ADB loan
-
కరోనాపై పోరు : ఏడీబీ భారీ సాయం
సాక్షి, ముంబై: కరోనావైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడటానికి భారత ప్రభుత్వానికి పూర్తి మద్దతు అందించేందుకు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ముందుకొచ్చింది. భారతదేశానికి 1.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 11,000 కోట్లు) రుణాన్ని అందించేందుకు ఆమోదం తెలిపింది. కోవిడ్-19 కట్టడి, నివారణ చర్యలు, ఆర్థికంగా వెనుకబడిన పేద ప్రజలకు సహాయ కార్యక్రమాలు నిర్వహణ లాంటి తక్షణ ప్రాధాన్యతా కార్యక్రమాలకు భారత ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఖర్చుపెట్టనుంది. ఏడీబీ ప్రెసిడెంట్ మసాట్సుగు అసకావా (ఫైల్ ఫోటో) భారతదేశానికి 150 కోట్ల డాలర్ల రుణం (రూ. 11,000 కోట్లు) ఇవ్వడానికి ఏడీబీ మంగళవారం అంగీకరించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. కోవిడ్ -19 యాక్టివ్ రెస్పాన్స్ అండ్ ఎక్స్పెండిచర్ సపోర్ట్ ప్రోగ్రాం పేదలు, మహిళలు , ఆర్థికంగా బలహీన వర్గాలకు సామాజిక రక్షణతో పాటు, వ్యాధి నివారణ చర్యలకు మద్దతుగా ఈ నిధులను సమకూర్చనున్నామని ఏడీబీ అధ్యక్షుడు మసాట్సుగు అసకావా ఒక ప్రకటనలో తెలిపారు. 2020 మార్చిలో ప్రారంభించిన ప్రభుత్వం అత్యవసర ప్రతిస్పందన కార్యక్రమాలను సక్రమంగా అమలులో ఏడీబీ అందించిన ఆర్థిక సాంకేతిక సహకారం దోహదం చేస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల విభాగంలో అదనపు కార్యదర్శిసమీర్ కుమార్ ఖరే చెప్పారు. దీంతోపాటు వృద్ధిని పెంచడానికి, బలమైన పునరుద్ధరణకు సాధ్యమైన మద్దతు అందించేందుకు ఏడీబీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. క్రెడిట్ గ్యారెంటీ పథకాల ద్వారా ఆర్థిక సదుపాయాన్ని సులభతరం చేయడం తద్వారా ప్రభావిత పరిశ్రమలు వ్యవస్థాపకులకు ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఇ) మద్దతు ఇవ్వాలని యోచిస్తోంది. (షాకింగ్ : డిఫాల్టర్ల వేలకోట్ల రుణాలు మాఫీ) -
కోవిడ్-19 : భారత్‌కు ఏడీబీ రుణం..
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19ను ఎదుర్కొనే క్రమంలో అట్టడుగు వర్గాలకు ఆసరా కల్పించడంతో పాటు ఇతర చర్యల కోసం భారత్‌కు దాదాపు రూ 10,500 కోట్ల రుణం అందించేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) ముందుకొచ్చిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఏడీబీ కోవిడ్-19 రెస్పాన్స్ కార్యక్రమం (కేర్స్) కింద మహమ్మారి ప్రభావిత పరిశ్రమలు, వాణిజ్యవేత్తలు ప్రధానంగా ఎంఎస్ఎంఈ రంగాన్ని ఆదుకునేందుకు బ్యాంకు సంసిద్ధత తెలిపిందని వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థలో పునరుత్తేజం కల్పించి భవిష్యత్‌లోనూ అనిశ్చితిని ఎదుర్కొనేందుకు అవసరమైన సాయం కోసం ఏడీబీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోందని పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో పట్టణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సేవల వ్యవస్థను బలోపేతం చేయడంపైనా కసరత్తు సాగుతోందని తెలిపింది. కోవిడ్-19 వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో పాటు పేదలు, మహిళలు, అణగారిన వర్గాలను కాపాడుకునేందుకు తక్షణ సాయం ప్రకటించిన క్రమంలో ఏడీబీ నుంచి సత్వర సాయం అందిందని ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సమీర్ కుమార్ ఖరే అన్నారు. చదవండి : కరోనా టెస్ట్ కిట్ల ‘కొనుగోల్‌మాల్’! -
వైజాగ్–చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌కు ఏడీబీ రుణం
375 మిలియన్ డాలర్లు న్యూఢిల్లీ: సుమారు 800 కి.మీ. పొడవున తలపెట్టిన విశాఖపట్నం–చెన్నై పారిశ్రామిక కారిడార్ నిర్మాణానికి ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) 375 మిలియన్ డాలర్లు రుణం, గ్రాంట్ రూపంలో అందజేయనుంది. ఇందుకు సంబంధించి భారత ప్రభుత్వం, ఏడీబీ ఒప్పందం కుదుర్చుకున్నాయి. 2,500 కి.మీ. పొడవున ప్రతిపాదిత ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్ నిర్మాణం తొలి దశలో వైజాగ్–చెన్నై కారిడార్‌ను నిర్మించనున్నారు. కారిడార్‌లో నాలుగు ప్రధాన కేంద్రాలైన వైజాగ్, కాకినాడ, అమరావతి, ఏర్పేడు–శ్రీకాళహస్తిలో మౌలికసదుపాయాల కల్పన కోసం రుణాలకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఏడీబీ తెలిపింది. తొలి విడత కింద 245 మిలియన్ డాలర్లతో విశాఖపట్నం, ఏర్పేడు–శ్రీకాళహస్తిలో అధునాతన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేయనున్నారు. మరో 125 మిలియన్ డాలర్ల రుణాలు విధానపరమైన తోడ్పాటు కోసం దక్కనున్నాయి. పారిశ్రామికాభివృద్ధికి దోహదపడే విధానాలను ప్రోత్సహించేందుకు, వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసే చర్యలకు, కారిడార్ నిర్వహణ సంస్థలకు తోడ్పాటు అందించేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు. వీటితో పాటు పర్యావరణ అనుకూల మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం అర్బన్ క్లైమేట్ చేంజ్ ట్రస్ట్ ఫండ్ నుంచి 5 మిలియన్ డాలర్లు దక్కనున్నాయి. నిధుల వినియోగం ఇలా.. తొలి విడతగా లభించే 245 మిలియన్ డాలర్లను కాకినాడ పోర్టు నుంచి 16వ నంబర్ జాతీయ రహదారికి మధ్య 29.6 కి.మీ. మేర కనెక్టివిటీని మెరుగుపర్చే దిశగా రహదారుల విస్తరణకు ఉపయోగించనున్నారు. అలాగే, విశాఖపట్నంలో నిరంతర నీటి సరఫరా కోసం స్మార్ట్ వాటర్ మేనేజ్మెంట్లో ఇన్వెస్ట్ చేయనున్నారు.