ఐదుగురు అదనపు డీజీలకు పదోన్నతి
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో ఐదుగురు అదనపు డీజీలకు... డీజీలుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందినవారిలో మాలకొండయ్య, వీఎస్ కౌముది, వినయ్ రంజన్ రే, ఆర్పీ ఠాకూర్, గౌతం సవాంగ్లకు డీజీలుగా ప్రమోషన్ లభించింది. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గా గౌతమ్ సవాంగ్, లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగా ఆర్పీ ఠాకూర్, అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) డైరెక్టర్ జనరల్ గా మాలకొండయ్య, జైళ్ల శాఖ అదనపు డీజీగా వినయ్ రంజన్ రే ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం విదితమే.