aeroplane services
-
Vijayawada: గల్ఫ్ సర్వీసులకు డిమాండ్ ఫుల్
విమానాశ్రయం(గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం) నుంచి గల్ఫ్ దేశాలకు నడుపుతున్న విమాన సర్వీస్‌లకు ఆదరణ పెరుగుతోంది. నాలుగేళ్ల క్రితం అంతర్జాతీయ విమానాశ్రయ హోదాను పొందిన ఈ ఎయిర్పోర్ట్ నుంచి విదేశాలకు రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అందుకు తగ్గట్లుగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థ సర్వీస్‌లను కూడా విస్తరిస్తోంది. గతంలో గల్ఫ్ దేశాలకు రాకపోకలు సాగించేందుకు ఈ ప్రాంత ప్రయాణికులు పొరుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, చెన్నై, బెంగళూరు విమానాశ్రయాలపై ఆధారపడాల్సి వచ్చేది ఇప్పుడు విజయవాడ విమానాశ్రయం నుంచి షార్జా, మస్కట్, కువైట్‌కు డైరెక్ట్ విమాన సరీ్వస్‌లు అందుబాటులోకి రావడంతో సమయం, డబ్బు ఆదా అవుతున్నాయని ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రెండు నుంచి ఐదు సర్వీస్‌లకు.. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా 2018 ఆగస్టు 1న విజయవాడ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ హోదా కల్పించింది. అదే ఏడాది డిసెంబర్ నుంచి తొమ్మిది నెలలపాటు సింగపూర్–విజయవాడ మధ్య వారానికి రెండు విమాన సర్వీస్‌లు నడిచాయి. ఆ తర్వాత దుబాయ్, అబుదాబికి సర్వీస్‌లు నడపాలని భావించినా కోవిడ్ వల్ల సాధ్యం కాలేదు. అప్పట్లో కోవిడ్ వల్ల విదేశాల్లో చిక్కుకుపోయిన వేలాది మంది తెలుగు వారిని ప్రత్యేక విమానాల్లో తీసుకురావడంలో ఈ ఎయిర్పోర్ట్ కీలకంగా నిలిచింది. కోవిడ్ తగ్గిన తర్వాత తెలుగువారు ఎక్కువగా ఉండే కువైట్, మస్కట్, యూఏఈలోని షార్జా నుంచి విజయవాడకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఐదు సర్వీస్‌లను నడుపుతోంది. వీటిలో షార్జా–విజయవాడ మధ్య వారానికి రెండు సర్వీస్‌లు, మస్కట్‌కు ఒక సర్వీస్‌ను నడుపుతుంది. కువైట్, మస్కట్ నుంచి వారంలో ఒక్కొక్క సర్వీస్‌లు ఇక్కడికి వస్తున్నాయి. ఈ సర్వీసుల్లో నెలకు 4వేల మంది వరకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. షార్జా సర్వీస్‌కు విశేష స్పందన.. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీ నుంచి షార్జా–విజయవాడ మధ్య ప్రారంభమైన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వారానికి రెండు రోజులపాటు 186 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగిన 737–800 బోయింగ్ విమానాన్ని నడుపుతున్నారు. ఈ విమానం షార్జా నుంచి వంద శాతం ఆక్యుపెన్సీతో విజయవాడకు నడుస్తోంది. ఇక్కడి నుంచి షార్జాకు 70శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. ఈ సర్వీస్ యూఏఈలోని షార్జాతోపాటు దుబాయి, అబుదాబికి రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంది. దీనివల్ల యూఏఈ నుంచి యూరప్, ఆఫ్రికా దేశాలకు వెళ్లేందుకు సులువైన కనెక్టివిటీ సదుపాయం కూడా ఉంది. ప్రయాణికుల ఆదరణకు అనుగుణంగా భవిష్యత్‌లో షార్జా–విజయవాడ మధ్య వారానికి నాలుగు నుంచి ఏడు సర్వీస్‌లకు పెంచేందుకు కూడా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సిద్ధంగా ఉంది. రానున్న రోజుల్లో సింగపూర్, మలేషియా, శ్రీలంక, దుబాయికి సర్వీస్‌లు నడపాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఎయిర్పోర్ట్ అధికారులు పౌరవిమానయాన శాఖకు విజ్ఞప్తి చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో నూతనంగా నిరి్మస్తున్న అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ అందుబాటులోకి వస్తే మరిన్ని అంతర్జాతీయ విమాన సర్వీస్‌లు నడిచే అవకాశం ఉంటుంది. -
స్పైస్‌జెట్‌కు షాక్.. ఆంక్షలు విధించిన డీజీసీఏ
సాక్షి,న్యూఢిల్లీ: స్పైస్‌జెట్ విమానాలపై డీజీసీఏ ఆంక్షలు విధించింది. అనుమతి పొందిన విమానాల్లో 50శాతమే నడపాలని తెలిపింది. 8 వారాల పాటు ఈ ఆదేశాలను పాటించాలని పేర్కొంది. స్పైస్‌జెట్ విమానాల్లో ఇటీవల తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు జులై 9 నుంచి 13 మధ్య స్పైస్‌జెట్‌కు చెందిన 48 విమానాల్లో 53 స్పాట్ చెక్‌లు నిర్వహించింది డీజీసీఏ. భద్రత ప్రమాణాలకు సంబంధించి ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని తెలిపింది. నోటీసులు పంపిన మూడు రోజుల్లోనే స్పాట్ చెక్‌లు చేసింది. అయితే ఇటీవలి కాలంలో స్పైస్‌జెట్ విమానాల్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. 18 రోజుల్లోనే 8 సార్లు ఈ సంస్థకు చెందిన విమానాల్లో టెక్నికల్ సమస్యలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే డీజీసీఏ స్పైస్‌జెట్‌కు జులై 6న నోటీసులు పంపింది. అంతర్గత భద్రతా పర్యవేక్షణ తక్కువగా ఉండటం, నిర్వహణ చర్యలు లేకపోవడం వల్లే ఈ సమస్యలు తలెత్తినట్లు పేర్కొంది. చదవండి: దీనికి కూడా ఫైన్ వేస్తారా? రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లో పెట్రోల్ లేదని చలాన్ -
స్పైస్‌జెట్‌పై కొరడా ఝుళిపించిన DGCA
-
మెడికల్ టూరిజానికి హబ్‌గా మారిన హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: మెడికల్ టూరిజానికి ప్రధాన హబ్‌గా మారిన హైదరాబాద్ నుంచి ఢాకా, బాగ్దాద్ నగరాలకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఆయా నగరాల నుంచి సిటీకి ఎక్కువగా రోగులు వస్తుండటంతో మెడికల్ టూరిస్టుల డిమాండ్, ఆస్పత్రుల విజ్ఞప్తి మేరకు విమానాలు నడిపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 15 నుంచి ఢాకాకు సర్వీసులు ప్రారంభం కానుండగా త్వరలో బాగ్దాద్‌కు కూడా మొదలుకానున్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు మీదుగా.. ప్రస్తుతం బంగ్లాదేశ్, ఇరాక్ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు వైద్య చికిత్సల కోసం నగరానికి వస్తున్నారు. నేరుగా నగరానికి చేరుకునే సదుపాయం లేక ఢిల్లీ, ముంబై, బెంగళూరు మీదుగా చేరుకుంటున్నారు. దీంతో రోగులు, వారి బంధువులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను విమానయాన సంస్థలు, జీఎమ్మార్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పలు కార్పొరేట్ ఆస్పత్రులు వివరించాయి. దీంతో బాగ్దాద్, ఢాకా నుంచి హైదరాబాద్‌కు నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించేందుకు ఎయిర్‌పోర్టు అధికారులు చర్యలు చేపట్టారు. చికిత్సలకు తక్కువ ఖర్చు అవుతుండటంతో.. ఒక్క ఢాకా నుంచే రోజూ 100 మందికి పైగా రోగులు హైదరాబాద్‌లోని పలు కార్పొరేట్ ఆస్పత్రులకు వస్తున్నారు. బాగ్దాద్ నుంచి కూడా దాదాపు ఇదే స్థాయిలో రోగుల తాకిడి ఉంది. గుండె జబ్బులు, కాలేయ సంబంధిత వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులకు అమెరికా, యూరోప్ దేశాల కంటే తక్కువ ఖర్చులతో నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందిస్తుండటంతో చాలా మంది నగరంలో పేరొందిన ఆస్పత్రులకు వస్తున్నారు. దీంతో హైదరాబాద్ మెడికల్ టూరిజానికి కేంద్రబిందువుగా మారింది. నగరానికి ఏటా 50 వేల మంది విదేశీ రోగులు వైద్య చికిత్సల కోసం ఏటా సుమారు 2 లక్షల మంది విదేశీ రోగులు దేశంలోని పలు ఆస్పత్రులకు వస్తారు. వీరిలో 50 వేల మందికి పైగా హైదరాబాద్‌కే వస్తున్నట్టు అంచనా. కరోనా వల్ల రెండేళ్లుగా రాకపోకలు నిలిచిపోగా ప్రస్తుతం పలు దేశాలకు విమాన సర్వీసులు తిరిగి మొదలవడంతో రోగుల తాకిడి కూడా మొదలైంది. ఆఫ్రికా, ఇథియోపియా, నైజీరియా, ఒమన్, ఖతర్, కంబోడియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్, ఇరాక్, మస్కట్, దోహ, సౌదీ, సూడాన్, సింగపూర్, ఇండోనేషియా, థాయ్‌లాండ్, మాల్దీవులు తదితర దేశాల నుంచి రోగులు ఎక్కువగా నగరానికి వస్తారు. కొద్ది రోజులుగా ఢాకా, బాగ్దాద్‌ల నుంచి వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. (చదవండి: స్కిల్, అప్‌స్కిల్, రీ–స్కిల్ ) -
కొత్త కరోనా భయంతో మళ్లీ ఆంక్షలు
31వరకు నిషేధం హమ్మయ్య... కరోనాకు వ్యాక్సిన్ వచ్చేస్తోంది. మాస్క్ కాస్త పక్కకు పెట్టి ఊపిరిపీల్చుకోవచ్చు.. అనుకునేలోపే.. బ్రిటన్‌లో కొత్త రకం వైరస్ పుట్టుకొచ్చింది. కరోనా కంటే వేగంగా దూసుకొస్తోంది. ఊపిరిపీల్చుకుంటున్న ప్రపంచ దేశాలను ఈ వైరస్ ఉలిక్కిపడేలా చేసింది. బ్రిటన్‌లో మొదట గుర్తించిన ఈ ‘వీయూఐ 202012/1’ వైరస్ ఇప్పటికే డెన్మార్క్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, బెల్జియం, ఇటలీ దేశాల్లోనూ అడుగుపెట్టింది. దీంతో పలు దేశాలు యూకే నుంచి రాకపోకలను నిషేధించాయి. బ్రిటన్‌లో కొత్త వైరస్ నేపథ్యంలో భారత్ బుధవారం నుంచి డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు యూకే నుంచి అన్ని విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. మంగళవారం అర్ధరాత్రిలోపు వచ్చినవారికి ఆర్టీపీసీఆర్ పరీక్ష చేస్తామని, ఆ టెస్ట్‌లో ఎవరైనా కోవిడ్ పాజిటివ్‌గా తేలితే వారిని క్వారంటైన్‌కు పంపిస్తామని ప్రకటించింది. బ్రిటన్ నుంచి వేరే దేశం వచ్చి, అక్కడి నుంచి భారత్ రావాలనుకుంటున్న ప్రయాణికులను కూడా అడ్డుకోవాలని డీజీసీఏ ఆదేశించింది. ►కొత్త తరహా వైరస్‌పై కేంద్రం అప్రమత్తంగా ఉంది. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – కేంద్ర మంత్రి హర్షవర్ధన్ నిమిషానికి 1,850 కోట్లు నష్టం సూచీల మూడుశాతం పతనంతో ఇన్వెస్టర్ల సంపద హారతిలా కరిగిపోయింది. ట్రేడింగ్‌లో వారికి ప్రతి నిమిషానికి రూ.1,850 కోట్ల నష్టం వాటిల్లింది. ఒక్కరోజులోనే ఇన్వెస్టర్లు రూ.6.89 లక్షల కోట్లను కోల్పోయారు. ఇన్వెస్టర్ల సంపదగా భావించే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.1.78 లక్షల కోట్లకు దిగివచ్చింది. రాష్ట్రంలో అలర్ట్ బ్రిటన్‌లో కరోనా తీవ్రరూపం దాల్చడంతో రాష్ట్రం అప్రమత్తమైంది. అక్కడి నుంచి వచ్చే ప్రయాణికులకు క్షుణ్ణంగా పరీక్షలు చేసిన తర్వాతే పంపాలనినిర్ణయించింది. -
హైదరాబాద్ నుంచి యూకేకు విమాన సర్వీసులు
హైదరాబాద్: ఇతర దేశాలతో విమాన ప్రయాణ సౌకర్యాలు తిరిగి ప్రారంభించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఆగస్టు 17 నుంచి భారత, యూకే ప్రభుత్వాల మధ్య కుదిరిన ‘ఎయిర్ ట్రాన్స్పోర్ట్ బబుల్ ఒప్పందం ప్రకారం జీఎమ్ఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ హీత్రో విమానాశ్రయానికి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో కోలుకుంటున్న పౌర విమాన రంగానికి ఈ చర్య ఎంతో ఊతమిస్తుంది. హైదరాబాద్, లండన్ మధ్య తిరిగి సర్వీసులను ప్రారంభిస్తూ హైదరాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌లోని హీత్రో విమానాశ్రయానికి సోమవారం ఉదయం 7.50 గంటలకు బ్రిటిష్ ఎయిర్వేస్కు చెందిన (బీఏ 276) బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ విమానాశ్రయం బయలుదేరింది. టెర్మినల్లోనికి ప్రవేశించడానికి ముందే ప్రయాణికులందరికీ తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్, సామాజిక దూరం నిబంధనలు సహా అన్ని భద్రతాపరమైన చర్యలనూ తీసుకున్నారు. కాగా యూకేకు చెందిన బ్రిటిష్ ఎయిర్వేస్ విమాన సర్వీసులు నేటి నుంచి ప్రతి వారం నాలుగు సర్వీసులను నిర్వహిస్తుంది. ఇవి ప్రతి సోమ, బుధ, శుక్ర, ఆదివారాలలో ఉంటాయి. భారత ప్రభుత్వ హోమ్ వ్యవహారాల శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏ ప్రయాణికుడైనా హైదరాబాద్ నుంచి లండన్‌కు టికెట్టును బుక్ చేసుకోవచ్చు. హైదరాబాద్, లండన్ల మధ్య తిరిగి సర్వీసులు ప్రారంభం కావడం వల్ల ప్రజలను, సరుకులను ఒక చోటి నుంచి మరో చోటికి తరలించడం జరిగి ఆర్థిక, సామాజిక సంబంధాల పునరుద్ధరణకు అవకాశం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. కోవిడ్ మహమ్మారి కారణంగా దెబ్బ తిన్న ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టడానికి భారత ప్రభుత్వం అన్‌లాక్ 3.0 సందర్భంగా, వివిధ దేశాలతో ‘‘ట్రాన్స్పోర్ట్ బబుల్స్, ‘‘వాయు రవాణా ఒప్పందాలు అనే తాత్కాలిక ఏర్పాట్లకు అనుమతించింది. దీని కింద ఏవైనా రెండు దేశాలు కోవిడ్-19 మహమ్మారి కారణంగా రద్దైన సర్వీసులను పున: ప్రారంభించుకోవచ్చు. మే 25న హైదరాబాద్ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు పున:ప్రారంభమైన నాటి నుంచి జీఎమ్ఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం సురక్షితమైన ప్రయాణం కొరకు డిపార్చర్ ర్యాంప్ నుంచి బోర్డింగ్ గేటు వరకు పూర్తి శానిటైజ్ చేయబడిన కాంటాక్ట్-లెస్తో ప్రయాణికుల బధ్రతకు భరోసా కల్పిస్తుంది. -
చరిత్రలో మరో ఘట్టం.. ఫలించిన ఎంపీ ప్రయత్నాలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ విమానయాన చరిత్రలో మరో గొప్ప ఘట్టం మొదలుకాబోతోంది. విశాఖ నుంచి కార్గో విమానం రాకపోకలు సాగించడానికి ఎట్టకేలకు రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. విశాఖ నుంచి ఈనెల 25 నాడు తొలిసారిగా కార్గో విమానం నడపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలిసారిగా విశాఖ నుంచి కార్గో విమానాలు చెన్నై, కోల్‌కొతా, సూరత్ తదితర ప్రాంతాలకు నడపడానికి స్పైస్ జెట్ సంసిద్ధత వ్యక్తం చేసింది. మరోవైపు ఆ సంస్థ కార్గో విమానాలు కొనసాగించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ముందుగా అనుకున్న ప్రకారం ఈనెల 15 నుంచి కార్గో విమానాలు విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు నడవవలసి ఉంది. కాని రక్షణ శాఖ మోకాలడ్డడంతో కార్గో విమాన సర్వీసుల ప్రతిపాదనకు ఆటంకం ఎదురైంది. విశాఖ నుంచి కార్గో విమాన సర్వీసులు ప్రారంభం కావాలని కొంతమంది వ్యాపారులు ఎప్పటినుంచో కోరుతున్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ విమాన ప్రయాణికుల సంఘం వివిధ విమాన సంస్థల ప్రతినిధులతో చర్చించి ఒప్పించింది. అందులో భాగంగా ఈనెల 15 నుంచి స్పైస్ జెట్ ఆధ్వర్యంలో కార్గో విమానాల సర్వీసుల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. అయితే విశాఖలోని రక్షణ శాఖ అధికారుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. దీంతో కార్గో విమాన సర్వీసుకు బ్రేక్ పడింది. దాంతో కార్గో సర్వీసుల నిర్వహణపై స్పైస్ జెట్ సంస్థ రక్షణశాఖ అధికారులకు లేఖ లేఖ రాసింది. స్పైస్ జెట్ కోరిన సమయాలను కేటాయించలేమని రక్షణ శాఖ అధికారులు స్పైస్ జెట్‌కు లేఖ రాసినట్టు విమాన ప్రయాణికుల సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈనెల 21న “సాక్షి’ పత్రికలో కార్గో సర్వీసుల ప్రతిపాదన నిలిచిపోయినట్టు వార్త వచ్చింది. దాంతో సమస్యను సంఘ ప్రతినిధులు కొందరు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ దృష్టికి తీసుకొని వెళ్లారు. కల నిజమాయెగా.. ప్రస్తుతం కార్గో విమానాలు లేక వ్యాపారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు ,రైల్వే రవాణా ద్వారా సరకులు నడుపుతున్నారు. కార్గో విమానాల కోసం ఫార్మాకంపెనీల దృష్టీ కేంద్రీకృతమైంది. కార్గో విమానాల రాకపోకల వల్ల ఆదాయం పెరుగుతుందని, దేశంలో ఇతర ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి సరకులు విశాఖకు తరలివచ్చే వీలుందన్న వాస్తవం కనిపిస్తోంది. విదేశీ మారక ద్రవ్యం కూడ వచ్చేఅవకాశం ఉందని, కార్గో విమానాల వల్ల ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెబుతున్నారు. విశాఖ కార్యనిర్వాహక రాజధాని కాబోతున్న నేపథ్యంలో ఇలాంటి కార్గో విమానాలు రావాల్సిన అవసరం వుందని చెబుతున్నారు.. కాని ప్రయాణికుల సంఘం ప్రతినిధులు కె.కుమార్ రాజా, డి.ఎస్.వర్మ, ఒ.నరేష్కుమార్ పట్టువదలని విక్రమార్కుడి స్పూర్తితో అంతా కృషి చేశారు. ఈ విమానం నడపడానికి సహకారం అందించిన విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు ఇతర విమాన సంస్థలకు నరేష్కుమార్ కృతజ్ఙతలు తెలిపారు. ఫలించిన ఎంపీ ప్రయత్నం విశాఖ నుంచి దేశంలో వివిధ ప్రాంతాలకు కార్గో విమానాలు నడపాలని విశాఖ ఎంపీగా ఎన్నికైన తర్వాత ఎంవివి సత్యనారాయణ కేంద్ర రక్షణ శాఖ మంత్రికి గతంలో లేఖ రాశారు. అనంతరం కేంద్రమంత్రులను ఆయన కలిసి విమానాల కోసం చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం విశాఖ కేంద్రంగా కార్యనిర్వహక రాజధాని ఏర్పాట్లు చేయడానికి పలు చర్యలు చేపట్టిందని, అలాగే దేశంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో ఎయిర్ ట్రాఫిక్ 50 శాతం మేర పెరిగే అవకాశం ఉందని తెలిపారు. నిర్దేశించిన సమయాల్లో తప్ప ఇతర సమయాల్లో విమానాలు రాకపోకలకు రక్షణ శాఖ అభ్యంతరం చెబుతుందని, దీనివల్ల అనేక విమాన సంస్ధలు సర్వీసులు నడపడానికి ఆసక్తి చూపడం లేదని ఎంపి లేఖలో పేర్కొన్నారు. సమాంతర టాక్సీ ట్రాక్ నిర్మించడానికి చర్యలు తీసుకోవాలని,అలాగే కొత్తగా నిర్మించిన ఎన్5 టాక్సీ ట్రాక్‌ను అందుబాటులోకి తేవాలనికోరారు. ఇవీ వేళలు కార్గో విమానాలు విశాఖ నుంచి దేశంలో ముఖ్యమైన పట్టాణాలకు నడుపుతున్నారు. చెన్నై, కోల్‌కతా, సూరత్ తదితర ప్రాంతాలకు ఈనెల 25 నుంచి నడుపుతున్నారు. రోజు తప్పించి రోజు ఈ విమానాలు నడపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 11.50 గంటలకు విశాఖ వచ్చే విమానం, విశాఖ నుంచి మధ్యాహ్నం 1.10 గంటలకు బయలు దేరుతుంది. చెన్నై–వైజాగ్– కోల్‌కతా ఒక రూటు, చెన్నై– విశాఖ–సూరత్‌కు విమానాలు నడుపుతున్నట్టు సంఘం ప్రతినిధి నరేష్కుమార్ తెలిపారు. -
చలో.. చలో!
నల్లగొండ టు ఊటి, కేరళలోని మున్నార్, ముంబయి, హైదరాబాద్ .. ఏమిటీ ఏదో టూర్ గైడెన్స్ అనుకుంటు న్నారా.. కాదండోయ్.. మన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తరలివెళ్లిన క్యాంపు ప్రాంతాలు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రజాప్రతినిధులు చేయి జారకుండా ఉండేందుకు పార్టీలు క్యాంపులు నిర్వహిస్తున్నాయి. ఈ మేరకు వారిని వేర్వేరు గుంపులుగా తయారు చేసి ఒక్కో ప్రాంతానికి తరలిస్తున్నాయి. కొందరు గురువారం రాత్రి వెళ్లగా మరికొందరు శుక్రవారం క్యాంపులకు తరలివెళ్లారు. సాక్షిప్రతినిధి, నల్లగొండ : చిన్నపామునైనా .. పెద్ద కర్రతో కొట్టాలన్న తరహాలో అధికార టీఆర్ఎస్ నాయకత్వం వ్యవహరిస్తోంది. నల్ల గొండ స్థానిక సంస్థల మండలి స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈసారి కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న ఆ పార్టీ నాయకత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోంది. మెజారిటీ సభ్యులు తమ పార్టీలోనే ఉన్నా.. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని ముందస్తు జాగ్రత్తలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను, మున్సిపల్ కౌన్సిలర్లను రాష్ట్ర సరిహద్దులు దాటిస్తోంది. ఈనెల 31వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. అప్పటివరకు వారందరినీ రాష్ట్రం వెలుపల వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యాంపులకు తరలిస్తోంది. శుక్రవారంనుంచి ఆ పని మొదలు పెట్టింది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వివిధ ప్రాంతాలకు తరలివెళ్లారు. 2015 డిసెంబర్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. క్యాంపులు నిర్వహించినా క్రాస్ ఓటింగ్ వల్ల కాంగ్రెస్ 193 ఓట్ల మెజారిటీతో గెలిచింది. కానీ, అప్పటి పరిస్థితులకు, ఇప్పటి పరిస్థితుల మధ్య చాలా తేడా ఉంది. కాంగ్రెస్‌నుంచి గెలిచిన పలువురు ఇప్పుడు టీఆర్ఎస్లోనే ఉన్నారు. అయినా.. ఈసారి గెలిచి తీరాలన్న వ్యూహంతో గులాబీ నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో తలపడిన తేరా చిన్నపరెడ్డి ఈ సారి కూడా టీఆర్ఎస్నుంచి రంగంలో ఉన్నారు. చిన్నపరెడ్డిపై గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా గెలవడంతో అనివార్యమైన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌నుంచి రాజగోపాల్ రెడ్డి భార్య కోమటిరెడ్డి లక్ష్మికి పోటీ చేసే అవకాశం ఇచ్చారు. దీంతో పోటీ రసవత్తరంగా మారింది. వాస్తవానికి ఏ పార్టీ చేతిలో ఎన్ని ఓట్లు ఉన్నాయన్న గణాంకాలు పరిశీలిస్తే.. టీఆర్ఎస్ శిబిరంలోనే ఎక్కువ మంది ఉన్నారు. అయినా.. ఆ పార్టీ ఓట్లను కాపాడుకునేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను గురువారం రాత్రి హైదరాబాద్‌కు తరలించారని సమాచారం. హైదరాబాద్ నుంచి వీరిని శుక్రవారం ప్రైవేటు బస్సుల్లో వేర్వేరు ప్రాంతాలకు తరలించినట్లు తెలిసింది. బయటి నేతలకు క్యాంపుల నిర్వహణ బాధ్యతలు ఈసారి జిల్లా నాయకులతోపాటు మంత్రులు, పార్టీ సీనియర్లకు నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అప్పజెప్పారు. దేవరకొండకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగార్జునసాగర్ నియోజకవర్గానికి కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి, మిర్యాలగూడ నియోజకవర్గానికి ఎంపీ గుత్తాసుఖేందర్ రెడ్డి, మునుగోడుకు మంత్రి నిరంజన్‌రెడ్డి, నకిరేకల్ నియోజకవర్గానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్.. ఇలా... ఒక్కో నియోజకవర్గానికి చెందిన స్థానిక ఎమ్మెల్సీ ఓటర్ల క్యాంపులకు బాధ్యతలు అప్పజెప్పారని పార్టీ వర్గాల సమాచారం. ఎన్నికలకు పద్నాలుగు రోజులు ముందుగానే తమ పార్టీకి చెందిన వారితోపాటు మరికొందరు ఇతరులను కలిపి సుమారు ఏడు వందల మందిని క్యాంపులకు తరలించినట్లు చెబుతున్నారు. అందరినీ ఒకే చోట కాకుండా సభ్యులనూ విడగొట్టి క్యాంపులకు కేటాయించారంటున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను దక్షిణాది రాష్ట్రాలకు, మున్సిపల్ కౌన్సిలర్లను ఉత్తరాది రాష్ట్రాలకు పంపిస్తున్నారని తెలిసింది. గురువారం కొందరు..శుక్రవారం మరికొందరు మిర్యాలగూడ, ఆలేరు నియోజకవర్గాలకు చెందిన ప్రతినిధులను గురువారం రాత్రి, నల్లగొండ, సూర్యాపేట, కోదాడ, తుంగతుర్తి నియోజకవర్గాలకు చెందిన ఓటర్లను శుక్రవారం క్యాంపులు ఏర్పాటు చేసిన ప్రాంతాలకు తరలించినట్లు తెలిసింది. తమిళనాడులోని ఊటి, కేరళలోని మున్నార్ ప్రాంతాల్లో, ముంబయిలో క్యాంపులు పెట్టినట్లు సమాచారం. స్థానిక ఓటర్లు పాత వారే కావడంతో చివరాఖరులో అందివచ్చిన అవకాశంగా భావిస్తున్నారు. గత ఎన్నికల్లో మాదిరిగానే.. ఈ సారి ఓట్లకు రేటు నిర్ణయమైనట్లు ప్రచారం జరుగుతోంది. -
20 ఏళ్లలో దేశవ్యాప్తంగా... 200 చిన్న ఎయిర్ పోర్టులు
రాష్ట్రం నుంచి నాలుగైదు నగరాలు భారత్‌పై విదేశీ సంస్థలు ఆసక్తి హెలిటూరిజంలో అవకాశాలున్నాయి విమానయానశాఖ సంయుక్త కార్యదర్శి అశోక్‌కుమార్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విమాన సర్వీసులను అందించడంపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దృష్టిసారించింది. ఇందుకోసం వచ్చే 20 ఏళ్లలో 200 నగరాల్లో విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఇందులో రాష్ట్రం నుంచి నిజామాబాద్, వరంగల్తోసహా నాలుగైదు విమానాశ్రయాలు ఉంటాయని భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి జి.అశోక్ కుమార్ తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయాల మాదిరిగా కాకుండా చిన్న విమానాలు నడవగలిగేలా తక్కువ వ్యయంతో వీటిని నిర్మిస్తామని చెప్పారు. విజయవాడ, రాజమండ్రి, కడప, రాయచూరు, ఇండోర్ వంటి నగరాల్లో విమానాశ్రయం ఉన్నా సర్వీసులు సరిగా ఉండడం లేదన్నారు. 200 నగరాలకుగాను ఇప్పటికే విమానాశ్రయం ఉంటే విస్తరణ చేపట్టడం, లేదా కొత్తగా ఏర్పాటు చేస్తామని వివరించారు. ఈ నగరాలకు సర్వీసులు నడిపేలా ఆపరేటర్లతో చర్చిస్తామన్నారు. 10-40 మంది ప్రయాణించగలిగే విమానాలు చిన్న నగరాలకు చక్కగా సరిపోతాయి. చిన్న విమానాలు కొనగలిగేవారు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం మెట్రోయేతర నగరాల నుంచి వస్తున్న ఎయిర్ ట్రాఫిక్ 30 శాతముంది. కొన్నేళ్లలో ఇది 45 శాతానికి చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 12-16 తేదీల్లో బేగంపేట విమానాశ్రయంలో జరగనున్న ఏవియేషన్ షో విశేషాలను వెల్లడించేందుకు సోమవారమిక్కడ ఏర్పాటైన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మరిన్ని విదేశీ సంస్థలు..: భారత్‌లో విమాన సర్వీసులను నడిపేందుకు 10-12 విదేశీ సంస్థలు ఇప్పటికే విమానయాన శాఖకు దరఖాస్తు చేసుకున్నాయి. ఈ కంపెనీల వివరాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు. భారత్‌లో ఉన్న సమస్యేమంటే నిర్వహణ వ్యయాలు ఎక్కువ. రూపాయి పతనం ఈ రంగానికి పెద్ద సమస్యగా మారింది. విమాన ఇంధన వ్యయమూ ఎక్కువే. ఇంధనంపై వ్యాట్ ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటోంది. ఇక పోటీ కారణంగా ఆపరేటర్లు విమాన టికెట్ల ధరలు తగ్గించాయి. చిన్న విమానాశ్రయాలు వస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. భారత పౌర విమానయాన రంగం ప్రస్తుతమున్న ప్రపంచ 9వ ర్యాంకు నుంచి 2020 నాటికి 3వ ర్యాంకుకు వెళ్తుందని మం త్రిత్వ శాఖ ఆశిస్తోంది. విమానాల సంఖ్య 400 నుం చి 1,000కి చేరుతుందని అంచనా. మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాలింగ్కు(ఎంఆర్వో) హబ్‌గా భారత్ ను తీర్చిదిద్దాలని భావిస్తోంది. హెలిటూరిజంలో రాష్ట్రంతోసహా దేశవ్యాప్తంగా ఉన్న అవకాశాలను అం దిపుచ్చుకోవడానికి పర్యాటక శాఖతో చర్చిస్తోంది. అంబుడ్స్‌మన్‌కు మరో ఏడాది.. వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటు చేయదలచిన ప్రతిపాదిత ఏవియేషన్ అంబుడ్స్‌మన్ కార్యరూపం దాల్చేందుకు మరో ఏడాది పడుతుందని అశోక్ కుమార్ వెల్లడించారు. నియంత్రణ సంస్థ డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్థానంలో రానున్న సివిల్ ఏవియేషన్ అథారిటీకి ఎక్కువ అధికారాలు ఉంటాయన్నారు. 7-9 మంది సభ్యులతో ఏర్పాటవుతుందని, ద్రవ్య సంబంధ విషయాల్లో స్వతంత్రంగా వ్యవహరిస్తుందని చెప్పారు. ఇక ఏవియేషన్ షోలో భాగంగా ఏరోనాటికల్ విద్యార్థులకు జాబ్ ఫెయిర్తోపాటు ఉద్యోగావకాశాలపై చర్చిస్తారు. 20 దేశాలకు చెందిన 200 స్టాళ్లు ఏర్పాటవుతున్నాయని బేగంపేట విమానాశ్రయ డెరైక్టర్ ఐ.ఎన్.మూర్తి తెలిపారు. ఎయిర్‌బస్ ఏ380 సజావుగా దిగేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. మొత్తం 18 విమానాలు ప్రదర్శనలో ఉంటాయని చెప్పారు. -
ఎయిర్ఏషియా ఇండియా టేకాఫ్‌కు లైన్‌క్లియర్
న్యూఢిల్లీ: దేశీయంగా విమానయాన సర్వీసులు ప్రారంభించేందుకు కీలకమైన ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ)’ లభించినట్లు ఎయిర్ఏషియా ఇండియా తెలిపింది. పౌర విమానయాన శాఖ దీన్ని గత వారమే ఇచ్చిందని, ప్రస్తుతం లాంఛనంగా ఇది వెల్లడిస్తున్నామని కంపెనీ మాతృ సంస్థ ఎయిర్ఏషియా సీఈవో టోనీ ఫెర్నాండెజ్.. సోషల్ నెట్వర్కింగ్ సైటు ట్విటర్లో పేర్కొన్నారు. ఎన్వోసీ చేతికి రావడంతో, సర్వీసులు వేగవంతంగా ప్రారంభించే దిశగా.. షెడ్యూల్డ్ ఆపరేటర్స్ పర్మిట్ (ఫ్లయింగ్ పర్మిట్) పొందేందుకు డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌కి దరఖాస్తు చేసుకోనున్నట్లు ఎయిర్ఏషియా ఇండియా సీఈవో మిట్టు చాండిల్య పేర్కొన్నారు. భారత్‌లో విమానయానాన్ని మరింత అందుబాటు స్థాయిలోకి తెచ్చి, ప్రయాణికులకు ప్రయోజనం చేకూర్చగలమన్నారు. మలేషియన్ సంస్థ ఎయిర్ఏషియా, టాటా గ్రూప్, టెలిస్ట్రా కలిసి ఎయిర్ఏషియా ఇండియాను ఏర్పాటు చేశాయి. ముందుగా చెన్నై, బెంగళూరు, తిరుచిరాపల్లి, కొచ్చి, కోల్‌కతా వంటి నగరాలకు ఎయిర్ఏషియా ఇం డియా సర్వీసులు ప్రారంభించాలని భావిస్తోంది.