Actopus team
-
అబ్బురపరిచిన ఆక్టోపస్, బాంబ్ స్క్వాడ్ విన్యాపాలు
-
మేమున్నామని.. మీకేం కాదని..
బంజారాహిల్స్ : సోమవారం ఉదయం 10 గంటలు.. ఖైరతాబాద్ సిగ్నల్.. ఒక్కసారిగా అక్కడివచ్చిన ఓ భారీ వాహనంలోంచి కొందరు వ్యక్తులు దిగారు.. క్షణాల్లోనే చుట్టుపక్కల భవనాలను ఎక్కేశారు. ఏం జరుగుతోందో తెలియక జనమంతా ఉత్కంఠకు గురయ్యారు. కంగారు పడ్డారు. వాహనంలోంచి దిగినవారి చేతుల్లో అత్యాధునిక తుపాకులున్నాయి. ప్రత్యేక దుస్తులు ధరించి ఉన్న వారంతా ఆక్టోపస్ కమాండోలు. హైదరాబాద్ సేఫ్ అండ్ సెక్యూర్ సిటీ అని చెప్పే క్రమంలో భాగంగా ఆక్టోపస్ కమాండోలు ఖైరతాబాద్ చౌరస్తాలో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. నిమిషాల వ్యవధిలోనే చౌరస్తాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాన్ని వారి గుప్పిట్లోకి తీసుకున్నారు. చౌరస్తాకు నలువైపులా గస్తీ కాస్తూ అనుమానితులను విచారించారు. అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఇదంతా ఎందుకంటే.. హైదరాబాద్ దేశంలోకెల్లా అత్యంత రక్షణాత్మక నగరమని చాటిచెప్పేందుకే వీరు చేసిన ప్రయత్నం. నగరంలో ఎక్కడ ఎటువంటి విపత్తులు జరిగినా క్షణాల్లోనే కమాండోలు అందుబాటులో ఉంటారని ఆక్టోపస్ సీనియర్ అధికారి వివరించారు. అంతే కాకుండా సామాన్యులకు కూడా తమ టీమ్ గురించి అవగాహన కలిగించేందుకు ఇలాంటి కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఆక్టోపస్ కమాండోలతో నగరం మరింత రక్షణాత్మకంగా ఉంటుందన్నారు. -
భద్రాద్రిలో ఆక్టోపస్ సర్వే
భద్రాచలం: ఆలయాలు, ప్రార్థనా మందిరాలు, చారిత్రక కట్టడాల వంటి జనసమ్మర్థ ప్రదేశాలనే సంఘవిద్రోహ శక్తులు టార్గెట్ చేసుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న భద్రాచలం శ్రీసీతారామస్వామి ఆలయం భద్రతపై పోలీసులు దృష్టి సారించారు. ఈ క్రమంలోనే బుధవారం ఆక్టోపస్ బృందాలు భద్రాది ఆలయ పరిసరాలల్లో సమగ్ర సర్వే నిర్వహించారు. డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో నిర్వహించిన ఈ సర్వేలో హైదరాబాద్ నుంచి వెళ్లిన బృందంతోపాటు భద్రాచలం పోలీసులు, రామాలయ సెక్యూరిటీ సిబ్బంది, ఆలయ అధికారులు, ఫైర్ అధికారులు కూడా పాల్గొన్నారు. ఆలయానికి దారి తీసే అన్ని మార్గాలు, దర్శనం తరువాత ఆలయం లోపల నుంచి భక్తులు బయటకు వచ్చే దారులు అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించారు. రామాలయం వ్యూకు సంబంధించిన మ్యాప్‌ను సరిపోల్చుకుంటూ పూర్తి స్థాయిలో వివరాలు సేకరించి, నమోదు చేసుకున్నారు. అనుకోని పరిస్థితులు తలెత్తినప్పుడు ఏవిధమైన జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై తగిన సూచనలు చేసే క్రమంలోనే ఆక్టోపస్ బందం సర్వే చేసినట్లుగా తెలుస్తోంది. అయితే వివరాలను మీడియాకు వెల్లడించేందుకు సదరు అధికారులు నిరాకరించారు. సంఘ వ్యతిరేక శక్తుల దాడులను ఏ రీతిన తిప్పికొట్టాలనే దానిపై మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు.