టీఆర్‌ఎస్‌ నేతను అరెస్టు చేయాలి | TRS leader to be arrested | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ నేతను అరెస్టు చేయాలి

Published Wed, Mar 29 2017 2:46 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

టీఆర్‌ఎస్‌ నేతను అరెస్టు చేయాలి - Sakshi

టీఆర్‌ఎస్‌ నేతను అరెస్టు చేయాలి

కాంగ్రెస్‌ నేతల డిమాండ్‌
కలెక్టర్, సీపీలకు ఫిర్యాదు


నిజామాబాద్‌ సిటీ(నిజామాబాద్‌అర్బన్‌): విధినిర్వహణలో ఉన్న ఇరిగేషన్,ట్రాన్స్‌కో అధికారులను అసభ్య పదజాలంతో దూషించిన టీఆర్‌ఎస్‌ నేత ఆబిద్‌ను వెంటనే అరెస్టు చేయాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌ డిమాండ్‌ చేశారు. ఆబిద్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్‌ యోగి తారాణా, సీపీ కార్తికేయలను మంగళవారం కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం స్థానిక పార్టీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు.

రెంజల్‌ మండల రైతులు కోరితేనే మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి కందకుర్తి–2 లిఫ్ట్‌ ట్రయల్‌ రన్‌ చూ సేందుకు వెళ్లారని, వారిపై టీఎర్‌ఎస్‌ నేతలు దాడి చేశారన్నారు. తమ పార్టీ నేతలపైనే బోధన్‌ సీఐ కేసులు పెట్టి అత్యుత్సాహం ప్రదర్శించారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియో రికార్డులను కలెక్టర్, సీపీలకు ఇచ్చామన్నారు. ఆబిద్‌ను అరెస్టు చేయడంతో పాటు బోధన్‌ సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాం డ్‌ చేశారు. కాంగ్రెస్‌ నేతలు నగేశ్‌రెడ్డి, అంతిరెడ్డి రాజిరెడ్డి, ముప్పా గంగారెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు శ్రీనివాస్‌గౌడ్, లావణ్య, మోబిన్‌ఖాన్, నాగభూషణ్‌రెడ్డి, సరోజ, ఎంపీపీలు గంగాశంకర్, రజిత, రాజేందర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement