Abdul Qadeer
-
రైతు శాస్త్రవేత్తలకు జేజేలు!
అద్భుతాల ఆవిష్కర్త అబ్దుల్ ఖాదర్! తరుముకొచ్చే అవసరంలో నుంచే.. సృజనాత్మక ఆలోచన పొటమరిస్తుంది! అప్పటివరకూ అసాధ్యమైన పనిని సులభసాధ్యం చేసే.. సరికొత్త ఆలోచనై మెరుస్తుంది!! జనజీవనాన్ని బండ చాకిరీ నుంచి గట్టెక్కించే.. విశిష్ట ఆవిష్కరణై వెలుగుతుంది!!! అటువంటి అమూల్య ఆవిష్కరణలకు జన్మనిచ్చిన సృజనశీలురు ఆశీనులైన సుందర సమావేశ మందిరం అది. పువ్వుల మకరందాన్ని తెచ్చే తేనెటీగలకు పుస్తకాల చదువులు.. భాష.. ప్రాంతీయ భేదాలతో నిమిత్తమేముంది? మార్చి 7వ తేదీ.. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ఆవరణలోని కల్చరల్ సెంటర్ అది. పూల మకరందాన్ని వెంట తెచ్చిన తేనెటీగల మాదిరిగా.. గ్రామీణ ఆవిష్కర్తలు, రైతు శాస్త్రవేత్తలు, సంప్రదాయ విజ్ఞాన పరిరక్షకులు దేశం నలుమూలల నుంచి తరలివచ్చారు. సభికుల కరతాళ ధ్వనుల మధ్య రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వారికి నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్.ఐ.ఎఫ్.) జాతీయ పురస్కారాలను అందజేశారు. ఇన్నోవేషన్ ఫెస్టివల్లో పురస్కార గ్రహీతల విశిష్ట ఆవిష్కరణల వివరాలు కొన్ని ‘సాగుబడి’ పాఠకుల కోసం.. అబ్దుల్ ఖాదర్ నడకట్టిన్! వ్యవసాయదారుడిగా తనకు ఎదురైన సమస్యల పరిష్కారానికి తనకు తానే సృజనాత్మక పరిష్కారాలు వెదుకుతూ విశిష్ట యంత్రాల ఆవిష్కర్తగా ఎదిగారు. పేరు ప్రతిష్టలు, అవార్డులు ఆయనను వెతుక్కుంటూ వచ్చాయి. తాజాగా రాష్ట్రపతి చేతుల మీదుగా ఎన్ఐఎఫ్ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. ఆయన ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు.. అబ్దుల్ ఖాదర్‌కు 62 ఏళ్లు. ధార్వాడ్ (కర్ణాటక) జిల్లాలోని అన్నిగెరి గ్రామం. పుస్తకాల చదువు బడి ఆవరణలోనే ఆగిపోయి.. సేద్యమే జీవనమైంది. అలారం మోతకు కూడా వదలని మొద్దు నిద్ర ఆయనకు అలవాటు. ఈ సమస్య నుంచి బయటపడడానికి.. శబ్దం చేయడంతో పాటు మొహం మీద నీళ్లొలికించే అలారాన్ని చదువుకునే రోజుల్లోనే తయారు చేశారు. అది మొదలు.. వ్యవసాయంలో తనకు ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి ఒకటి తర్వాత మరొకటిగా అనేక యంత్రాలను తయారు చేసుకున్నారు. తక్కువ ఖర్చుతో, పర్యావరణానికి హాని జరగకుండా ఉండే సాగు పద్ధతులను అనుసరిస్తుంటారు. చింతలు తీర్చిన చింతపండు తండ్రి ఆయనకు 60 ఎకరాల సాగుభూమి ఇచ్చారు. 1985లో కరువు ముంచుకొచ్చిన తర్వాత మామిడి తదితర పండ్ల తోటలూ చనిపోవటంతో దిక్కు తోచలేదు. భగర్భ జలాల్లో క్షార గుణం అధికంగా ఉంది. అయినా, కొన్ని ఎకరాల్లో చింత మొక్కలు (వరుసల మధ్య 20 అడుగుల ఎడం) నాటారు. ప్రయోగం ఫలించడంతో మొత్తం 16 ఎకరాల్లో 1800 చింత తోపును సాగు చేస్తున్నారు. తొలుత చింత పండును అమ్మేవారు. చింతపండు నాణ్యత చెడిపోకుండా నిల్వచేసేందుకు భూగర్భ గదుల వ్యవస్థను కనుగొన్నారు. ఆ తర్వాత పచ్చళ్లు తయారు చేసి అమ్మడం మొదలుపెట్టారు. చింతపండు కోయటం, గింజలు తీయడం కష్టతరమై ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి 1994లోనే రూ.3 లక్షల ఖర్చుతో 6 నెలలు శ్రమపడి చింత పిక్కలు తీసే యంత్రం తయారు చేశారు. గింజలు తీసిన చింతపండును పచ్చళ్ల కోసం ముక్కలు చేయడంలో కష్టాన్ని, ఖర్చును తగ్గించడం ఎలా? అని ఆలోచించి పాత యంత్రాన్ని విజయవంతంగా మెరుగుపరిచారు. ఇలా.. తనకు అవసరమైన ప్రతి పనికీ ఉపయోగపడే యంత్రం తయారు చేయడం ఆయనకు అలవాటుగా మారిపోయింది. 5 పనులు చేసే టిల్లర్.. వార్షిక పంటల్లో ఒకేసారి 5 పనులు చేసే టిల్లర్‌ను ఇటీవలే అబ్దుల్ ఖాదర్ తయారు చేశారు. పురుగుమందులు, ఎరువులు, విత్తనాలు వేయటంతోపాటు కలుపుతీత, లోతు దుక్కి చేయడం వంటి పనులను ఇది ఏకకాలంలో చేస్తుంది. ట్రాక్టర్‌తో రోజుకు 20-25 ఎకరాల్లో పనిని పూర్తి చేయడానికి ఈ టిల్లర్ ఉపయోగపడుతోందని ఆయన తెలిపారు. మరెన్నో ఆవిష్కరణలు.. సాధారణ రోటోవేటర్ కన్నా పది రెట్లు వేగంగా 5వేల ఆర్పీఎం వేగంతో తిరిగే రోటోవేటర్ ను రూపొందించారు. దీన్ని ఉపయోగించడం వల్ల తన పొలంలో మిర్చి దిగుబడి రెండేళ్లలో ఎకరానికి 3 క్వింటాళ్ల నుంచి 9 క్వింటాళ్లకు పెరిగిందని ఆయన తెలిపారు. మహారాష్ట్ర రైతుల కోరిక మేరకు 6 నెలల్లో చెరకు విత్తే ఆటోమేటిక్ డ్రిల్లర్ పరికరాన్ని రూపొందించారు. చిన్న రైతుల కోసం చెరకు నరికే యంత్రాన్ని రూపొందించబోతున్నానన్నారు. దుక్కి దున్నే ట్రాక్టర్ల కోసం 20 ఏళ్లు మన్నే ఇనుప చక్రాలను రూపొందించారు. దుక్కి చేసే ట్రాక్టర్ డీజిల్‌ను ఆదా చేయడానికి ఉపయోగపడే వీల్ టిల్లర్‌ను రూపొందించారు. స్నానానికి నీటిని వేడి చేసి, 24 గంటలపాటు నీటిని వేడిగా ఉంచే మల్టీ స్టేజ్ హీటింగ్ యంత్రాంగంతో కూడిన బాయిలర్‌ను రూపొందించారు... ఇలా ఆయన సృజనాత్మక ఆవిష్కరణల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రయోగాల కోసం కొంత మేరకు పొలాన్ని కూడా అమ్ముకున్నా తనకేమీ బాధగా లేదంటారు అబ్దుల్ ఖాదర్. సునిశిత పరిశీలన, సృజనాత్మకత, సమస్యలను అధిగమించాలన్న తపన.. ఆయనను దేశంలోనే అద్భుతమైన రైతు శాస్త్రవేత్తగా నిలబెట్టాయి. చిరునామా: అబ్దుల్ ఖాదర్ నడకట్టిన్, విశ్వశాంతి అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంటర్, హోర్కెరి స్ట్రీట్, అన్నిగెరి, నవల్గుండ్ తాలూకా, ధార్వాడ్ జిల్లా, కర్ణాటక. పిన్ 582201. మొబైల్ : 094487 86350 (ఉ. 10 గం. - సా. 5 గం. మధ్యలోనే. ఆదివారం సెలవు). ఈ మెయిల్ : sharifnadakattin@yahoo.in సేకరణ: పంతంగి రాంబాబు సాగుబడి డెస్క్ -
నిర్దిష్ట ప్రణాళిక.. విజయ గీతిక
కుటుంబ నేపధ్యం: మాది గుంటూరు జిల్లా మంగళగిరి. నాన్న సాదాగర్ అబ్దుల్ ఖాదర్ బాబావలి. రైల్యే గార్డుగా పనిచేస్తున్నారు. అమ్మ న స్రీన్ సుల్తాన్. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. ఇద్దరన్నయ్యలు. ఇమ్రాన్ బాషా, ఇర్ఫాన్ ఐఐటీల నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశారు. సందేహాలు నివృత్తి కావాల్సిందే: చదువు విషయంలో ఎలాంటి సందేహాలు తలెత్తినా వాటి నివృత్తి కానిదే నిద్రపోను. చిన్ననాటి నుంచే ఇది అలవాటుగా మారిపోయింది. టెన్త్, ఇంటర్లో కూడా అలానే చేశాను. దీంతో ఏదైనా టాపిక్ విషయంలో లోతుగా ఆలోచించడం అలవాటుగా మారిపోయింది. విషయ పరిజ్ఞానమే మిన్న: చదువంటే మార్కులు కాదు విషయపరిజ్ఞానం. నేను మార్కుల గురించి ఏనాడూ ఆలోచించలేదు. పాఠ్యాంశంలోని విషయానికి ప్రాధాన్యమిస్తాను. అలా చదివితే ఫలితం వాటంతటదే వస్తుంది. దీర్ఘకాలిక ప్రణాళికతో: జేఈఈ ఎంట్రన్స్ కోసం ఇంటర్లో దీర్ఘకాలిక ప్రణాళికతో చదివాను. సబ్జెక్ట్‌లను చదవడంలో సానుకూలతను పాటించాను. కష్టమనిపించే వాటిని తెల్లవారుజామున చదివాను. కష్టంగా ఉండే టాపిక్లపై మరింత సమయం కేటాయించాను. ఎంసెట్‌కు వారం రోజులే: మొదట జేఈఈ-అడ్వాన్సడ్పైనే నా దృష్టి. దీనిపైనే మొత్తం సమయం వెచ్చించాను. దీంతో ఎంసెట్‌కు వారం రోజులు మాత్రమే ప్రిపేరయ్యాను. ఓపెన్ కేటగిరీలో 148వ ర్యాంక్ వచ్చింది. ఇది మైనార్టీ కేటగిరీలో మొదటి ర్యాంక్. బృందచర్చలు: కాలేజీ విరామ సమయాల్లో క్లిష్టమైన సబ్జెక్టులపై గ్రూప్ డిస్కషన్ చేసేవాళ్లం. అధ్యాపకుల సూచనలు తీసుకునేవాళ్లం. అప్లికేషన్ ఓరియంటేషన్ ప్రశ్నలు ఎలా వీలైతే అలా వేసుకొని సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేసేవాళ్లం. ఇలా చేయడంతో కీలక అంశాలు శాశ్వతంగా గుర్తుండిపోయేవి. గ్రాండ్టెస్ట్లతో వేగం, కచ్చితత్వం: ప్రిపరేషన్ పూర్తయ్యాక గ్రాండ్ టెస్ట్‌లు రాశాను. వీటితో వేగం, కచ్చితత్వం అలవడింది. అంతేకాకుండా గ్రాండ్ టెస్ట్‌ల ద్వారా మనం అకాడమిక్‌గా ఏ స్థాయిలో ఉన్నామో తెలుసుకోవచ్చు. చదివిన పుస్తకాలు: జేఈఈ కోసం అకాడమీ పుస్తకాలు చదివితే సరిపోతుంది. మరింత అదనపు సమాచారం కోసం ఫిజిక్స్‌లో హెచ్‌సీ వర్మ, డీసీ పాండే, రెజ్నిక్ ఎండ్ హాలిడే, మ్యాథ్స్‌లో అరిహంత్ సిరీస్, ఎస్ఎల్ లానీ, కెమిస్ట్రీలో ఫిజికల్ రంజీత్ షాయ్,పీటర్ అట్కిన్స్ పుస్తకాలను చదివాను. ఆర్గానిక్స్‌లో సాలమాన్స్ జేఆర్ వాయిడ్,అహ్లూవాలియా. ఇనార్గానిక్‌లో జేడి.లీ, ఒపి టాండన్ పుస్తకాలను చదివాను. జేఈఈ రాసే వారికి సలహా: ప్రతి విషయాన్ని మార్కుల కోసం కాకుండా ఆసక్తితో చదవాలి. పరీక్షకు సన్నద్ధం కావడంలో చివరి ప్రశ్నకు జవాబు రాసే వరకు ఏకాగ్రతతో వ్యవహరించాలి. స్వయంసమృద్ధి ఆవిష్కరణ లు: స్వశక్తితో నిలదొక్కుకునే ఆవిష్కరణలు రావాలి. ఈరోజు ఇంధనం కోసం దేశం ఇతర దేశాలపై ఆధారపడుతోంది. అలాకాకుండా పర్యావరణానికి హాని లేని, సౌరశక్తి సామాన్యులకు అందుబాటులో తీసుకు వచ్చేలా ఆవిష్కరణలు రావాలి విదేశాలపై ఆధారపడే సంస్కృతి నుంచి స్వయం సమృద్ధి దిశగా సాగేలా పరిశోధనలు రావాలి. ఆ దిశగా నా వంతు కృషి చేస్తా. ఆటలూ ముఖ్యమే: కేవలం చదువేకాదు. స్నేహతులతో కలిసి ఔట్‌డోర్ గేమ్స్ అడతాను. పాఠశాలలో నిర్వహించే అన్ని సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం ఎంతో ఇష్టం. లక్ష్యం: పది మందికి ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తగా రాణించాలి. నిరుద్యోగం, పేదరికం అనే మాటను దేశం నుంచి దూరం చేయాలి. అకడమిక్ ప్రొఫైల్ టెన్త్: 9.8/10 ఇంటర్: 991 ఎంసెట్: 62వ ర్యాంక్ (మైనారిటీ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్) కెవైపీవై ఆల్ ఇండియా 14వ ర్యాంక్, మ్యాథ్స్ ఒలింపియాడ్: 3 గోల్డ్ మెడల్స్, జేఈఈ అడ్వాన్స్డ్: 97వ ర్యాంక్ జేఈఈ మెయిన్: 5వ ర్యాంక్ సహకారం: ఐ.వెంకటేశ్వరరెడ్డి, మంగళగిరి, గుంటూరు జిల్లా జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ పరీక్షల్లో మెరుగైన ర్యాంకు సాధించేందుకు ఫిజిక్స్ సిలబస్‌లోని ప్రతి అంశానికి చెందిన కాన్సెప్ట్‌లు, మ్యాథమెటికల్ ఈక్వేషన్స్, కన్జర్వేషన్ థీరమ్స్లను గుర్తించాలి. ప్రిపరేషన్లో పాటించాల్సిన కీలక అంశం.. నిర్దేశించిన సిలబస్ మేరకే పరిమితం కావడం. సిలబస్‌ను దాటి ఎట్టి పరిస్థితుల్లోను వేరే అంశాలను ప్రాక్టీస్ చేయవద్దు. ప్రిపేర్ అవుతున్న అంశానికి సంబంధించిన ప్రాథమిక భావన (బేసిక్ కాన్సెప్ట్)పై పట్టు సాధించాలి.