ac macanic
-
50,000 మందికి ఏసీలపై శిక్షణ: జాన్సన్ హిటాచీ
న్యూఢిల్లీ: జాన్సన్ కంట్రోల్స్ హిటాచీ ఎయిర్ కండీషనింగ్ ఇండియా 2025 నాటికి 50 వేల మందిని ప్రపంచస్థాయి ఏసీ టెక్నీషియన్లుగా తీర్చిదిద్దనున్నట్టు ప్రకటించింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు నైపుణ్య శిక్షణ కేంద్రాలు, గుజరాత్‌లోని ఒక కేంద్రంలో యువతకు శిక్షణ ఇస్తామని ప్రకటించింది. భారత్‌లో వచ్చే 20 ఏళ్లలో ఏసీలకు డిమాండ్ ఎనిమిది రెట్లు పెరుగుతుందని పేర్కొంది. దేశంలో సుమారు రెండు లక్షల మంది ఏసీ టెక్నీషియన్లు ఉన్నారని అంచనా. -
రైల్వే టీటీఈపై ఏసీ మెకానిక్ దాడి
కరీమాబాద్: హజ్రత్ నిజాముద్దీన్ నుంచి కొచ్చీ వెళ్లే నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఆదివారం ఉదయం రైల్వే టీటీఈ రాంగిరి సందీప్‌పై తుకాడియా లాల్ మీనా అనే ఏసీ మెకానిక్ దాడికి పాల్పడ్డాడు. నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ రైలు రామగుండం రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే బీ–2 కోచ్‌లో ఏసీ పనిచేయడం లేదని టీటీఈ సందీప్‌కు పలువురు ప్యాసిం జర్లు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన అదే రైలులోని ఏ–1 కోచ్‌లో ఉన్న ఏసీ మెకానిక్ తుకాడియాలాల్ మీనా వద్దకు వెళ్లి సమస్యను వివరించారు. ఈ క్రమంలో టీటీఈ సందీప్‌పై మీనా దాడి చేశారని పోలీసులు పేర్కొన్నారు.