aditya hospital
-
మేడ్చల్ ఆదిత్య హాస్పిటల్ ఎండీ రవీంద్రకుమార్ ఆత్మహత్య
-
ఆస్పత్రిలో తెలంగాణ జాగృతి కన్వీనర్ హల్చల్
-
‘రూ.అర కోటి ఇవ్వకుంటే ఆస్పత్రిని పేల్చేస్తా’
నక్సల్స్ పేరుతో ఓ హాస్పిటల్ యాజమాన్యాన్ని బెదిరించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దమ్మాయిగూడలోని ఆదిత్య ఆస్పత్రి యాజమాన్యానికి గురువారం ఉదయం ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. తాను మావోయిస్టు నేత శ్రీను అని పరిచయం చేసుకున్న ఆవ్యక్తి... వెంటనే రూ.50 లక్షలు ఇవ్వకుంటే ఆస్పత్రి భవనాన్ని బాంబులతో పేల్చేస్తానని బెదిరించాడు. దీనిపై యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
హైదరాబాద్‌లో మరో 9 స్వైన్‌ఫ్లూ కేసులు
సాక్షి, హైదరాబాద్: నగరంలో సోమవారం మరో తొమ్మిది స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో ఏడేళ్లలోపు బాలురు ముగ్గురున్నారు. వీరిలో ఇద్దరు బంజారాహిల్స్ రెయిన్బో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, మరొకరు ఆదిత్య ఆస్పత్రిలో చేరారు. నాంపల్లి కేర్ ఆస్పత్రిలో ఇద్దరు, ఉడ్‌లాండ్ ఆస్పత్రి, కాంటినెంటల్, గాంధీ, సికింద్రాబాద్ యశోద ఆస్పత్రుల్లో ఒకరు చొప్పున చికిత్స పొందుతున్నారు. వీరికి రక్త పరీక్షలు నిర్వహించగా స్వైన్‌ఫ్లూ పాజిటివ్ అని తేలింది. -
వైద్యుల నిర్లక్ష్యంతో 9నెలల చిన్నారి మృతి
హైదరాబాద్: నగరంలోని ఓ ఆస్పత్రిలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. తీవ్ర అనారోగ్యానికి గురైన 9నెలల చిన్నారి చికిత్స నిమిత్తం అబిడ్స్‌లోని ఆదిత్య ఆస్పత్రిలో చేరింది. ఆ చిన్నారికి వైద్యం చేయాలంటే 40వేల రూపాయలు కట్టాల్సిందిగా వైద్యలు చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు అంతా సోమ్ము చెల్లించలేమని, ముందుగా కొంత సొమ్ము చెల్లిస్తామని, వైద్యం చేయమని వైద్యులను కోరారు. అందుకు ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు అంగీకరించలేదు. డబ్బులు చెల్లించలేదనే కారణంతో ఆ చిన్నారికి చికిత్స చేయలేదు. దీంతో సకాలంలో వైద్యం అందకపోవడంతో ఆ చిన్నారి మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ మృతిచెందడాని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల వైఖరికి నిరసనగా ఆస్పత్రి ముందు బంధువులు ఆందోళనకు దిగినట్టు సమాచారం.