న్యూఢిల్లీ: సునందా పుష్కర్ మృతికి కారణాలు ఇంకా తెలియలేదని శశిథరూర్ వ్యక్తిగత కార్యదర్శి అభినవ్ కుమార్ అన్నారు. శుక్రవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఆమె మృతి చెందినట్టు గుర్తించామన్నారు. హోటల్ రూంలో బెడ్‌పై ఆమె మృతదేహం పడివుందని వెల్లడించారు. ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరిస్తున్నారని, పోస్టుమార్టం తర్వాతే కారణాలు తెలుస్తాయన్నారు.
థరూర్ దంపతులు గురువారం హోటల్‌లో దిగారని చెప్పారు. ఇంటికి పెయింట్ వేస్తున్నందున వారు హోటల్‌లో దిగారని వివరించారు. ఏఐసీసీ సమావేశం నుంచి శశిథరూర్ నేరుగా హోటల్‌కు వచ్చారని, తలుపు తెరవకపోవడంతో బలవంతంగా తెరిచారని చెప్పారు. సునందా పుష్కర్ విషం తీసుకున్నట్టుగా ఆనవాళ్లు లేవని అభినవ్ కుమార్ తెలిపారు.
'సునంద మృతికి కారణాలు తెలీలేదు'
Published Fri, Jan 17 2014 11:20 PM | Last Updated on Wed, Sep 18 2019 3:04 PM
Advertisement
Advertisement