abu dhabi oil company
-
రత్నగిరి ప్రాజెక్టులోకి ‘అబుదాబి ఆయిల్’
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని రత్నగిరిలో 44 బిలియన్ డాలర్లతో (రూ.3 లక్షల కోట్లు) 2025 నాటికి ఏర్పాటు చేస్తున్న 60 మిలి యన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో కూడిన రిఫైనరీ, 18 మిలియన్ టన్నుల పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ప్రాజెక్టులో సౌదీ అరామ్కో నుంచి కొంత వాటా తీసు కునేం దుకు వాటా తీసుకునేందుకు అబు దాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ఏడీఎన్‌వోసీ) ముందుకు వచ్చింది. ఈ మేరకు సోమవారం ప్రాథమిక ఒప్పందంపై సంతకాలు చేసింది. దీనితో ప్రాజెక్టులో సౌదీ అరామ్కో, ఏడీఎన్‌వోసీ మొత్తంగా 50 శాతం వాటా తీసుకుంటాయి. ఈ ప్రాజెక్టు ద్వారా భారత ఇంధన మార్కెట్, రిటైల్ వ్యాపారంలోకి ప్రవేశించేందుకు అవకాశంగా ఏడీఎన్‌వోసీ భావిస్తోంది. ఈ ప్రాజెక్టులో మిగిలిన 50%వాటా ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ పంచుకుంటాయి. ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఇంధన విని యోగ మార్కెట్ భారత్‌లో సౌదీ అరేబియా, యూఏఈలకు ఇది వ్యూహాత్మక వ్యాపార పెట్టుబడిగా సౌదీ అరామ్కో సీఈవో, ప్రెసిడెంట్ అమిన్ హెచ్ నాసర్ పేర్కొన్నారు. కాగా ప్రతిపాదిత ఉమ్మడి 50 శాతం వాటాలో ఎవరెంత కలిగి ఉండాలన్న దానిపై చర్చించాల్సి ఉందని నాసర్ తెలిపారు. -
అబుదాబి ఆయిల్ కంపెనీతో ఒప్పందానికి ఓకే..
చమురు నిల్వ, నిర్వహణకు సంబం ధించి ఇండియన్ స్ట్రాటెజిక్ పెట్రోలియం రిజర్వ్ (ఐఎస్పీఆర్ఎల్).. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి చెందిన అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ఏడీఎన్‌వోసీ)తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని క్యాబినెట్ ఆమోదించింది. ఒప్పందం ప్రకారం మంగళూరు (కర్ణాటక)లోని ఐఎస్పీఆర్ఎల్ స్టోరేజి కేంద్రంలో 58,60,000 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్‌ను నిల్వ చేస్తుంది. ఇందులో సింహ భాగం వ్యూహాత్మక అవసరాలకు వినియోగించనుండగా.. కొంత భాగాన్ని ఏడీఎన్‌వోసీ స్వంత వాణిజ్య అవసరాలకు ఉపయోగించుకుంటుంది. ఈ ఒప్పందంతో భారత ఇంధన భద్రతకు మరింత తోడ్పాటు లభించగలదని ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. పెట్టుబడులపై అత్యున్నత స్థాయి టాస్క్‌ఫోర్స్ (హెచ్ఎల్టీఎఫ్ఐ) కింద యూఏఈ సంస్థతో కుదుర్చుకున్న అత్యంత భారీ పెట్టుబడి ఒప్పందం ఇదే. అలాగే, ఇంధన రంగంలో ఒక గల్ఫ్ దేశం ఇన్వెస్ట్ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.