పచ్చిమోసం
సాఫ్ట్వేర్ ఉద్యోగాలంటూ వేలాది మందికి టోకరా
రూ.30 కోట్ల దాకా వసూలు చేసిన హిందూపురం వాసి
మోసపోయాం.. డబ్బు వెనక్కు ఇప్పించండని బాధితుల వేడుకోలు
దుప్పటి పంచారుుతీతో కాలం వెల్లబుచ్చిన పోలీసులు
జారుకున్న నిందితుడు.. ఆనక కేసు నమోదు
బెంగళూరు/ హిందూపురం అర్బన్ : ‘పిలిచి ఉద్యోగం ఇచ్చాడు.. ట్రైనింగ్ అంటూ ఒక నెల జీతమూ ఇచ్చాడు. పేరున్న కంపెనీ.. పర్మినెంట్ అవుతే జీవితంలో సెటిల్ అవుతామని భావించాము.. అప్పు సప్పు చేసి ఒక్కొక్కరం రూ.లక్షన్నర చెల్లించాం.. ఉన్నట్లుండి బోర్డు తిప్పేశాడు.. డబ్బులివ్వమని నిలదీస్తే ఇదిగో అదిగో అంటూ కాలం గడిపాడు.. వారం పది రోజులుగా బెంగళూరు, హిందూపురం తిరుగుతున్నాం.. పోలీసులు అప్పుడే అంజాద్ పర్వేజ్‌ను పట్టుకుని నాలుగు దులిపి ఉంటే కొంత మందికైనా న్యాయం జరిగేది.. ఇపుడు అతగాడు ఏ దేశం పారిపోయూడో ఎవరికెరుక?’ అంటూ నిరుద్యోగులు వాపోతున్నారు.
అనంతపురం జిల్లా హిందూపురం పట్టణానికి చెందిన షేక్ అంజాద్ పర్వేజ్ యాహూ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తూ.. ఉద్యోగాల పేరిట దాదాపు వెయ్యి నుంచి రెండు వేల మంది నిరుద్యోగ యువతీ యువకులను మోసం చేసి సుమారు రూ.30 కోట్లు దుండుకున్న వైనంపై బాధితుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. చేసేది లేక పోలీసులను నమ్ముకుని న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు.
కర్నూలుకు చెందిన జగదీశ్వరరెడ్డి, హైదరాబాద్‌కు చెందిన కృష్ణజీ, ఛత్తీస్‌ఘడ్ వాసి మయాంక్పాండే శుక్రవారం హిందూపురం వన్‌టౌన్ సీఐ మురళీకృష్ణకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఁరెడోలెంట్ సిస్టమ్* అనే కంపెనీ ద్వారా పర్వేజ్ ఈ తతంగం నడిపించాడు. హిందూపురం బోయపేట నివాసి అయిన అంజాద్ పర్వేజ్‌ను వెతుక్కుంటూ బాధితులు పది రోజుల క్రితం పట్టణానికి చేరుకుని టూటౌన్పోలీసుస్టేషన్ పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. ఈదీనిపై అంజాద్ పర్వేజ్‌ను విచారించిన పోలీసులు పెద్ద మనుషుల పంచాయితీ ద్వారా అక్కడికివచ్చిన బాధితులకు డబ్బు చెల్లించే విధంగా ఒప్పించారని తెలిసింది. కాగా డబ్బు ఇస్తానని చెప్పిన పర్వేజ్ కనిపించకుండా పోవడంతో బాధితులు జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. ఎస్పీ ఆదేశాలతో శుక్రవారం హిందూపురం వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. డబ్బులు ఇచ్చి మోసపోయిన నిరుద్యోగులు పది రోజులుగా స్థానికంగా ఉన్న లాడ్జిలో ఉంటూ పర్వేజ్ కోసం ఆరా తీస్తూ వచ్చారు. తమకు డబ్బు ఇప్పిస్తే చాలని పర్వేజ్ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. చివరకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు. కొంత మంది బాధితులు బెంగళూరులో కూడా పోలీసులను ఆశ్రరుుంచినా కేసు నమోదు కాలేదు. అటు బెంగళూరు పోలీసులు, ఇటు హిందూపురం పోలీసులు కాలయూపన చేయడంతో నిందితుడు దర్జాగా పారిపోయూడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెడ్‌కార్నర్ నోటీస్ జారీ చేస్తాం
నిరుద్యోగులను మోసం చేసి డబ్బు కాజేసిన అంజాద్ పర్వేజ్ దేశం విడిచి పారిపోకుండా పాస్‌పోర్టు రెడ్‌కార్నర్ నోటీస్ జారీ చేస్తామని వన్‌టౌన్ సీఐ మురళీకృష్ణ అన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు. పర్వేజ్ కోసం గాలింపు చేపడుతామన్నారు. కాగా, అంజాద్ ఇప్పటికే దేశం విడిచి పారిపోరుు ఉంటే తమ పరిస్థితి ఏమిటని నిరుద్యోగులు వాపోతున్నారు.