Aditya PC
-
దర్శకుడు ఆదిత్యకు అరుదైన అవకాశం
సనత్‌నగర్: యునైటెడ్ నేషన్స్ గుర్తింపు పొందిన సింగపూర్‌కు చెందిన గ్రాండ్ కింగ్డమ్ డైనస్టీ సర్కార్ (మహా సామ్రాజ్య వారసత్వం)కు దక్షిణ భారతదేశం తరఫున అంబాసిడర్‌గా సినీ దర్శకుడు పీసీ ఆదిత్య నియమితులయ్యారు. దీంతో పాటు అంతర్జాతీయ ప్రోటోకాల్ హోదాను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఉత్తర్వు పత్రాలను పీసీ ఆదిత్యకు అందించారు. ఆదిత్య అంబాసిడర్‌గా నియమితులు కావడం తెలుగువాడికి దక్కిన అంతర్జాతీయ గుర్తింపుగా అభివర్ణించారు. ఈ అవకాశాన్ని కల్పించిన కేంద్రమంత్రి దత్తాత్రేయకు ఆదిత్య కృతజ్ఞతలు తెలిపారు. -
మూడు తరాల అనుబంధం
కుటుంబమంటే ఒక ఇల్లు కాదు... ఒక ఊరు కాదు... వ్యవస్థ అని తెలిపే సందేశాత్మక కథాంశంతో ఓ చిత్రం రూపొందుతోంది. పి.సి. ఆదిత్య దర్శకుడు. శ్రీఅమ్మా ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బి.రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో జరిగిన పూజాకార్యక్రమంతో ఈ చిత్రం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆదిత్య మాట్లాడుతూ -‘‘కుటుంబాలలో అడుగంటిపోతున్న అనుబంధాలు, ఆత్మీయతల్ని ఒక్కసారి గుర్తు చేసే కథాంశమిది. గ్రామీణ వాతావరణంలో కథ సాగుతుంది. మూడు తరాలకు చెందిన ఈ కుటుంబకథలో తాతగా ఎపిక్యురస్ నాగరాజు నటిస్తుండగా, కొడుకుగా నేనే నటిస్తున్నాను. మనవడిగా కొత్త నటుణ్ని పరిచయం చేస్తున్నాం. నవంబర్ తొలివారం నుంచి హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ నిర్వహిస్తాం’’ అని తెలిపారు.