Abhinav Kumar
-
భర్త కళ్లుగప్పి.. కుష్బూ పరార్
-
కుష్బూ కిడ్నాప్.. హై డ్రామాకు తెర!
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ మహిళా ప్రయాణికురాలు అదృశ్యం అయిన ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. దుబాయి నుంచి శనివారం ఉదయం హైదరాబాద్ వచ్చిన అభినవ్ కుమార్, కుష్బూ దంపతులు ఇక్కడి నుంచి కోల్‌కతా వెళ్లాల్సి ఉంది. అయితే అంతలోనే కుష్బూ కనిపించకపోవడం కలకలం సృష్టించింది. ఎయిర్ పోర్ట్ సిబ్బంది, పోలీసులు విమానాశ్రయంలోని సీసీ కెమెరా ఫుటేజీ సేకరించి పరిశీలించారు. భర్త కళ్లుగప్పి ఆ మహిళ ఎయిర్ పోర్టు నుంచి క్యాబ్ లో వెళ్లిపోయినట్లు సీసీ ఫుటేజీలో ఉందని పోలీసులు తెలిపారు. భర్త, ఆమె కుటుంబంతో తలెత్తిన విభేదాల కారణంగానే ఆ ప్రయాణికురాలు ఎయిర్ పోర్టు నుంచి వెళ్లిపోయి ఉండొచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తంచేశారు. విమానం ఎక్కేందుకు కొంత సమయం ముందు తామిద్దరం ఎయిర్‌పోర్టులో షాపింగ్ చేసేందుకు వెళ్లినట్లు అభినవ్ కుమార్ తెలిపారు. ఆ క్రమంలో కొంతసేపటికే తన భార్య అదృశ్యమైందంటూ ఎయిర్ పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అభినవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు సీసీ ఫుటేజీ పరిశీలించి.. కుష్బూను ఎవరూ కిడ్నాప్ చేయలేదని వెల్లడించారు. -
విమానాశ్రయంలో ప్రయాణికురాలు అదృశ్యం
-
విమానాశ్రయంలో ప్రయాణికురాలు అదృశ్యం
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ మహిళ ప్రయాణికురాలు అదృశ్యం అయిన ఘటన కలకలం రేపుతోంది. శనివారం ఉదయం దుబాయి నుంచి హైదరాబాద్ వచ్చిన అభినవ్ కుమార్, కుష్బూ దంపతులు ఇక్కడి నుంచి కోల్‌కతా వెళ్లాల్సి ఉంది. మరో విమానం ఎక్కేందుకు కొంత సమయం ఉండటంతో వాళ్లిద్దరూ ఎయిర్‌పోర్టులో షాపింగ్‌కు వెళ్లారు. ఆ సమయంలోనే కుష్బూ కనిపించకుండాపోయింది. దీనిపై ఆమె భర్త అభినవ్ కుమార్ ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అలాగే ఎయిర్‌పోర్టులోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. మహిళను ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేక ఆమె ఎక్కడికైనా వెళ్లిపోయిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
'సునంద మృతికి కారణాలు తెలీలేదు'
న్యూఢిల్లీ: సునందా పుష్కర్ మృతికి కారణాలు ఇంకా తెలియలేదని శశిథరూర్ వ్యక్తిగత కార్యదర్శి అభినవ్ కుమార్ అన్నారు. శుక్రవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఆమె మృతి చెందినట్టు గుర్తించామన్నారు. హోటల్ రూంలో బెడ్‌పై ఆమె మృతదేహం పడివుందని వెల్లడించారు. ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరిస్తున్నారని, పోస్టుమార్టం తర్వాతే కారణాలు తెలుస్తాయన్నారు. థరూర్ దంపతులు గురువారం హోటల్లో దిగారని చెప్పారు. ఇంటికి పెయింట్ వేస్తున్నందున వారు హోటల్లో దిగారని వివరించారు. ఏఐసీసీ సమావేశం నుంచి శశిథరూర్ నేరుగా హోటల్‌కు వచ్చారని, తలుపు తెరవకపోవడంతో బలవంతంగా తెరిచారని చెప్పారు. సునందా పుష్కర్ విషం తీసుకున్నట్టుగా ఆనవాళ్లు లేవని అభినవ్ కుమార్ తెలిపారు.