కల్తీకారం వ్యాపారిపై పీడీయాక్ట్
ఖమ్మం: కల్తీ కారం కేసులో ఓ వ్యక్తి పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఖమ్మం పట్టణానికి చెందిన కల్తీ కారం వ్యాపారి పటోరి చైతన్యపై త్రీటౌన్ పోలీసులు గురువారం పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి వరంగల్ జిల్లా కారాగారానికి తరలించారు. దీంతో కల్తీకారం కేసులో పీడీ యాక్ట్ కింద నమోదైన కేసులు మూడుకు చేరాయి. గత కొంతకాలంగా జిల్లాలో కల్తీకారం దందాలు కొనసాగుతున్నాయి. కల్తీకారం ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు దృష్టి సారించారు.