Adi sesha giri rao
-
సూపర్ స్టార్ కృష్ణ 'మోసగాళ్లకు మోసగాడు' రీరిలీజ్
వెండితెరపై సూపర్ స్టార్ కృష్ణ చేసిన ప్రయోగాల గురించి చెప్పనక్కర్లేదు. తెలుగు తెరకు ఎన్నో సాంకేతిక హంగులను పరిచయం చేసిన కృష్ణ నటించిన తొలి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు. 52 ఏళ్ల కిందట రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది.పద్మాలయా స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మాత ఘట్టమనేని ఆది శేషగిరిరావు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆ సినిమా కల్ట్ క్లాసిక్‌గా నిలిచిపోయింది. చదవండి: ట్యాక్సీ డ్రైవర్‌గా చిరంజీవి.. అదిరిపోయిన 'భోళా శంకర్' పోస్టర్ ఇప్పుడీ చిత్రం రీరిలీజ్‌కు సిద్ధమైంది. మే31న సూపర్ స్టార్ కృష్ణ బర్త్‌డే సందర్భంగా 4k టెక్నాలజీతో సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ఆది శేషగిరిరావు ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..''పద్మాలయ సంస్థకు ఫౌండేషన్ మోసగాళ్లకు మోసగాడు. మా బ్యానర్లో ఎన్ని సినిమాలు వవచ్చినా ఈ సినిమా చాలా ప్రత్యేకం. కృష్ణ గారి బర్త్‌డేకి నివాళిగా, అభిమానుల కోరిక మేరకు సినిమాను రీరిలీజ్ చేస్తున్నాం. బర్త్‌డే రోజున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈరోజు(సోమవారం)అల్లూరి సీతారామరాజు రిలీజ్ అయ్యి 48 సంవత్సరాలు కావడంతో ఈరోజున ప్రెస్‌మీట్ పెట్టాము. కృష్ణ గారి మెమోరియల్‌గా మ్యూజియం కట్టడానికి ఇక్కడ ప్రభుత్వం స్థలం కేటాయిస్తామన్నారు. అయితే ఇక్కడే ఉన్న మా సొంత స్థలంలో పనులు చేయిస్తున్నాము'' అని ఆది శేషగిరిరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ్, బి గోపాల్, అశ్వినిదత్, నిర్మాత రామలింగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. చదవండి: కానిస్టేబుల్ పరీక్షలో బలగం ప్రశ్న, దిల్ ఖుష్ అయిన డైరెక్టర్ -
ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ఎన్నికల్లో ఆదిశేషగిరిరావు ఘన విజయం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ క్లబ్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రముఖ నిర్మాత ఆదిశేషగిరిరావు మరోసారి ఎఫ్ఎన్సీసీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌పై తుమ్మల రంగారావు విజయం సాధించారు. ప్రతీ రెండేళ్లకోసారి ఫిల్మ్ నగర్ క్లబ్‌కు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు. మొత్తం 4 వేల 600మంది సభ్యులున్న ఈ సెంటర్లో 1900 మందికి ఓటు హక్కు ఉంది. వారిలో మెజార్టీ సభ్యులైన నిర్మాతలు, దర్శకులు, ఇతర ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అల్లుఅరవింద్ , సురేష్ బాబు, కేఎల్ నారాయణ ప్యానెల్‌లోని సభ్యులే గెలుపొందారు. చదవండి: (డాటర్స్ డే స్పెషల్.. కూతురికి మహేశ్ స్పెషల్ విషెష్) -
టీడీపీలో ‘గల్లా’ ముసలం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ముందు భారీ ప్యాకేజీలతో కొత్తవారిని పార్టీలో చేర్చుకోవాలనుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహానికి సొంత పార్టీ సీనియర్లే చెక్ పెడుతున్నారు. ఇన్నేళ్లుగా సేవ చేస్తున్న తమనొదిలి ఆర్థికంగా బలంగా ఉన్నారన్న కారణంతో కొత్తవారికి ఎన్నికల్లో అవకాశం కల్పించడాన్ని వారు జీర్ణించుకోలేపోతున్నారు. ఆ విషయంలో అధినేతకు ఎదురు చెప్పేందుకు వారు వెనకాడటం లేదు. మాజీ మంత్రి, చిత్తూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకురాలు గల్లా అరుణకుమారితో పాటు ఆమె కుమారుడు జయదేవ్, ఆయన బంధువులను పార్టీలో చేర్చుకునే ఉద్దేశంతో.. జయదేవ్‌కు గుంటూరు లోక్‌సభ, గల్లా అరుణకు చంద్రగిరి అసెంబ్లీ, జయదేవ్ మామ ఆది శేషగిరిరావుకు తెనాలి అసెంబ్లీ టికెట్లు ఇచ్చేందుకు చంద్రబాబు ఒప్పందం కుదుర్చుకున్నారన్న సమాచారం తాజాగా వెలుగులోకి వచ్చింది. తెనాలి నుంచి ఆది శేషగిరిరావుకు టికెట్ ఇవ్వాలన్న నిర్ణయం అయిపోయినందున, గుంటూరు (పశ్చిమ) లేదా మంగళగిరి నుంచి పోటీ చేయాలని గతంలో తెనాలి నుంచి పోటీచేసి ఓడిపోయిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను ఒప్పించే ప్రయత్నం జరిగింది. ఈ మేరకు జిల్లా పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ గరికపాటి మోహన్‌రావు ఆలపాటితో చర్చలు జరిపారు. తాజా పరిణామంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆలపాటి.. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి నియోజకవర్గంలోనే ఉంటూ ఇప్పటికే 30 నుంచి 40 కోట్ల రూపాయలు ఖర్చు చేశానని, ఆ మొత్తం తిరిగి ఇచ్చేస్తే తనదారి తాను చూసుకుంటానని స్పష్టంగా చెప్పడంతో గరికపాటి వెనుదిరిగినట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. జయదేవ్‌కు పోటీగా చంద్రశేఖర్ అలాగే, గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి జిల్లాకు కొత్తవాడైన జయదేవ్‌ను నిలపాలనుకోవడంతో ఆయనకు పోటీగా ఆర్థికంగా బలమైన, తెనాలికి చెందిన ప్రవాస భారతీయుడు పెమ్మసాని చంద్రశేఖర్ పేరును జిల్లాకు చెందిన కోడెల శివప్రసాద్, ఆలపాటి రాజాలతో పాటు మరికొందరు నేతలు తెరపైకి తెచ్చారు. చంద్రశేఖర్ పార్టీకి రూ. 50 లక్షల విరాళం కూడా ఇచ్చారని, చంద్రశేఖర్‌కు గుంటూరు వీలుకాని పక్షంలో నర్సరావుపేట లోక్‌సభ టికెట్ ఇవ్వాలని వారు చంద్రబాబును కోరారు. ఈ ప్రతిపాదనపై సూటిగా చెప్పకుండా చంద్రబాబు చూద్దాం అని మాత్రమే చెప్పి పంపినట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. జయదేవ్ పార్టీలోకి రావడాన్ని కోడెల వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, జిల్లాలోని ఆయన వ్యతిరేక వర్గం ఆహ్వానిస్తోంది. కాగా, తెనాలి, బుర్రిపాలెం మధ్య ఎన్నికల కోసం ప్రత్యేకంగా ఒక భవనాన్ని కూడా జయదేవ్ నిర్మిస్తుండటం గమనార్హం.