సాక్షి, హైదరాబాద్: కాశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ నుంచి త్రుటిలో తప్పించుకుని, 2008లో కేరళ పోలీసులకు పట్టుబడిన ఉగ్రవాది అబ్దుల్ జబ్బార్‌ను కొచ్చి న్యాయస్థానం మంగళవారం దోషిగా పేర్కొంది. కేరళలోని మలప్పురం జిల్లా థిరూర్‌కు చెందిన అబ్దుల్ జబ్బార్ నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా (ఎల్‌ఈటీ)లో కీలకవ్యక్తి. 2005లో కొచ్చి సమీపంలోని కలామ్‌సెర్రీలో తమిళనాడుకు చెందిన ఓ ఆర్టీసీ బస్సును దహనం చేసిన కేసులో పోలీసుల వేట తీవ్రం కావడంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌కు వెళ్లి తలదాచుకున్నాడు.
2008లో కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లా లోల్యాబ్ వ్యాలీలో జరిగిన ఎన్‌కౌంటర్ నుంచి గాయాలతో తప్పించుకున్నాడు. హైదరాబాద్‌కు వచ్చి రాజేంద్రనగర్ పరిధి చింతల్‌మెట్‌కు చెందిన నాజియబీని వివాహం చేసుకున్నాడు. అయితే కాశ్మీర్ ఎన్‌కౌంటర్ మృతుల వద్ద లభించిన ఆధారాలతో కేరళ ఏటీఎస్ పోలీసులు హైదరాబాద్ బండ్లగూడలో ఉన్నట్లు గుర్తించి జబ్బార్ ను అరెస్టు చేశారు.
ఉగ్రవాది సెంట్రింగ్ జబ్బార్ దోషే: కొచ్చి కోర్టు
Published Wed, Oct 2 2013 4:49 AM | Last Updated on Fri, Sep 1 2017 11:14 PM
Advertisement