AC Express
-
రిపేర్ చేస్తుండగా కదిలిన రైలు.. తప్పిన ప్రమాదం
కోల్‌కతా : కోల్‌కతాలోని హౌరా స్టేషన్ సమీపంలో ఓ రైల్వే గార్డు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. హౌరా-దిగా ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లోని ఓ ఏసీ బోగీలో సమస్యతలెత్తడంతో గార్డు అత్యవసరంగా ఏసీ పైప్‌లైన్‌ను రిపేర్ చేయసాగాడు. ఇది గమనించని డ్రైవర్ ట్రైన్‌ను స్టార్ట్ చేశాడు. గార్డు ఇంకా ట్రైన్ కిందే ఉన్నాడని అక్కడున్న ఆర్పీఎఫ్ సిబ్బంది గట్టిగా అరవడంతో ప్రయాణికులు చైన్ లాగారు. అదృష్టవశాత్తూ పక్కనే ఉన్న మరో పైపుపై గార్డు కూర్చోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు రైల్వే అధికారప్రతినిధి సంజయ్ గోష్ తెలిపారు. డ్రైవర్, గార్డుకు మధ్య సమాచార లోపం వల్ల ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పేర్కొన్నారు. -
రైలు కింద రీపేర్ చేస్తుండగా ఒక్కసారిగా..
-
హౌరా-చెన్నై ప్రీమియం రైలు రద్దు
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : హౌరా-చెన్నై మధ్య దువ్వాడ మీదుగా తరలిపోయే 02841/42 నంబరు గ ల ప్రీమియం ఏసీ ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేశారు. హౌరా నుంచి మే 9 నుంచి జూన్ 27 తేదీల మధ్య ప్రతి శుక్రవారం బయల్దేరే ఈ రైలును సదరన్ రైల్వే రద్దు చేసింది. ఈ రైలుకు ఊహించినట్టుగా ఆదరణ లేకపోవడంతో పాటు, పలు సమస్యలు రావడంతో రైలును రద్దు చేశారు. చెన్నై నుంచి మే 10 నుంచి జూన్ 28 తేదీ మధ్య ప్రయాణించాల్సిన రైలునూ రద్దు చేశారు.