Abdul Kareem
-
ఆధారాలు లేవు.. కాబట్టి వారంతా నిర్దోషులే!
సాక్షి, ముంబై : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వేల కోట్ల రూపాయల నకిలీ స్టాంపు పేపర్ల కుంభకోణం నిందితులంతా నిర్దోషులేనని నాసిక్ సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. సీబీఐ దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో ప్రధాన నిందితుడు అబ్దుల్ కరీం తెల్గీ, మరో ఏడుగురికి వ్యతిరేకంగా సరైన ఆధారాలు లభించలేదని పేర్కొంది. 2004లో నకిలీ స్టాంపుల రాకెట్ నడుపుతున్నాడన్న ఆరోపణలపై తెల్గీని పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో సుమారు రూ.32 వేల కోట్ల మేర స్టాంపుల విక్రయం జరిగింది. కాగా, వేరే కేసుల్లో దోషిగా తేలడంతో కోర్టు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తెల్గీ గతేడాది బెంగళూరులోని జైలులో చనిపోయాడు. జైలు జీవితం నేర్పిన ఫోర్జరీ పాఠాలు సాధారణ రైల్వే ఉద్యోగి కుమారుడైన కరీం తెల్గీ 2001లో అరెస్టయ్యే వరకూ రాజకీయ నాయకులు, పోలీసుల సాయంతో అనేక రాష్ట్రాల్లో అక్రమ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అతడి నకిలీ అక్రమాల విలువ దాదాపు రూ.20వేల కోట్లు. దేశ ఆర్థిక మార్కెట్లను కుదిపేసిన ఈ అక్రమాల తీవ్రత దాదాపు రూ.33వేలకోట్లు. కర్ణాటకలోని బెలగావి జిల్లా ఖానాపూర్‌కు చెందిన తెల్గీ చిన్నతనంలో రైళ్లలో కూరగాయలు, పళ్లు అమ్మేవాడు. బెలగావి కాలేజీ నుంచి బీకాం డిగ్రీ సంపాదించాక సౌదీకి వెళ్లాడు. అక్కడ దాదాపు ఏడేళ్లు గడిపి తిరిగి ముంబైకి చేరాక అండర్ వరల్డ్ మాఫియాతో సంబంధాలు పెట్టుకున్నాడు. యువకులను దుబాయ్ పంపిస్తానని మోసగించిన కేసులో ముంబై పోలీసులు 1991లో తెల్గీని అరెస్ట్ చేశారు. అక్కడే అతని జీవితం మలుపు తిరిగింది. నకిలీ షేర్ల కేసులో శిక్ష పడ్డ రామ్ రతన్ సోనీ నుంచి తెల్గీ ఫోర్జరీ మెళకువలు నేర్చుకున్నాడు. జైలునుంచి బయటికొచ్చేందుకు అధికారులకు లంచమిచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. తెల్గీ అక్రమ సామ్రాజ్య విస్తరణ రాజకీయ నాయకులు, సెక్యూరిటీ ప్రెస్ అండతో 1994లో స్టాంప్ పేపర్ లైసెన్స్ సంపాదించిన తెల్గీ ముంబై మింట్ రోడ్డులో కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. రెవెన్యూ శాఖ, స్టాంప్ కార్యాలయం, నాసిక్ సెక్యూరిటీ ప్రెస్‌లోని అధికారులతో స్నేహం పెంచుకున్నాడు. తనకున్న రాజకీయ సాన్నిహిత్యంతో నాసిక్ ప్రెస్‌లో యంత్రాల్ని పనికిరానివిగా ప్రకటించేలా చేసి వాటిని సొంతం చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. వాటిని కొని ముంబైలోని తన కార్యాలయంలో స్టాంపు పేపర్ల ముద్రణ ప్రారంభించాడు. నాసిక్ ప్రెస్ భద్రతా అధికారుల సాయంతో స్టాంపుల ముద్రణ రంగుల్ని సంపాదించిన తెల్గీ... 350 మంది ఏజెంట్ల సాయంతో భారీ స్థాయిలో నకిలీ స్టాంపుల కుంభకోణాన్ని కొనసాగించాడు. వారు బ్యాంకులు, బీమా కంపెనీలు, స్టాక్ బోక్రరేజ్ సంస్థలు, కార్పొరేట్ కార్యాలయాలకు పెద్ద మొత్తంలో నకిలీ స్టాంపుల్ని విక్రయించేవారు. అధికారంలో ఉన్న నేతలు, పోలీసు అధికారుల సహకారంతో తెల్గీ ఈ వ్యాపారాన్ని నిరాటంకంగా కొనసాగించినట్లు దర్యాప్తు సంస్థల విచారణలో తేలింది. నార్కో పరీక్షల్లో అతడు అనేకమంది ప్రముఖుల పేర్లను కూడా వెల్లడించాడు. -
కరీం తెల్గీ మృతి
-
కరీం తెల్గీ మృతి
సాక్షి, బెంగళూరు: సంచలనం సృష్టించిన కోట్లాది రూపాయల నకిలీ స్టాంప్ పేపర్ల కుంభకోణం సూత్రధారి అబ్దుల్ కరీం తెల్గీ(56) గురువారం మృతిచెందాడు. మెనింజైటిస్, బహుళ అవయవ వైఫల్యంతో వారం రోజులుగా తెల్గీ బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని, గురువారం గుండెపోటు రావడంతో పరిస్థితి పూర్తిగా విషమించిందని వైద్యులు చెప్పారు. జైలులో ప్రత్యేక మర్యాదలు పొందిన వారిలో తెల్గీ ఉన్నారని అప్పటి కర్ణాటక డీఐజీ ఆరోపించడంతో ఆయన మళ్లీ వార్తల్లోకెక్కారు. నకిలీ స్టాంప్ పేపర్ల కేసులో తెల్గీ 2001లో అజ్మీర్‌లో అరెస్టయ్యాడు. 2006లో కోర్టు ఆయనకి 30 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.202 కోట్ల జరిమానా విధించింది. గత 16 ఏళ్లుగా బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. జైలులో ఉన్న సమయంలో తెల్గీకి హెచ్ఐవీ సిరంజి ఎక్కించారని ఆయన తరఫు లాయర్ గతంలో కోర్టుకు చెప్పారు. నాయకులు, సెక్యూరిటీ ప్రెస్ అండతోనే.. 1994లో స్టాంప్ పేపర్ లైసెన్స్ సంపాదించిన తెల్గీ ముంబై మింట్ రోడ్డులో కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. రెవెన్యూ శాఖ, స్టాంప్ కార్యాలయం, నాసిక్ సెక్యూరిటీ ప్రెస్‌లోని అధికారులతో స్నేహం పెంచుకున్నాడు. తనకున్న రాజకీయ సాన్నిహిత్యంతో నాసిక్ ప్రెస్‌లో యంత్రాల్ని పనికిరానివిగా ప్రకటించేలా చేసి వాటిని సొంతం చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. వాటిని కొని ముంబైలోని తన కార్యాలయంలో స్టాంపు పేపర్ల ముద్రణను ప్రారంభించాడు. నాసిక్ ప్రెస్ భద్రతా అధికారుల సాయంతో స్టాంపుల ముద్రణ రంగుల్ని సంపాదించాడు. 350 మంది ఏజెంట్ల సాయంతో భారీ స్థాయిలో నకిలీ స్టాంపుల కుంభకోణాన్ని కొనసాగించాడు. వారు బ్యాంకులు, బీమా కంపెనీలు, స్టాక్ బోక్రరేజ్ సంస్థలు, కార్పొరేట్ కార్యాలయాలకు పెద్ద మొత్తంలో నకిలీ స్టాంపుల్ని విక్రయించేవారు. అధికారంలో ఉన్న నేతలు, పోలీసు అధికారుల సహకారంతో తెల్గీ ఈ వ్యాపారాన్ని నిరాటంకంగా కొనసాగించినట్లు దర్యాప్తు సంస్థల విచారణలో తేలింది. నార్కో పరీక్షల్లో అనేకమంది ప్రముఖుల పేర్లను వెల్లడించాడు. మలుపు తిప్పిన జైలు జీవితం సాధారణ రైల్వే ఉద్యోగి కుమారుడైన అతను 2001లో అరెస్టయ్యే వరకూ రాజకీయ నాయకులు, పోలీసుల సాయంతో అనేక రాష్ట్రాల్లో అక్రమ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. నకిలీ తెల్గీ అక్రమాల విలువ దాదాపు రూ.20వేల కోట్లు. దేశ ఆర్థిక మార్కెట్లను కుదిపేసిన ఈ అక్రమాల తీవ్రత దాదాపు రూ.33వేలకోట్లు. కర్ణాటకలోని బెలగావి జిల్లా ఖానాపూర్‌కు చెందిన తెల్గీ చిన్నతనంలో రైళ్లలో కూరగాయలు, పళ్లు అమ్మేవాడు. బెలగావి కాలేజీ నుంచి బీకాం డిగ్రీ సంపాదించాక సౌదీకి వెళ్లాడు. అక్కడ దాదాపు ఏడేళ్లు గడిపి తిరిగి ముంబైకి చేరాక అండర్ వరల్డ్ మాఫియాతో సంబంధాలు పెట్టుకున్నాడు. యువకులను దుబాయ్ పంపిస్తానని మోసగించిన కేసులో ముంబై పోలీసులు 1991లో తెల్గీని అరెస్ట్ చేశారు. అక్కడే అతని జీవితం మలుపు తిరిగింది. నకిలీ షేర్ల కేసులో శిక్ష పడ్డరామ్ రతన్ సోనీ నుంచి తెల్గీ ఫోర్జరీ మెలకువలు నేర్చుకున్నాడు. జైలునుంచి బయటికొచ్చేందుకు అధికారులకు లంచమిచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. -
కరీం తెల్గీ కన్నుమూత
-
కరీం తెల్గీ కన్నుమూత
సాక్షి, బెంగళూర్ : నకిలీ స్టాంపుల కుంభకోణం కేసులో ప్రధాన సూత్రధారి అబ్దుల్ కరీం తెల్గీ కన్నుమూశాడు. గత కొంత కాలంగా వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో తెల్గీ బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్యే అతన్ని బెంగళూర్ లోని విక్టోరియా ఆస్పత్రిలో చేర్పించి, చికిత్స అందజేస్తున్నారు కూడా. కాగా, వేల కోట్లకు సంబంధించిన నకిలీ స్టాంప్ పేపర్ల కుంభకోణంలో నిందితుడిగా ఉన్న తెల్గీని అజ్మీర్ లో నవంబర్ 2001లో తెల్గీని అరెస్ట్ చేశారు. దోషిగా తేలటంతో కోర్టు 30 సంవత్సరాల కఠిన శిక్ష విధించగా.. అప్పటి నుంచి బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఆయన్ను ఉంచారు. అంతేకాదు రూ. 202 కోట్ల జరిమానాను విధించింది కూడా. ఆ మధ్య ఈయనకు జైల్లోనే చికిత్స అందించారంటూ జైళ్ల మాజీ డీఐజీ రూప ఆరోణలు చేసిన విషయం తెలిసిందే. -
కరీం తెల్గీ పరిస్థితి విషమం
-
తుది ఘడియల్లో తెల్గీ
సాక్షి, బెంగళూర్ : దేశాన్ని ఆర్థికంగా కుదిపేసిన నకిలీ స్టాంపు పేపర్ల కుంభకోణం ప్రధాన సూత్రధారిగా అబ్దుల్ కరీం తెల్గీ ఆరోగ్యం విషమించినట్లు సమాచారం. ప్రస్తుతానికి బతికే ఉన్నప్పటికీ.. వెంటిలేటర్‌పై ఉన్నట్లు కరీం తరపు న్యాయవాది ఎంటీ నన్నయ్య మీడియాకు తెలిపారు. సుదీర్ఘ అనారోగ్యంతో కరీం బాధపడుతుండగా.. పరిస్థితి విషమించటంతో నాలుగు రోజుల క్రితం బెంగళూర్‌లోని విక్టోరియా ఆస్పత్రిలో చేర్పించారు. నరాల సంబంధిత వ్యాధితో కరీం బాధపడుతున్నాడని నన్నయ్య చెప్పారు. మరికాస్త ముందే కరీంను ఆస్పత్రికి తీసుకొచ్చి ఉంటే ఇలా ఉండేది కాదని ఆయన చెబుతున్నాడు. కాగా, గత 20 ఏళ్లుగా డయాబెటిస్, హైపర్ టెన్షన్ వంటి వ్యాధులతో సతమతమవుతున్న ఆయన.. ఎయిడ్స్ కూడా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మెదడు నుంచి వెన్నెముకకు దారితీసే కండరాలు, రక్తనాళాలు బలహీనపడ్డాయని, దీంతో ఆయన కదల్లేని స్థితిలో ఉన్నారని చెబుతున్నారు. కాగా, వేల కోట్లకు సంబంధించిన నకిలీ స్టాంప్ పేపర్ల కుంభకోణంలో నిందితుడిగా ఉన్న తెల్గీని అజ్మీర్ లో నవంబర్ 2001లో తెల్గీని అరెస్ట్ చేశారు. దోషిగా తేలటంతో కోర్టు 30 సంవత్సరాల కఠిన శిక్ష విధించగా.. అప్పటి నుంచి బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఆయన్ను ఉంచారు. అంతేకాదు రూ. 202 కోట్ల జరిమానాను విధించింది కూడా. ఆ మధ్య ఈయనకు జైల్లోనే చికిత్స అందించారంటూ జైళ్ల మాజీ డీఐజీ రూప ఆరోణలు చేసిన విషయం తెలిసిందే. -
అబ్దుల్ కరీం అడవిని నాటాడు!
ఇది వాస్తవం. ఓ వ్యక్తి చెట్లు నాటగలడు, తోట పెంచగలడు. కానీ అసమాన ప్రయత్నం చేసిన ఓ వ్యక్తి అడవిని పెంచాడు. అది అచ్చంగా అడవి లక్షణాలతో ఉన్న అడవే. అందులో అన్నీ అటవీ వృక్షాలే! ఇది ఎలా సాధ్యం, ఆయన ఎవరు? సాఫల్యం: భారతీయులు గల్ఫ్ దేశాలకు వెళ్లడం మామూలే. కేరళీయులు అయితే మరీ ఎక్కువగా వెళ్తుంటారు. అలా వలస వెళ్లిన వారిలో ఒకరు అబ్దుల్ కరీం. కేరళలోని కాసరగాడ్ జిల్లాలో పరప్పా ప్రాంతం ఆయన నివాసం. పెళ్లి చేసుకుంది పుళియాంకుళంలో. ఆ ఊరికి వెళ్లినపుడల్లా ఆ ప్రాంతంలోని కొండల పక్కనే ఉన్న ఖాళీ స్థలాన్ని ఆయన గమనించేవారు. అది పంటలకు పనికొచ్చే స్థలం కాదు. లేటరైట్ రాయితో నిండిన నేల. 3750 రూపాయలు పెట్టి అక్కడే ఓ ఐదెకరాలు కొన్నాడు. అప్పట్లో అది పెద్ద మొత్తమే. పైగా గల్ఫ్‌కు వెళ్లొచ్చి చేసుకున్న పొదుపు సొమ్ము అది. పంటే పండని ఆ నేలలో 1979లో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ విస్మయానికి గురిచేసింది. చివరికి ఇంట్లో వారు కూడా ఆ పనిని ఇష్టపడలేదు. అయినా సరే ఆయన మాత్రం పట్టించుకోలేదు. ఆ ఊళ్లో అబ్దుల్ కరీమ్ అమాయకత్వాన్ని చూసి నవ్వుకోని వారు లేరు. కరీం కొన్న పంటలు పండని ఆ పొలంలో ఒక బావి ఉంది. అందులో నీళ్లుండవు. మరి నవ్వక ఏం చేస్తారు? ఆ పొలం కొనడమే ఆశ్చర్యం అనుకుంటే అందులో చిన్నచిన్న మొక్కలు తెచ్చినాటాడు కరీం. అవి ఫలాలను ఇచ్చే మొక్కలేం కావు. అన్నీ అటవీ మొక్కలే. వాటికి మళ్లీ స్కూటరుపై మోసుకుని ఎక్కడినుంచో నీళ్లు తెచ్చిపోసేవాడు. చిత్రం ఏంటంటే... ఆ మొక్కలన్నీ చనిపోయాయి. ఇక చూడండి కరీం పరిస్థితి. జనంలో మరింత చులకన అయిపోయాడు. కానీ అతను ఎప్పుడూ వేరే వారి గురించి పట్టించుకోలేదు. మరోసారి అదే ప్రయత్నం చేశాడు... అది కూడా విఫలమవడంతో ఇంట్లో వారి నుంచి గట్టి వ్యతిరేకత వ్యక్తమైంది. పొలంలో మట్టేలేదు మరి. ఎక్కడ చూసినా గడ్డకట్టిన మట్టిలాంటి లాటరైట్ రాళ్లన్నీ. వాటి మధ్యలో నాటేవాడు మొక్కలు. తర్వాత మరో కొత్త ఆలోచన చేశాడు కరీం. ఇంతకుముందులా పద్ధతి ప్రకారం కాకుండా ఎన్నిమొక్కలు వీలైతే అన్ని మొక్కలు నాటేశాడు... దీంతో చాలా మొక్కలు వాడిపోయినా.. పెద్దసంఖ్యలోనే బతికి బట్టకట్టాయి. మొక్క పెద్దదయిన కొద్దీ నీళ్లు ఎక్కువ కావాలి. అది చాలా కష్టం. అందుకే మొదట్నుంచీ ఆ పని కూడా మొదలుపెట్టాడు. కొండపై నుంచి వచ్చే నీళ్లకు, ఆ నీళ్ల ద్వారా వచ్చే మట్టికి పొలంలో చిన్న అడ్డుకట్టలు కట్టి ఉంచాడు. అలాంటి కట్టలు నిండి వచ్చే నీరు అక్కడున్న బావిలోకి పోయేలా చేశాడు. దీంతో మొట్టమొదటి సారి ఆ బావి నిండింది. క్రమంగా పొలంలో మట్టి చేరడం పెరిగింది. మొక్కలు కాస్తా చిన్నచిన్న చెట్లయ్యాయి. ఆ బావి నీటిని వాటికి తోడిపోసే వాడు. బావిలో ఎప్పుడూ నీళ్లుండేలా చూసుకున్నాడు. కొంతకాలానికి ఆ ప్రాంతం కాస్త తడిగా మారింది. భూమిలోకి నీరు ఇంకడమే కాక, రాలిన ఆకులు, కొట్టుకువచ్చిన మట్టి వల్ల ఓ పదేళ్లకు అది మెత్తటి మట్టి పొలంగా మారింది. ఆ ఉత్సాహంతో పక్కనే ఉన్న అలాంటి ప్రాంతమే సుమారు 27 ఎకరాలు కొన్నాడు. దానిని కూడా ఇదే పద్ధతిలో అభివృద్ధి చేశాడు. అతడు ఐదెకరాల కొండ ప్రాంతాన్ని పచ్చటి చెట్లతో నింపినందుకు అందరూ ఆశ్చర్యపడినా... అవేవీ ఫలాన్నిచ్చేవి కాకపోవడంతో అప్పటికీ సదభిప్రాయం ఏర్పరుచుకోలేకపోయారు. మొత్తం 32 ఎకరాల్లో మొత్తం అడవిని పెంచాడు కరీం. ఇప్పటికి 35 సంవత్సరాలు అయ్యింది. ఇపుడు అది పెద్ద అడవి. అడవి పచ్చగా ఉంటే సరిపోదు, వాటిలో జంతుజాలం కూడా ఉంటేనే అందం. అందుకే తన అడవి నిండా చిన్న చిన్న జంతువులు, పక్షులు తాగడానికి నీటి కొలనులు కృత్రిమంగా ఏర్పాటుచేశాడు. దీంతో ఆ అడవి పశుపక్ష్యాదులకు అనువైన నివాసంగా మారింది. పదేళ్ల క్రితం తొలిసారి కరీం కృషి ప్రపంచం కళ్లలో పడింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్‌తో పాటు ఎన్నో అంతర్జాతీయ సంస్థలు ఆయన్ను ఆశ్చర్యంగా చూశాయి. ఆయన, ఆ అడవి రెండూ ఇప్పుడు ఎకో టూరిజానికి రోల్‌మోడల్స్. ఇంకో విషయం తెలుసా... ఆయన ఆ నేలను కొంటే నవ్విన వారు, వారి పిల్లలు ఇప్పుడు ఎండాకాలంలో మంచినీటి కోసం ఆయన బావి వద్దకే వస్తున్నారు. బయట అన్ని బావులు ఎండిపోయినా కరీం అడవిలో బావులు ఎండిపోవు. అమితాబ్ బచ్చన్, కేరళ ముఖ్యమంత్రి సహా ప్రపంచంలో ఎంతో మంది ఆ అడవిని సందర్శించి ఆయనను అభినందించారు. ఆయన ప్రయత్నం కేరళ ఆరోతరగతి పుస్తకంలో ఓ పాఠం. ఆయన పిల్లల్లో ఐదుగురు విదేశాల్లో స్థిరపడ్డారు. ఇప్పటికీ ఇద్దరు పిల్లలు అదే అడవిలో నివాసం ఉంటున్నారు.