వైఎస్సార్ సీపీలో పలువురి చేరిక
అయినవిల్లిలంక(అయినవిల్లి) :
అయినవిల్లిలంకకు చెందిన వంద మంది కార్యకర్తలు మంగళవారం రాత్రి పి.గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారికి చిట్టిబాబు, పార్టీ మండలాధ్యక్షుడు మట్టపర్తి శ్రీనివాస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటి వరకూ వీరు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలో పనిచేసినట్టు తెలిపారు. జగ¯ŒSమోహ¯ŒS రెడ్డి ఆశయాలు నచ్చి తాము పార్టీలోకి చేరామన్నారు. పార్టీలో చేరిన వారిలో ముత్తాబత్తుల వెంకట్రావు, పిల్లి శ్రీనివాసరావు, వారా శ్రీనివాసరావు, కుసుమ ఆంజనేయులు, మచ్చా శ్రీను, కె.బెనర్జి, వందే విశ్వేశ్వరరావు, మద్దెల శోభనబాబు తదితరులు ఉన్నారు.కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం రాష్ట్రకార్యదర్శి గుత్తుల నాగబాబు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి నంబూరి శ్రీరామచంద్రరాజు, గన్నవరపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.