భక్తిశ్రద్ధలతో మహాయజ్ఞం
ఆళ్లగడ్డ: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో మూడో రోజు బుధవారం మహా యజ్ఞానాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ జ్వాల సెంట్రల్ ట్రస్ట్ నిర్వాహకులు శ్రీధర్ గురూజీ ఆధ్వర్యంలో ఈ యజ్ఞం కొనసాగుతున్న విషయం విదితమే. బుధవారం ఉదయం సూర్యనమస్కారంతో పూజలు మొదలయ్యాయి. గణపతి హోమం, సాలిగ్రామ అభిషేకం జరిపారు. అస్త్రవిన్యాసం కార్యక్రమంలో భాగంగా.. పురాణ, ఇతిహాసాల కాలంలో దేవ, దానవులు ఉపయోగించిన ఆయుధాలను శ్రీధర్ గురూజీ ధరించి ప్రయోగం ప్రకారం పూజించి ప్రతిష్టించారు. అనంతరం కుబేర లోకం యజ్ఞ కుండలకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేదపండితులు పాల్గొన్నారు.