Advanced supplementary examination
-
24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
సాక్షి, అమరావతి: పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు నిర్వహించబోతున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ వెల్లడించారు. ఈ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకోవాలని సోమవారం వర్చువల్ మీటింగ్‌లో జిల్లా విద్యాశాఖాధికారులను ఆయన ఆదేశించారు. ఈ పరీక్షల కోసం 1,61,877 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వారిలో 96,938 మంది బాలురు, 64,939 మంది బాలికలున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 685 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసామన్నారు.పరీక్షల నిర్వహణ కోసం 685 మంది చీఫ్ సూపరింటెండెంట్స్, 685 మంది డిపార్టుమెంటల్ ఆఫీసర్లు, 6,900 మంది ఇన్విజిలేటర్లతో పాటు 86 ఫ్లైయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశామన్నారు. మొబైల్ పోలీస్ స్క్వాడ్స్ కూడా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆర్టీసీ డిపో మేనేజర్లతో చర్చించి పరీక్షా కేంద్రాలకు తగినన్ని బస్సు సర్వీసులు నడిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ కేంద్రంలో ఏఎన్ఎంతో పాటు ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఉండేలా చూడాలని సూచించారు.ప్రతిరోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరిగే ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు 8.45 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి వెబ్సైట్ ద్వారా హాల్‌టికెట్స్ జారీ చేస్తామని చెప్పారు. మాల్ ప్రాక్టీసెస్‌కు పాల్పడితే ఏపీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్టు 1997 కింద చర్యలు తీసుకుంటామని తెలిపారు. 0866–2974540 లేదా, dir-govexmas@yahoo.com లో సంప్రదించాలన్నారు.పరీక్షల నిర్వహణ తేదీలిలా..ఫస్ట్ లాంగ్వేజ్ 24–05–24సెకండ్ లాంగ్వేజ్ 25–05–24థర్డ్ లాంగ్వేజ్ 27–05–24మాథమెటిక్స్ 28–05–24ఫిజికల్ సైన్స్ 29–05–24బయోలాజికల్ సైన్స్ 30–05–24సోషల్ స్టడీస్ 31–05–24ఓఎస్ఎస్సీ పేపర్–1 01–06–24ఓఎస్ఎస్సీ పేపర్–2 03–06–24 -
ఇంటర్ ‘అడ్వాన్స్డ్’కు సర్వం సిద్ధం
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈనెల 24 నుంచి జరగనున్న ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్ఐవో గర్నెపూడి సునీత చెప్పారు. సాంబశివపేటలోని కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 100 పరీక్ష కేంద్రాల పరిధిలో 49,771 మంది విద్యార్థులు హాజరు కానున్నారని చెప్పారు. వీరిలో ప్రథమ సంవత్సరం 36,173, ద్వితీయ సంవత్సరం 13,598 మంది ఉన్నారని వివరించారు. గుంటూరు జిల్లా పరిధిలోని 54 కేంద్రాల్లో 28,149, పల్నాడు జిల్లాలోని 34 కేంద్రాల పరిధిలో 16,631, బాపట్ల జిల్లాలోని 12 కేంద్రాల్లో 4,991 మంది చొప్పున హాజరు కానున్నట్లు తెలిపారు. జూన్ 2న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, 3న జరగనున్న ఎన్విరాన్మెంటల్ పరీక్షలకు గతంలో తప్పిన, గైర్హాజరైన ఫస్టియర్ విద్యార్థులు విధిగా హాజరుకావాలని ఆమె స్పష్టం చేశారు. ఇంటర్ పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థుల సహా విధుల్లో ఉన్న ఏ ఒక్కరికీ సెల్ఫోన్లతో వచ్చేందుకు అనుమతి లేదని చెప్పారు. పరీక్షల విధుల్లో ఉన్న అధికారులతో పాటు చీఫ్ సూపరింటెండెంట్లు, శాఖాధికారులు, ఇన్విజిలేటర్ల వద్ద సెల్ఫోన్లు ఉండేందుకు అనుమతి లేదన్నారు. సమావేశంలో డీఈసీ సభ్యులు జి. బాలమోహన్‌రావు, పి.సుధాకర్, పాండురంగారావు పాల్గొన్నారు. ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో... ► ప్రథమ సంవత్సర పరీక్షలు ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సర పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు నిర్వహిస్తారు. ► విద్యార్థులు నిర్దేశిత సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. ఆలస్యంగా వచ్చే వారిని అనుమతించరు. ► విద్యార్థులు హాల్ టికెట్, ప్యాడ్, పెన్ను మరే ఇతర సామగ్రి వెంట తీసుకు రాకూడదు. ప్రత్యక్ష నిఘా .. విస్తృత తనిఖీలు ► ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 100 పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ►ఇంటర్‌బోర్డు నుంచి ఉన్నతాధికారులు లైవ్ స్ట్రీమింగ్ విధానంలో ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. ► పరీక్ష కేంద్రాల్లో మాల్ ప్రాక్టీసుల నిరోధానికి బోర్డు నుంచి ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలతో పాటు మూడు జిల్లాల కలెక్టర్ల సారథ్యంలో తహసీల్దార్లతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు విస్తృత తనిఖీలు నిర్వహిస్తాయి. ► సమస్యలు, సందేహాల పరిష్కారానికి గుంటూరు ఆర్ఐవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ (0863–2228528) ఏర్పాటు 60 శాతం బెటర్మెంట్ విద్యార్థులే.. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థుల్లో ఫస్టియర్ విద్యార్థులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏకంగా 36,173 మంది దరఖాస్తు చేయగా, వీరిలో పరీక్షల్లో తప్పిన విద్యార్థుల కంటే అధిక మార్కుల కోసం బెటర్మెంట్ రాస్తున్న వారు 60 శాతం మంది ఉండటం గమనార్హం. -
జూన్ 18 నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
హైదరాబాద్: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్‌ను ప్రభు త్వ పరీక్షల విభాగం మంగళవారం విడుదల చేసింది. ఈ పరీక్షలను వచే ్చ నెల 18 నుం చి జూలై 2వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల విభా గం డెరైక్టర్ శేషుకుమారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30లోగా ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ.50 ఆలస్యరుసుము తో పరీక్షకు రెండు రోజుల ముందు వరకు కూడా ఫీజులను సంబంధిత ప్రధానోపాధ్యాయునికి చెల్లించి హాల్ టికెట్ పొందవచ్చని వెల్లడించారు. రోజూ ఉదయం 9:30 నుంచి మధాహ్నం 12:15 గంటల వరకు పరీక్షలు ఉంటాయని, ద్వితీయభాష పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు ఉంటుందన్నారు. పాత సిలబస్వారికి ఉద యం 9:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్ష ఉంటుందని చెప్పారు. -
మే 25 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
హైదరాబాద్: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను వచ్చే నెల 25 నుంచి జూన్ 1 వరకు నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు షెడ్యూల్ ప్రకటించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సర పరీక్షలను, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ద్వితీయ సంవత్సర పరీక్షలను నిర్వహిస్తారు. అలాగే ప్రాక్టికల్స్ జూన్ 4 నుంచి 7వ తేదీ వరకు జరుగుతాయి. విద్యార్థులు మే 1లోగా దరఖాస్తు చేసుకుని, పరీక్ష ఫీజు చెల్లించాలని, ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించే అవకాశం లేదని స్పష్టం చేసింది. వొకేషనల్ కోర్సుల కు సంబంధించిన మొదటి సంవత్సరం పరీక్షలు రాయాల్సిన పాత విద్యార్థులు ఈ ఒక్కసారికి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావచ్చని తెలిపింది. అన్ని సబ్జెక్టులు పాస్ అయిన విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ కోసం ఈ పరీక్షలు రాయవచ్చు. జనరల్ కోర్సులకు సాధారణ ఫీజు రూ. 300, వొకేషనల్ కోర్సులైతే రూ. 400తోపాటు ఒక్కో సబ్జెక్టుకు అదనంగా రూ. 100 చొప్పున చెల్లించాలని బోర్డు పేర్కొంది. కాగా, విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం మే 1లోగా ఫీజు చెల్లించాలి. రీ కౌంటింగ్‌కు ఒక్కో పేపరుకు రూ. 100, రీవెరిఫికేషన్ కమ్ జవాబుపత్రాల జిరాక్స్ కాపీ పొందేందుకు ఒక్కో సబ్జెక్టుకు రూ.600 చొప్పున చెల్లించాలి. మీసేవా కేంద్రాలు, ఏపీ ఆన్లైన్ కేంద్రాల్లో పరీక్ష ఫీజులను చెల్లించవచ్చు. ఎథిక్స్, మానవీయ విలువలపై పరీక్షను జూన్ 8న, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను జూన్ 9న నిర్వస్తారు. వొకేషనల్ విద్యార్థులకూ ఇదే షెడ్యూల్ వర్తిస్తుంది.