Abid
-
టీఆర్ఎస్ నేతను అరెస్టు చేయాలి
కాంగ్రెస్ నేతల డిమాండ్ కలెక్టర్, సీపీలకు ఫిర్యాదు నిజామాబాద్ సిటీ(నిజామాబాద్‌అర్బన్): విధినిర్వహణలో ఉన్న ఇరిగేషన్,ట్రాన్స్‌కో అధికారులను అసభ్య పదజాలంతో దూషించిన టీఆర్ఎస్ నేత ఆబిద్‌ను వెంటనే అరెస్టు చేయాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, డీసీసీ అధ్యక్షుడు తాహెర్ డిమాండ్ చేశారు. ఆబిద్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్ యోగి తారాణా, సీపీ కార్తికేయలను మంగళవారం కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం స్థానిక పార్టీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. రెంజల్ మండల రైతులు కోరితేనే మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి కందకుర్తి–2 లిఫ్ట్ ట్రయల్ రన్ చూ సేందుకు వెళ్లారని, వారిపై టీఎర్ఎస్ నేతలు దాడి చేశారన్నారు. తమ పార్టీ నేతలపైనే బోధన్ సీఐ కేసులు పెట్టి అత్యుత్సాహం ప్రదర్శించారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియో రికార్డులను కలెక్టర్, సీపీలకు ఇచ్చామన్నారు. ఆబిద్‌ను అరెస్టు చేయడంతో పాటు బోధన్ సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాం డ్ చేశారు. కాంగ్రెస్ నేతలు నగేశ్‌రెడ్డి, అంతిరెడ్డి రాజిరెడ్డి, ముప్పా గంగారెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు శ్రీనివాస్‌గౌడ్, లావణ్య, మోబిన్‌ఖాన్, నాగభూషణ్‌రెడ్డి, సరోజ, ఎంపీపీలు గంగాశంకర్, రజిత, రాజేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
పెన్ను పట్టలే.. ఫైలు ముట్టలే..!
⇒ప్రభుత్వ శాఖల్లో స్తంభించిన పాలన ⇒కొనసాగిన ఉద్యోగుల నిరసన ఇందూరు(నిజామాబాద్ అర్బన్) : జిల్లా పరిపాలన రెండో రోజు కూడా స్తంభించింది. బోధన్‌లో నీటిపారుదల శాఖ డిప్యూటీ ఈఈ గంగాధర్‌ను బోధన్ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు అబిద్ అసభ్య పదజాలంతో దూషించినందుకు నిరసనగా అబిద్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఉద్యోగులు రెండో రోజు మంగళవారం పెన్‌డౌన్ చేపట్టారు. కలెక్టరేట్లోని జిల్లా కేంద్రంలో ఉన్న అన్ని శాఖలకు చెందిన అన్ని కేడర్ల ఉద్యోగులు ఉదయం వారి వారి కార్యాలయాలకు హాజరై పనులు చేయకుండా నిరసనను తెలిపారు. అనంతరం ప్రగతిభవన్ ఎదుట మధ్యాహ్నం వరకు ధర్నా చేపట్టారు. దీంతో ఏ ఒక్క శాఖలో కూడా పెన్ను, ఫైలు కదల్లేదు. పరిపాలన వ్యవస్థ మొత్తం స్తంభించింది. కార్యాలయాలన్ని ఉద్యోగుల్లేక వెలవెలబోయాయి. ధర్నాలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ మాట్లాడుతూ.. ఇరిగేషన్ డిప్యూటీ ఈఈని అసభ్యకరంగా, అవమానించే విధంగా మాట్లాడిన బోధన్ ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు అబిద్‌ను వెంటనే పోలీసులు అరెస్టు చేయాలన్నారు. సంఘటనపై ఒక్క ప్రజాప్రతినిధి కూడా స్పందించకపోవడం బాధకరమన్నారు. దుర్బాషలాడిన అబిద్‌ను కాపాడేందుకు బోధన్ ఎమ్మెల్యే ప్రయత్నాలు చేయడం సరికాదని ఆరోపించారు. ఉద్యోగులు కావాలో... అనుచరులు కావాలో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిం దన్నారు. మండల కేంద్రాల్లో కూడా పెన్‌డౌన్ నిరసన కార్యక్రమాలను చేపట్టి ఉధృతం చేస్తామన్నారు. నిరసన కార్యక్రమంలో టీఎన్జీవోస్ కార్యదర్శి సతీష్, ట్రెజరీ ఉద్యోగుల సంఘం నాయకులు కిషన్, రెవెన్యూ ఉద్యోగుల సం ఘం నాయకులు రమణ్‌రెడ్డి, వార్డెన్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రాజా గంగారాం, అన్ని శాఖల ఉద్యోగులు, డ్రైవర్స్, నాల్గవ తరగతి ఉద్యోగ సంఘాలు పాల్గొన్నారు. -
హైదరాబాద్ లో భారీ వర్షం