టెంపో - లారీ ఢీ: ఆరుగురు మృతి
చిత్తూరు : చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం అగరాల వద్ద మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టెంపో ట్రావెల్స్ - లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.
వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటక నుంచి వచ్చిన వీరు తిరుమలలో శ్రీవెంకటేశ్వరుని దర్శించుకుని స్వస్థలానికి టెంపోలో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. మృతులను సురేష్, పార్వతమ్మ, రమ్య, సుజ, గౌరమ్మ, టెంపో డ్రైవర్ కిరణ్లుగా గుర్తించామని చెప్పారు. మృతులంతా బెంగుళూరు నగరంలోని ఎలహంక, దినహరహళ్లిప్రాంతాలకు చెందిన వారని పోలీసులు పేర్కొన్నారు.