చెట్టును ఢీకొని కారు బోల్తా
ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
మంచాల: వేగంగా వస్తూ.. అదుపుతప్పి కారు చెట్టును ఢీకొని బోల్తా పడడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన గురువారం అర్ధరాత్రి మండలంలోని ఆగాపల్లి సమీపంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం రాజు పేట్ తండాకు చెందిన కొర్ర శ్రీను (32), నాంపల్లి మండలం ముర్షపల్లి తండాకు చెందిన బిచ్చు నాయక్ కలిసి గురువారం రాత్రి దేవరకొండ నుంచి (ఏపీ 24 ఏవై 1244) కారులో హైదరాబాద్కు బయలుదేరారు.
అయితే నాగార్జున సాగర్ రహదారి మండలంలోని ఆగాపల్లి గ్రామం దాటగానే జాలి గుట్ట సమీపంలోకి రాగానే వేగాన్ని నియంత్రించలేక అదుపు తప్పి రోడ్డుపక్కనే గల చెట్టుకు ఢీకొంది. ప్రమాదంలో శ్రీను అక్కడికక్కడే మృతి చెందాడు. బిచ్చా నాయక్ తీవ్ర గాయాలతో నగరంలోని అవేర్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు.