హైదరాబాద్: నగరంలోని ఓ ఆస్పత్రిలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. తీవ్ర అనారోగ్యానికి గురైన 9నెలల చిన్నారి చికిత్స నిమిత్తం అబిడ్స్లోని ఆదిత్య ఆస్పత్రిలో చేరింది. ఆ చిన్నారికి వైద్యం చేయాలంటే 40వేల రూపాయలు కట్టాల్సిందిగా వైద్యలు చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు అంతా సోమ్ము చెల్లించలేమని, ముందుగా కొంత సొమ్ము చెల్లిస్తామని, వైద్యం చేయమని వైద్యులను కోరారు.
అందుకు ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు అంగీకరించలేదు. డబ్బులు చెల్లించలేదనే కారణంతో ఆ చిన్నారికి చికిత్స చేయలేదు. దీంతో సకాలంలో వైద్యం అందకపోవడంతో ఆ చిన్నారి మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ మృతిచెందడాని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల వైఖరికి నిరసనగా ఆస్పత్రి ముందు బంధువులు ఆందోళనకు దిగినట్టు సమాచారం.
వైద్యుల నిర్లక్ష్యంతో 9నెలల చిన్నారి మృతి
Published Sun, Dec 29 2013 10:11 AM | Last Updated on Sat, Sep 2 2017 2:05 AM
Advertisement