నగల కోసం మహిళ దారుణహత్య
నెల్లూరు : ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న వృద్ధురాలిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హతమార్చి ఆమె ఒంటిపై ఉన్న ఐదు సవర్ల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ సంఘటన నెల్లూరులోని ఏసీ నగర్లో శనివారం రాత్రి చోటుచేసుకుంది.
స్థానికంగా నివాసముంటున్న కె. విజయరత్నం(70) అనే మహిళ ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని దుండగులు ఆమె గొంతు కోసి దారుణంగా హతమర్చి ఆమె ఒంటిపై ఉన్న ఐదు సవర్ల బంగారంతో పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.