మార్కెట్ సేవలు దూరం
కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్‌లైన్: రైతుల కోసం ఏర్పాటు చేసిన వ్యవసాయ మార్కెట్లు సేవలకు దూరంగా ఉన్నాయి. ఫీజు వసూళ్లకే పరిమితమవుతున్నాయి. జిల్లాలో 12 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. వీటితో తొమ్మిది ఎటువంటి సేవలు అందించడం లేదు. కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు మార్కెట్ కమిటీల్లో మాత్రమే వ్యవసాయ ఉత్పత్తుల క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. కర్నూలు, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, బనగానపల్లి, ఆలూరు, పత్తికొండ మార్కెట్లకు రెగ్యులర్ సెక్రటరీలు లేరు.
దీంతో జీరో వ్యాపారం జోరుగా సాగుతోంది. మంగళవారం మార్కెట్ కమిటీల పనితీరు, రైతులకు అందుతున్న సేవలను న్యూస్‌లైన్ ప్రత్యేకంగా పరిశీలించింది. ఇందులో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఇతర సమస్యలు వెలుగులోకి వచ్చాయి. జిల్లాలో కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ కీలకమైంది. ఇక్కడ రెగ్యులర్ సెక్రటరీ లేకపోవడం లోటుగా మారింది. మార్కెట్లో పందుల విహారం అధికంగా ఉంది. ఉల్లికి ఒకే ఒక జంబోషెడ్ ఉండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.