గేమింగ్.. 'రక్షకుడు' వచ్చాడు!
యాక్షన్–అడ్వెంచర్ గేమ్ ‘ఘోస్ట్ ఆఫ్ సుషిమ’ విడుదల అయింది. థర్డ్–పర్సన్ పర్స్పెక్టివ్ నుంచి ఆడే గేమ్ ఇది. సుషిమ ద్వీపాన్ని రక్షించడానికి రంగంలోకి దిగిన ‘సకాయ్’ అనే సమురాయ్‌ని ప్లేయర్ కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. అకీరా కురోసావా సినిమాలు, కామిక్ బుక్ సిరీస్ ‘ఉసాగి యోజింటో’ ప్రేరణతో ఈ గేమ్‌ను రూపొందించారు.గేమ్ ల్యాండ్‌స్కేప్, మినిమలిస్టిక్ ఆర్ట్ స్టైల్‌ను యాక్షన్–అడ్వెంచర్ గేమ్ ‘షాడో ఆఫ్ ది కొలోసస్’ ప్రభావంతో చేశారు. గేమ్‌లోని లొకేషన్లు ‘పర్ఫెక్ట్ ఫొటోగ్రాఫర్స్ డ్రీమ్స్’ అనిపించేలా అందంగా ఉంటాయి. ఇలన్ ఎస్కేరి, షిగేర్ ఉమేలయాషి ఈ గేమ్ సౌండ్ ట్రాక్‌ను అద్భుతంగా కం΄ోజ్ చేశారు.‘చారిత్రకంగా, సాంస్కృతికంగా ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దాం’ అని మేకర్స్ చెబుతున్నారు.జానర్: యాక్షన్–అడ్వెంచర్మోడ్స్: సింగిల్–ప్లేయర్, మల్టీప్లేయర్ప్లాట్ఫామ్స్: ప్లేస్టేషన్ 4, ప్లే స్టేషన్ 5, విండోస్.ఇవి చదవండి: అరుదైన ప్రతిభ.. అక్షత!