Adalat
-
అక్టోబర్ నుంచి బాలల అదాలత్‌లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నుంచి బాలల అదాలత్‌లు నిర్వహించనున్నట్లు ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు తెలిపారు. మంగళగిరి కమిషన్ కార్యాలయంలో సభ్యులు జంగం రాజేంద్రప్రసాద్, గోండు సీతారాం, బత్తుల పద్మావతితో ఆయన సమావేశమయ్యారు. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో నిర్వహించడానికి అవసరమైన ప్రణాళికలు, సన్నాహాలపై వారు చర్చించారు. 18 సంవత్సరాల్లోపు బాలలు తమ హక్కులకు భంగం కలిగినప్పుడు, ఆయా ప్రాంతాల్లో వారు ఎదుర్కొంటున్న సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకురావచ్చని చెప్పారు. ఇలాంటి విషయాలు తమ దృష్టికి తీసుకురావడానికి ఈ అదాలత్‌లు సువర్ణావకాశమని వివరించారు. -
జూన్9న సిండికేట్ బ్యాంక్ అదాలత్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకుండా మొండి బకాయిలుగా మారిన ఖాతాలను పరిష్కరించుకోవడానికి సిండికేట్ బ్యాంక్ జూన్ తొమ్మిదిన అదాలత్ నిర్వహిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అన్ని శాఖల్లో ఈ అదాలత్‌ను నిర్వహిస్తున్నామని, ఒకేసారి చెల్లించడం ద్వారా (వన్‌టైమ్ సెటిలిమెంట్ )ఎన్పీఏ ఖాతాలను వదిలించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు బ్యాంకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. వ్యవసాయ, వ్యాపార, వ్యక్తిగత, విద్యా, ఉద్యోగ రుణాలున్న ఎన్పీఏ ఖాతాదారులు ఈ అదాలత్‌లో పాల్గొని వన్‌టైమ్ సెటిలిమెంట్ కింద వడ్డీ రాయితీని పొందచ్చని బ్యాంకు తెలిపింది. -
స్ట్రాంగ్ లాయర్... సాఫ్ట్ ఫాదర్ అయ్యాడు!
టీవీక్షణం సోనీ చానెల్ ప్రోగ్రామ్స్‌ని ఫాలో అయ్యేవాళ్ల ఫేవరేట్ షోలలో ‘అదాలత్’ తప్పకుండా ఉంటుంది. 2010 నుంచి నేటి వరకూ కూడా అత్యధిక టీఆర్పీతో సాగిపోతోన్న కార్యక్రమం ఇది. ఈ సక్సెస్‌లో అతి పెద్ద భాగం... అదాలత్ హీరో రోనిత్రాయ్దే. లాయర్ కేడీ పాఠక్‌గా అతడి నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇప్పుడు మరో షోకి కూడా తన కరిష్మాని జతచేశాడు రోనిత్. ఇటీవలే సోనీలో ప్రారంభమైన ‘ఇత్నా కరోనా ముఝే ప్యార్’లో లీడ్ రోల్ చేస్తున్నాడు రోనిత్. ఇన్నాళ్లూ స్ట్రాంగ్ లాయర్‌గా ఆకట్టుకున్నవాడు, ఇందులో సాఫ్ట్ ఫాదర్‌గా కనిపిస్తు న్నాడు. మనస్పర్థల కారణంగా దూరమైన కొన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ భార్యకు, కూతురికి దగ్గరవ్వాలని తహతహలాడే తండ్రిగా మనసుల్ని పిండుతున్నాడు. తన ఇమేజ్‌తో సీరియల్‌కి భారీ ఓపెనింగ్‌ని ఇచ్చిన రోనిత్... దాని విజయంలో కూడా ప్రధాన పాత్రధారి అవుతాడనడంలో సందేహమే లేదు! -
రేపు లోక్ అదాలత్
చెన్నై, సాక్షి ప్రతినిధి:కోర్టులో ఏళ్లతరబడి పేరుకుపోయి ఉన్న కేసులకు ఈనెల 6వ తేదీన పరిష్కారం చెప్పనున్నారు. సుప్రీం కోర్టు ఆదేశానుసారం భారీ లోక్ అదాలత్‌ను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు తమిళనాడు న్యాయశాఖ సభ్య కార్యదర్శి, న్యాయమూర్తి ఆర్ఎమ్డీటీ రామన్ తెలిపారు. గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కొలిక్కిరాని కేసులకు సామరస్య ధోరణిలో పరిష్కారం చూపడమే లోక్ అదాలత్ నిర్వహణలోని ప్రధాన ఉద్దేశమన్నారు. గత ఏడాది నవంబరు 23న నిర్వహించిన లోక్ అదాలత్ రాష్ట్రంలో రూ.1.14 కోట్ల విలువైన 13,77,252 కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీన జాతీయ స్థాయిలో జరిగిన లోక్‌అదాలత్ ద్వారా రూ.940 కోట్ల విలువైన 15 లక్షలా 8 వేల 767 కేసులకు పరిష్కారం లభించినట్లు తెలిపారు. లోక్ అదాలత్‌లు ముగిసిన వెంటనే నగదును బాధితులకు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈనెల 6వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న లోక్ అదాలత్ కోసం 300 బెంచ్‌లు ఏర్పాటు చేసి 300 న్యాయమూర్తులను నియమించినట్లు తెలిపారు. సుమారు 14 లక్షల కేసులకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు. 4 వారాల్లోగా లోకాయుక్తా లోకాయుక్తా న్యాయస్థానం ఏర్పాటులో జరిగిన జాప్యంపై ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయ వేసింది. నాలుగువారాల్లోగా లోకాయుక్తా న్యాయస్థానం ఏర్పాటు పనులు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని ప్రధాన న్యాయమూర్తి గురువారం ఆదేశించారు. కాంచీపురం జిల్లా కీళ్మరవత్తూరు గ్రామానికి చెందిన ఆర్ కన్నన్ గోవిందరాజులు ఇటీవల మద్రాసు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. కేంద్రం 2013లో లోక్‌పాల్, లోకాయుక్తా చట్టాన్ని తీసుకురాగా, ఈ ఏడాది జనవరిలో పార్లమెంటులో ఆమోదం పొందిందని పిటిషన్ దారు పేర్కొన్నారు. జనవరి 16వ తేదీన దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిందన్నారు. అనేక రాష్ట్రాల్లో లోకాయుక్తా న్యాయస్థానాలు పనిచేయడం ప్రారంభించినా రాష్ట్రంలో ఆ ఊసేలేదని కోర్టుకు విన్నవించారు. డిసెంబరు 16వ తేదీ నాటికి లోకాయుక్తా న్యాయస్థానాల ఏర్పాటు గడువు పూర్తి అవుతుందని చెప్పారు. లోకాయుక్తా న్యాయస్థానాల్లో ముఖ్యమంత్రులు, మంత్రులను సైతం అవినీతిపై నిలదీసే అవకాశం ఉంటుందన్నారు. లోకాయుక్తా ఏర్పాటును కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఏప్రిల్‌లో వినతిపత్రం సమర్పించినా స్పందించనందున కోర్టును ఆశ్రయించినట్లు పిటిషన్ దారుడు కన్నన్ వివరించారు. ఈ పిటిషన్ గురువారం హైకోర్టు ముందుకు రాగా ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి మహాదేవన్ విచారించారు. నాలుగువారాల్లో లోకాయుక్తా న్యాయస్థానం ఏర్పాటు పనులను ప్రారంభించాలని ఆదేశించారు.