మూడు తరాల అనుబంధం
కుటుంబమంటే ఒక ఇల్లు కాదు... ఒక ఊరు కాదు... వ్యవస్థ అని తెలిపే సందేశాత్మక కథాంశంతో ఓ చిత్రం రూపొందుతోంది. పి.సి. ఆదిత్య దర్శకుడు. శ్రీఅమ్మా ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బి.రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో జరిగిన పూజాకార్యక్రమంతో ఈ చిత్రం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆదిత్య మాట్లాడుతూ -‘‘కుటుంబాలలో అడుగంటిపోతున్న అనుబంధాలు, ఆత్మీయతల్ని ఒక్కసారి గుర్తు చేసే కథాంశమిది. గ్రామీణ వాతావరణంలో కథ సాగుతుంది.
మూడు తరాలకు చెందిన ఈ కుటుంబకథలో తాతగా ఎపిక్యురస్ నాగరాజు నటిస్తుండగా, కొడుకుగా నేనే నటిస్తున్నాను. మనవడిగా కొత్త నటుణ్ని పరిచయం చేస్తున్నాం. నవంబర్ తొలివారం నుంచి హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ నిర్వహిస్తాం’’ అని తెలిపారు.