Achyuta Rao
-
పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం
మునుపెన్నడూ కనీవినీ ఎరుగని సంక్షోభం యావత్ ప్రపంచ ప్రజానీకానికి కరోనా వైరస్ రూపంలో దాపురించింది. ఈ వైరస్ వ్యాప్తి చెంది లక్షలాది ప్రాణాలు కోల్పోకుండా ఉండాలంటే స్వీయ నియంత్రణ అవసరం. అదే మనకు మనం భౌతిక దూరం పాటించడం. ఇలా భౌతిక దూరం పాటించడంతో ఒకరి నుండి మరొకరికి వ్యాధి వ్యాపించకుండా కట్టడి చేసి ఆ వైరస్ జీవిత కాలాన్ని అంతం చేయడంతో వైరస్ మళ్ళీ పుట్టడానికి కానీ, వ్యాపించడానికి కానీ అవకాశం వుండదు. కరోనా నివారణకు ఇదే మందు అని చెప్పటానికి పెద్ద ఉదాహరణగా అమెరికా నిలిచింది. సకల దేశాలు భౌతిక దూరం పాటిస్తుంటే అమెరికా మాత్రం భిన్నంగా ప్రవర్తించడంతో పెద్దమూల్యాన్నే చెల్లించింది. వేలల్లో ప్రాణాలు కోల్పోయారు. లక్షల్లో బాధితులైనారు. కానీ భారత్‌లో మాత్రం కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు త్వరితగతిన మేల్కొని చర్యలు చేపట్టడం, అంతా లాక్డౌన్ చేయడంతో ఆర్థి కంగా నష్టపోతామేమోగాని బతికుంటే చాలు బలిసాకు తిని బతక వచ్చని ప్రాణహాని లేకుండా చేసుకోగలుగుతున్నాం. భౌతిక దూరం పాటించడం కోసం లాక్డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమౌతున్నప్పుడు ఎందుకు ఇంట్లోనే వుంటున్నామనే విషయం పెద్దలకు తెలుసు. కానీ వివరిస్తారేమో అని పిల్లలు అమాయకంగా మన వైపే చూస్తున్న సందర్భాల్లో మనకు ఫోన్లో మిత్రులతో, బంధువులతో గంటలపాటు మాట్లాడగలంగానీ మన పిల్లలతో విషయాలు పంచుకోవడానికి నామోషీగా ఫీలై, అహంభావం అడ్డు వస్తుంది కానీ వారు బడి ఎందుకు లేదో, ఆడుకోడానికి ఎందుకు పంపించడం లేదో, తమకి ఇష్టమైన వారి రాకపోకలు ఎందుకు లేవో, అంతా వింతగా ఇళ్ళలోనే ఎందుకు ఉంటున్నారో తెలియక.. రోడ్లపైకి వెళ్లిన వారిని పోలీసులు క్రూరంగా ఎందుకు కొడుతున్నారో టీవీల్లో చూసి మానసికంగా భయకంపితులౌతారు. రేపటి నాడు లాక్డౌన్ ఎత్తేసి అందరూ మళ్ళీ విధుల్లోకి ఆనందంగా వెళతారు కానీ పసిహృదయాల్లో రోడ్డు పైకి వెళ్లిన వారిని పోలీ సులు చితకబాదిన జ్ఞాపకాలే వెంటాడి బయటికి వెళ్లాలంటే భయకంపితులౌతారు. అలాగే ఇన్ని రోజులు ఇంటికే పరిమితమవడంతో పిల్లల మనసుల్లో తీవ్ర ఆందోళన చోటుచేసుకుంటుంది, ఆహారం సరిగా తీసుకోకపోవడం, నిద్రలేమి, నిద్రలో పక్కతడపడం లాంటి లక్షణాలు చోటుచేసుకుంటాయి. పోలీసులు రోడ్లపైకి వెళ్లిన వారిని రక్తం చిందేలా కొట్టిన చెడు జ్ఞాపకాలే పిల్లలను వెంటాడుతుంటాయి. ఇలాంటి సమయంలో పెద్దలు పిల్లలకు మిత్రుల్లా ప్రవర్తిస్తూ వారికి బయటికి ఎందుకు వెళ్లకూడదు, వ్యక్తిగత శుభ్రత ఎలా పాటించాలి అనే అంశాలను విడమర్చి చెప్పాలి. ఇంటికే పరిమితమైన ఈ సమయాన్ని అనుకూలమైన అవకాశంగా తీసుకొని పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి, పిల్లలు తమకు ఆప్యాయత వున్న వారిని వీలైతే మొబైల్ ఫోన్ వీడియో కాలింగ్ ద్వారా సంభాషించేటట్లు చూడాలి. టీవీల్లో హింస, జుగుప్సాకరమైన సన్నివేశాలు చూడకుండా తల్లిదండ్రులే వీరుల కథలు, గాథలు, ఆహార పదార్థాలను పొదుపుగా వాడుకోవడం, అన్నం దొరకని వారు అనేకం ఉన్నారన్న విషయం మృదువుగా చెప్పడం. వీలైతే పంచతంత్ర కథలు, మహాభారత కథలు, భగత్‌సింగ్, చేగువేరా లాంటి వీరుల కథలు చెప్పడం, ఇంటిలోపల ఆడే చదరంగం, క్యారంబోర్డ్ లాంటి ఆటలు పిల్లలతో కలసి పెద్దలు ఆడుకోవడం, నెలనెలా డబ్బు ఎలా వస్తుంది? ఎలా కుటుంబానికి ఖర్చు అవుతుంది అన్న విషయాలను వారితో స్నేహపూర్వక వాతావరణంలో పంచుకోవడంతో పిల్లలు మనం కొని పెట్టలేని వస్తువుల గురించి పట్టుబట్టకుండా వుండటమే కాక వారికి విషయాలు అర్థం అవుతాయి. ఈ లాక్డౌన్ రోజుల్లో పిల్లలతో స్నేహపూర్వకంగా మసులుకుంటే పెద్దలకూ, పిల్లలకూ ఈ గడ్డు కాలంలో సహితం ఆనందం సమకూరుతుంది. వ్యాసకర్త: అచ్యుత రావు, , బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు మొబైల్ 93910 24242 -
పిల్లల్ని చెరబట్టందే చదువు చెప్పలేమా?
ఒకరు వీపు విమానం మోత మోగిస్తారు, ఒకరు ఒళ్లు హూనం అయ్యేలా బాదుతారు. ఒకరు బెత్తం విరిగేదాకా కొట్టి చేతులు విరగ్గొడ తారు, మరొకరు వెంటాడుతూ విద్యార్థి భవనం నుండి దూకి ప్రాణాలు కోల్పోయినా మా తప్పు కాదు తప్పంతా చచ్చిన విద్యార్థిదే అని నిస్సిగ్గుగా చెబుతారు. ఓ టీచ రమ్మ పిల్లల్ని తనకున్న పశువులను కట్టేసే అపార అను భవంతో స్కూల్లోనే పిల్లల్ని తాళ్లతో కట్టేస్తారు. ఇదేమంటే తాను పని చేసుకుంటుంటే పిల్లలు అల్లరి చేస్తున్నారని అంటారు. తన పని ఇంటిపని బడిలో చేసుకోవడం కాదని పాఠశాలకి వచ్చినప్పుడు పాఠాలు చెప్పాలనే జ్ఞానం లేకుండా మాట్లాడుతారు. మరోసారి వారు మా బడికి పోనీటైల్ వేసుకొస్తే శిగ తరుగుతామని అన్న ఆ పెద్ద సారువారు అన్నంత పనీ తన టీచర్లతో చేయించారు. నిత్యం ఎక్కడోచోట సారీ ఎన్నోచోట్ల పిల్లల్ని చెరబట్టందే పాఠాలు చెప్పలేమని సిద్ధాంతీకరించిన మన చండా మార్కుల వార సులైన కొందరు పంతుళ్లు, పంతులమ్మలకు పిల్లల్ని కొట్టి, తిట్టి నానా హింసలకు గురి చేయందే నిద్రపట్టదు. ఇలా పిల్లలకు బాల్యమన్నది లేకుండా ఆ మధుర స్మృతులు సైతం మదిలోకి రాకుండా చేస్తున్నారు. పిల్లల మీద జరుగుతున్న ఈ ఘోరాలను ఆపాలని ఎవరికీ మనసురాదు. అవి అసలు ఘోరాల కిందకే లెక్కకు రావ న్నట్టు అధికార గణం గణిస్తుంది. ఈ ఘోరాల్లో కొన్ని ఘట నలు మహారాజశ్రీ మన పోలీసు వారి దగ్గరికి వస్తే అటూ, ఇటూ పుస్తకాలు తిరగేసి న్యాయ సలహాదారుల అభి ప్రాయం సేకరించి చివరకు ఓ చిన్న కేసుతో సరిపెట్టి, ఫైలును పక్కనపెట్టేసి.. ఇదెక్కడి పిల్ల కాకుల గోల మా చిన్నప్పుడు మమ్మల్ని మాత్రం తన్నంది బుద్ధి వచ్చిందా అని సూత్రీకరిస్తున్నారు. పిల్లల్ని శారీరక, మానసిక హింసకు గురి చేయరాదని బాలల హక్కుల చట్టాలలో రాసి ఉన్నా.. అవి చదివే తీరిక, అమలు చేసే కోరికా ఏ అధికారికీ లేదన్నది నిజం. ఈ చట్టాలన్నీ తెలిసి వాటిని తు.చ. తప్పకుండా పాటించాల్సిన విద్యాశాఖ అధికార గణం తు.చ. ఇవేమీ పాడు చట్టాలు ‘దొరకొడుకునైననూ తొడ పాశములుబెట్టి, బుగ్గలు నలు పంది బుద్ధి రాదు’ అన్న పాత, పాడుబడిన పద్యాలు వల్లెవేసుకొని.. చదువు చెప్పినవాడు చావబాదడం నేరమా? ఛీ ఇవేం చట్టాలు అని ఆ చట్టాలను హేళన చేయడం తప్ప పిల్లలపై పంతుళ్ల, పంతులమ్మల దౌర్జన్యాలు జరిగినప్పుడు చర్యలు చేపట్టాలన్న ఇంగిత జ్ఞానాన్ని మరిచిపోతున్నారు. పిల్లల్ని చీల్చి చెండాడిన చండా మార్కులకే వంతపాడుతూ, వత్తాసు పలుకుతున్నారు. ఇటు పోలీసు, అటు విద్యా శాఖ అధికారుల తీరు ప్రైవేటు పాఠశాలలకూ, పిల్లల్ని హింసించే గురువర్యులకు కొంగు బంగారంగా మారుతోంది. పిల్లలు చచ్చిపోయినా సరే చదువు నేర్పి తీరాల్సిందే అనే వైఖరి పాటిస్తుంటేనే పాఠశాలలంటేనే పిల్లలకు పై ప్రాణాలు పైనే పోయి చదవడం కన్నా చాకిరీ చేసుకోవడమే మిన్న అని పిల్లలు బాల కార్మికులుగా మారిపోతున్నారు. ప్రభుత్వ పెద్దలు మాత్రం వారింకా పిన్నవారే కదా.. వారికి ఓటు హక్కు వస్తేనే కదా మన అవసరం అని అనుకుంటున్నారు. కానీ అక్షరాస్యత పెరగాలంటే బాల కార్మిక వ్యవస్థ సమూ లంగా పోవాలంటే, బడి అంటే భయం కాదు ప్రేమ కలిగిం చాలి. చదువు అంటే కష్టం కాదు, ఇష్టం అనిపించాలని.. పిల్లల చదువు సాగి అక్షరాస్యత పెరగాలంటే కొందరు రాకాసి పంతుళ్లు, పంతులమ్మల కోరలు పీకాల్సిందేనని ఆలోచించడం లేదు. గురువులు ఎన్ని అకృత్యాలు చేసినా వారివద్ద ఓట్లున్నాయి, పిల్లలు ఎన్ని బాధలు పడుతున్నా ఓట్లు లేని వెధవలు అనే భావనతో కొందరు నాయకుల ప్రవర్తన వల్ల పిల్లల్ని పట్టించుకునే నాథుడే లేడు. పిల్లల్ని రాచిరంపాన పెట్టడంతో తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా అక్షరాస్యత శాతం పడిపోయింది. పిల్లలు బడుల్లో ఇష్టంగా చదవాలంటే వారిని కష్ట పెట్టకుండా చదివించే గురువులు కావాలి. కానీ, నేను గురువును నాకు మర్యాద, గౌరవం కావాలంటే, గురువులు గౌరవంగా, మర్యాదగా ప్రవర్తించంది వారికి ఆ రెండూ దొర కవు. వారు గౌరవంగా ప్రవర్తిస్తేనే ఎదుటివారి నుండి గౌరవం దొరుకు తుంది. ఇక మన విద్యా వ్యవస్థ బాగుప డాలంటే.. వాహనం నడిపే వారికి వాహనం నడుపగలరని లైసెన్స్ ఇస్తున్న మనం చదువు చెప్పేవారు చెప్పగలరని ఎలాంటి ధృవీకరణ పత్రం ఇవ్వడం లేదు, బతుకుదెరువు దొరకని వాడు బడి పంతులుగా మనగలుగుతున్నాడు. చదువు చెప్పే ప్రతి వారికి ప్రభుత్వం తరఫున పరీక్ష నిర్వ హించి సర్టిఫికెట్లు ఇవ్వాలి. పిల్లలకు ఎండాకాలం, సంక్రాంతి, దసరా సెల వులు ఇస్తే ఆ సమయాల్లో టీచర్లం దరికీ చదువు చెప్పే మెలకువలపై ఎప్పటికప్పుడు తర్ఫీదు ఇవ్వడంతోపాటు పిల్లల హక్కుల గురించి వివరించాలి. పిల్లల్ని ఎవరైనా గురువులు తిట్టినా, కొట్టినా నాన్‌బెయిల బుల్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి కస్టడీకి పంపించాలి. పిల్లలపై దౌర్జన్యాలు పంతుళ్లు చేసినప్పుడు వారిని శాశ్వ తంగా చదువుచెప్పే అర్హత కోల్పోయేలా చర్యలు చేపట్టాలి. పాఠశాలల్లో పిల్లలపై జరిగే హింసకు సంబంధించి ఫిర్యాదు వచ్చినప్పుడు పిల్లల్ని హింసించిన గురువుతో పాటు యాజమాన్యాన్ని బాధ్యులను చేయాలి. పిల్లల్ని తీవ్రంగా కొట్టినా, వారి చావుకు కారణమైనా, పిల్లల ప్రాణా లకు ముప్పు వాటిల్లేలా భద్రత లోపించినా ఆ పాఠ శాలల గుర్తింపు శాశ్వతంగా రద్దు చేయాలి. ప్రతి టీచర్ కచ్చితంగా మానసిక విశ్లేషణ పరీక్షలో, చదువు చెప్పడానికి అర్హత సాధించినప్పుడే ఉపాధ్యాయ వృత్తి చేపట్టేలా చర్యలు తీసు కోవాలి. ప్రైవేటు పాఠశాలల్లో యాజమాన్యం ఇష్టాను సారంగా జీతాలు ఇవ్వడం కాకుండా ప్రభుత్వ పాఠశాలల అధ్యాపకులతో సరిసమానంగా ప్రైవేటు టీచర్ల వేతనాలు ఉండేలా చర్యలు చేపట్టాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ పిల్లల్ని మానసికంగా, శారీరకంగా హింసకు గురిచేసే వారిని ఉపే క్షించకూడదు. అలాగే ప్రతి పాఠశాలలో పిల్లలు ఫిర్యాదు చేయడానికి వీలుగా బాక్సులను ఏర్పాటుచేసి ఆ ఫిర్యాదు లను వారానికి ఒకసారి ఎంఈఓ స్థాయి అధికారి మాత్రమే తెరచి చూసి ఆ ఫిర్యాదులపై చర్యలు చేపట్టేలా ఉండాలి. ఏది ఏమైనప్పటికీ చదువులు చెప్పే పాఠశాలల్లో మానసిక, శారీరక దండనలు సమూలంగా నిర్మూలించినప్పుడే మనం నాగరికులమని చెప్పుకోవచ్చు. లేదా అనాగరికులుగా మిగిలి పోక తప్పదు. అక్షరాస్యత ఏనాటికీ వంద శాతానికి చేరదు. వ్యాసకర్త: అచ్యుతరావు, గౌరవ అధ్యక్షులు, బాలల హక్కుల సంఘం మొబైల్ : 93910 24242 -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఆరిలోవ(విశాఖ తూర్పు): జాతీయ రహదారిపై వెంకోజీపాలెం వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరిలోవకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. రెండో వార్డు గాంధీనగర్‌కు చెందిన వైఎస్సార్సీపీ నగర కార్యదర్శి రాగతి అచు్యతరావు రెండో అన్నయ్య రాగతి నడిపి అచు్యతరావు(43) శనివారం సాయంత్రం నగరంలోకి సొంత పని మీద ద్విచక్ర వాహనంపై వెళ్లారు. తిరిగి రాత్రి 10.45 గంటల సమయంలో ఇంటికి వస్తుండగా వెంకోజీపాలెం ఆంజనేయస్వామి గుడి వద్ద మలుపు తిరుగుతుండగా వెనక నుంచి వస్తున్న విశాఖ డెయిరీ పాల ట్యాంకర్ ఢీకొట్టింది. అచు్యతరావు హెల్మెట్ ధరించినా తలపైకి ట్యాంకర్ చక్రం ఎక్కేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ æసభ్యులు అక్కడికి చేరుకుని కన్నీటిపర్యంతమయా్యరు. మూడో పట్టణ పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమాదానికి కారణవైున పాల ట్యాంకరును డ్రైవర్ పోలీసులకు చిక్కకుండా వేగంగా తరలించేశాడు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత ట్యాంకర్‌ను విజయనగరం జిల్లా భోగాపురం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. మృతుడు అచు్యతరావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈయన శుభకార్యాలకు సప్లయర్స్, ఫ్లవర్ డెకరేషన్ కాంట్రాక్ట్ చేస్తుండేవాడు. వైఎస్సార్సీపీ తూర్పు కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్, వార్డు అధ్యక్షుడు గొలగాని శ్రీనివాస్.. రాగతి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. నగరంలో పని చూసుకొని సినిమాకు వెళ్లారని, సినిమా మధ్యలోనే వస్తూ ఈ ప్రమాదానికి గురయా్యరని మృతుడి కుటుంబ సభ్యులు రోదించారు. సినిమా పూర్తయినంత వరకు ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
చిన్నారులపై నేరాలకు వాట్సాప్ అలర్టు
పిల్లలపై ఎలాంటి వేధింపులు జరిగినా వెంటనే స్పందించేందుకు బాలల హక్కుల సంఘం వాట్సాప్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. బాల కార్మికులు, వీధిబాలలు, మాఫియా చేతిలో బిచ్చగాళ్లుగా మారినా, స్కూల్స్‌లో వేధింపులు, అత్యాచారాలు జరిగినా, ఆఖరకు కుటుంబ సభ్యులు వేధింపులకు గురిచేసినా 9491292424 అనే నంబరుకు వాట్సాప్ చేస్తే వెంటనే స్పందిస్తామని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షులు అచ్యుతరావు తెలిపారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సంఘం అధ్యక్షురాలు అనూరాధా రావు, స్లేట్ స్కూల్ విద్యార్ధులతో కలిసి వాట్సాప్ నంబర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ... ఈ వాట్సాప్ నంబర్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని, ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు. ఇటీవల ఖైరతాబాద్ పెద్ద వినాయకుని వద్ద ఓ బాలుడు గాంధీ వేశధారణలో భిక్షాటన చేస్తున్నాడని అతన్ని పట్టుకుని హోంకు తరలించి వివరాలు తెలుసుకోగా ... పెద్ద మాఫియా అని గుర్తించినట్లు పిల్లలకు టీ, బన్ ఇచ్చి జనసంచారం ఎక్కువగా ఉన్న చోట భిక్షాటన చేయిస్తున్నారని, పిల్లాడు ప్రతీ రోజు 200 నుంచి 300 వారికి ఇవ్వాలని లేని పక్షంలో వాతలు పెడుతున్నట్లు సదరు బాలుడు తెలిపారని ఆవేదనవ్యక్తం చేశారు. వీధి పిల్లలు ప్రభుత్వ పిల్లలే అని గతంలో ప్రభుత్వాలు తెలిపాయని, ప్రస్తుతం వీధిపిల్లలు భిక్షాటన చేస్తుంటే ప్రభుత్వ పిల్లలు భిక్షాటన చేస్తున్నారా ..? అని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రల్లో పిల్లలు గాని, పెద్దలు గాని భాధ్యత గల ప్రతీ వ్యక్తులు వేధింపులకు గురౌతున్న పిల్లల వివరాలు తమకు వాట్సాప్ ద్వారా అందించాలని పిలుపునిచ్చారు.