యాయస్థానం మంగళవారం దోషిగా పేర్కొంది. కేరళలోని మలప్పురం జిల్లా థిరూర్కు చెందిన అబ్దుల్ జబ్బార్ నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా (ఎల్ఈటీ)లో కీలకవ్యక్తి. 2005లో కొచ్చి సమీపంలోని కలామ్సెర్రీలో తమిళనాడుకు చెందిన ఓ ఆర్టీసీ బస్సును దహనం చేసిన కేసులో పోలీసుల వేట తీవ్రం కావడంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌కు వెళ్లి తలదాచుకున్నాడు. 2008లో కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లా లోల్యాబ్ వ్యాలీలో జరిగిన ఎన్కౌంటర్ నుంచి గాయాలతో తప్పించుకున్నాడు. హైదరాబాద్‌కు వచ్చి రాజేంద్రనగర్ పరిధి చింతల్‌మెట్‌కు చెందిన నాజియబీని వివాహం చేసుకున్నాడు. అయితే కాశ్మీర్ ఎన్కౌంటర్ మృతుల వద్ద లభించిన ఆధారాలతో కేరళ ఏటీఎస్ పోలీసులు హైదరాబాద్ బండ్లగూడలో ఉన్నట్లు గుర్తించి జబ్బార్ ను అరెస్టు చేశారు.