Air Space Violation
-
మా గగనతలంపై మీ విమానాలొద్దు: పాకిస్తాన్
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌ను, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జా నగరాన్ని కలుపుతూ నడిచే ‘గో ఫస్ట్’ పౌర విమానాలను తమ గగనతలం మీదుగా వెళ్లనివ్వబోమని పాకిస్తాన్ మంగళవారం స్పష్టంచేసింది. గతంలో గోఎయిర్‌గా పిలవబడిన గో ఫస్ట్ పౌర విమానయాన సంస్థ ఈ ఏడాది అక్టోబర్ 23 నుంచి శ్రీనగర్–షార్జా నగరాల మధ్య డైరెక్ట్ విమానసర్వీసులను ప్రారంభించింది. ఈ నగరాలను కలిపే విమానాలు పాకిస్తాన్ గగనతలం మీదుగా వెళ్లాల్సి ఉంది. అక్టోబర్ 31వ తేదీ వరకు ఆ విమానాలన్నీ పాక్ మీదుగా రాకపోకలు సాగించాయి. అయితే తాజాగా తమ ఎయిర్‌స్పేస్‌ను వాడుకోవద్దంటూ పాకిస్తాన్ కరాఖండీగా చెప్పేసింది. దీంతో మంగళవారం శ్రీనగర్ నుంచి బయల్దేరిన విమానం సుదూరంగా గుజరాత్ మీదుగా ప్రయాణిస్తూ షార్జా నగరానికి చేరుకుంది. దీంతో విమానం మరో 40 నిమిషాలపాటు ప్రయాణించాల్సి వచ్చింది. హఠాత్తుగా తమ నిర్ణయం మార్చుకున్నందుకు సరైన కారణాలను పాకిస్తాన్ ఇంతవరకు భారత్‌కు తెలియజేయలేదు. దీనిపై గో ఫస్ట్ సంస్థ నుంచి సైతం ఎలాంటి స్పందన రాలేదు. అమెరికా బ్లాక్‌లిస్ట్‌లో పెగాసస్ Vinisha Umashankar: మీ తీరు చూస్తోంటే..కోపం వస్తోంది! శభాష్ వినీషా! -
గగనతల నిషేధాన్ని పొడిగించిన పాక్
ఇస్లామాబాద్: భారత సరిహద్దుల్లోని గగనతలంపై విధించిన నిషేధాన్ని పాకిస్తాన్ వరుసగా రెండోసారి పొడిగించింది. మరో రెండు వారాల పాటు ఈ మార్గంలో వాణిజ్య విమాన సేవలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 14న పుల్వామా జిల్లాలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా ఫిబ్రవరి 26న పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో జైషే మహ్మద్ ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దళం మెరుపుదాడులు నిర్వహించింది. దీంతో పాక్...భారత సరిహద్దుల్లోని తన గగనతలంపై వాణిజ్య విమానాలు వెళ్లకుండా నిషేధం విధించింది. మే 15తో ఇది ముగియడంతో... ఈ నెల 30 వరకు నిషేధాన్ని పొడిగించింది. తాజాగా వచ్చేనెల 14 వరకు తమ గగనతలంపై నిషేధాన్ని పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. నిషేధం కారణంగా యూరోప్, ఆగ్నేయాసియా విమానాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. -
సియాచిన్‌లో పాక్ యుద్ధ విమానాలు!
-
సియాచిన్‌లో పాక్ హడావుడి!
న్యూఢిల్లీ: పాకిస్థాన్ వైమానిక దళానికి చెందిన మిరేజ్ తరహా యుద్ధ విమానాలు సరిహద్దుల్లోని సియాచిన్ గ్లేసియర్ సమీపంలో తిరిగినట్లు ఆ దేశ మీడియా కథనాలు ప్రచురించడం కలకలం రేపింది. భారత భూభాగంలో ఉన్న సియాచిన్ ప్రాంతం సమీపంలో పాక్ వైమానిక దళ చీఫ్ తిరిగారని మీడియా చెప్పుకొచ్చింది. అయితే, ఈ కథనాలను భారత వైమానిక దళం నిర్ద్వంద్వంగా ఖండించింది. సియాచిన్లోని భారత గగనతలంలో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని స్పష్టం చేసింది. పాక్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ మార్షల్ సోహైల్ అమన్ సరిహద్దుల్లోని స్కర్దు ప్రాంతంలో ఉన్న ఖాద్రి వైమానిక స్థావరాన్ని సందర్శించారని పాక్ మీడియా పేర్కొన్నది.ఇక్కడ ఫైటర్ జెట్ వైమానిక దళం యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తున్నది. ఇక్కడ ఉన్న తమ ఎయిర్‌ఫోర్స్ స్థావరాలన్నింటినీ భారత ముప్పును ఎదుర్కొనేందుకు పాక్ క్రియాశీలం చేసినట్టు మీడియా చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా పాక్ ఎయిర్ చీఫ్ అమన్ తానే స్వయంగా మిరాజ్ జెట్ విమానాన్ని నడుపుతూ.. సియాచిన్ సమీపంలోకి చొచ్చుకొచ్చినట్టు కథనాలు వండివార్చింది. ఈ కథనాలను భారత్ తీవ్రంగా ఖండించింది. మిలిటెంట్ల చొరబాట్లకు నేరుగా సహకరిస్తూ కాల్పులకు దిగుతున్న పాక్ సైన్యానికి బుద్ధి చెప్పేందుకు జమ్మూకశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌లోని పాక్ సైనిక పోస్టు భారత్ ఆర్మీ ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. భారత వైమానిక దళాలు పాక్ సైనిక పోస్టుపై దాడులు నిర్వహించిన వీడియోను ఆర్మీ విడుదల చేసింది. అయితే, ఈ దాడిని తోసిపుచ్చుతున్న పాక్.. తాజా సరిహద్దుల్లో దూకుడుగా వ్యవహరించాలనుకోంటోంది. ఈ నేపథ్యంలోనే సియాచిన్ గగనతలంలోకి తమ విమానాలు వచ్చాయంటూ కథనాలు ప్రచురించడం గమనార్హం. పాకిస్తాన్‌తో యుద్ధం?