Adarsh Shastri
-
కేజ్రీవాల్‌పై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరిన ఎమ్మెల్యే ఆదర్శ్ శాస్త్రి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ద్వారక్ నియోజకవర్గ టికెట్‌ను తిరిగి తనకు ఇచ్చేందుకు కేజ్రీవాల్ రూ.10 నుంచి15 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపించారు. దీంతో తాను షాక్‌కు గురయ్యానని, అంత డబ్బు కేజ్రీవాల్‌కు ఇచ్చేందుకు నిరాకరించడంతో తనకు టికెట్ దక్కలేదని వాపోయారు. తన స్థానంలో వినయ్ మిశ్రాకు ద్వారక్ స్థానం కేటాయించారని తెలిపారు. ఆదర్శ్ వ్యాఖ్యలు ఢిల్లీ రాజకీయాల్లో పెను దుమారాన్ని సృష్టిస్తున్నాయి. ఈ ఆరోపణలను ఆప్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. (మా నాన్నను గెలిపించండి: సీఎం కుమార్తె) మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మనవడు, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదర్శ్ శాస్త్రి ఆప్‌కి గుడ్‌బై చెప్పి, శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయ తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన... ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పించారు. శాసనసభ్యులను కలిసేందుకు కేజ్రీవాల్ సమయం కూడా ఇవ్వడం లేదని, నియంతగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కేజ్రీవాల్ టికెట్ పంపిణీని వ్యాపారంగా మార్చారని విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టంపై అభిప్రాయం చెప్పమని కేజ్రీవాల్‌ను కోరగా ఆయన ముందుకు రాలేదని ఆదర్శ్ పేర్కొన్నారు. (హస్తం గూటికి చేరిన ఆదర్శ్ శాస్త్రి) -
హస్తం గూటికి చేరిన ఆదర్శ్ శాస్త్రి
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి ఎమ్మెల్యే ఆదర్శ్ శాస్త్రి హస్తం గూటికి చేరారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మనవడు, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదర్శ్ శాస్త్రి ఆప్‌కి గుడ్‌బై చెప్పి, శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన... ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పించారు. శాసనసభ్యులను కలిసేందుకు కేజ్రీవాల్ సమయం కూడా ఇవ్వడం లేదని, నియంతగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కేజ్రీవాల్ టికెట్ పంపిణీని వ్యాపారంగా మార్చారని విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టంపై అభిప్రాయం చెప్పమని కేజ్రీవాల్‌ను కోరగా ఆయన ముందుకు రాలేదని ఆదర్శ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుభాష్ చోప్రా, పిసి చాకో, ముఖేష్ శర్మ కూడా పాల్గొన్నారు. కాగా షీలా దీక్షిత్ ప్రభుత్వంలో ఆదర్శ్ శాస్త్రి మంత్రిగా పనిచేశారు. అయితే మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో అభ్యర్థులను ప్రకటించిన కేజ్రీవాల్ .... సిట్టింగ్‌ల్లో 15 మందికి టికెట్లు నిరాకరించారు. అందులో ఆదర్శ్ శాస్త్రి కూడా ఉన్నారు. చదవండి: మా నాన్నను గెలిపించండి: సీఎం కుమార్తె ఆప్ అభ్యర్థులను ప్రకటించిన కేజ్రీవాల్ తేలని సీఎం అభ్యర్థి.. మోదీపైనే భారం! -
'టూవీలర్స్ కూ వర్తింపజేయండి'
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాలకు సరి-బేసి సంఖ్యల విధానం అమలు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకుడు ఆదర్శ్ శాస్త్రి అభిప్రాయపడ్డారు. ప్రయాణికులకు సరిపడినన్ని బస్సులు ఉంటే టూవీలర్స్ ను సరి-బేసి పాలసీలో చేర్చవచ్చని చెప్పారు. దిచక్ర వాహనదారులకు ప్రత్యామ్నాయం చూపిస్తే ఈ పథకం విజయవంతం అవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. సరి-బేసి సంఖ్య విధానం అమలుచేసిన వారం రోజుల్లో దీన్ని సమీక్షించి ద్విచక్ర వాహనాలకు వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చెప్పిన విషయాన్ని ఆయనీ సందర్భంగా గుర్తుచేశారు. సరి-బేసి విధానం అమల్లోకి వచ్చిన వారం తర్వాత టూవీలర్స్ కు దీన్ని వర్తింపజేయడం సాధ్యమేనని శాస్త్రి పేర్కొన్నారు. ఢిల్లీలో ఉన్న 85 లక్షల వాహనాల్లో 55 లక్షల వరకు ద్విచక్ర వాహనాలున్నాయి. ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు జనవరి 1 నుంచి కార్లకు సరి-బేసి సంఖ్యల విధానం అమలు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.