airforce one
-
శెబ్బాష్ తాశి: పాక్ ఖేల్ ఖతం
దాయాది దేశం పాకిస్తాన్ కన్ను ఎప్పుడూ కశ్మీర్ మీదే. ఏదో వంకతో స్థానిక యువతను రెచ్చగొడుతూ దేశంలో అలజడి సృష్టిస్తూనే ఉంది. అలాంటి ప్రయత్నమే 1999లో కూడా చేసింది. అయితే ఈ సారి ఉగ్రవాదులతో పాక్ ఆర్మీ చేతులు కలిపింది. సహాజ నిబంధనలు ఉల్లంఘించి నియంత్రణ రేఖ దాటి వచ్చి మన ఆర్మీపై దాడికి తెగబడింది. ఇండియన్ ఆర్మీ ధీటుగా స్పందించింది. ఆపరేషన్ విజయ్ పేరుతో పాక్‌కు బుద్ధి చెప్పింది. పశువులు తినేందుకు పచ్చిక కూడా కనిపించనంతగా హియలయాలపై మంచు దుప్పటి పేరుకుపోయింది. తన గొర్రెలను మేపేందుకు పర్వత లోయల్లోకి వెళ్లాడు తాశి నామ్‌గ్యాల్. జనసంచారం ఉండని ఆ ప్రాంతంలో పఠాన్ దుస్తుల్లో కొందరు వ్యక్తులు రాళ్లతో మంచులో ఏదో పని చేస్తుండటం కనిపించింది. జాగ్రత్తగా గమనిస్తే వారి దుస్తుల్లో ఆయుధాలు కనిపించాయి. క్షణం ఆలస్యం చేయలేదు తాశి నామ్‌గ్యాల్. వెంటనే భారత ఆర్మీకి విషయం చేరవేశాడు. ఆ రోజు 1999 మే 2. తీవ్రమైన దాడులు నామ్‌గ్యాల్ ఇచ్చిన సమాచారంతో పర్వతాల్లోకి వెళ్లిన ఇండియన్ ఆర్మీ ట్రూప్‌పై అనుమానిత వ్యక్తులు దాడి చేశారు. ఐదుగురు భారత సైనికులను పట్టుకుని చంపేశారు. ఊహించని విధంగా జరిగిన దాడితో భారత ఆర్మీ మొదటి తీవ్రంగా నష్టపోయింది. పాక్ దళాల సాయంతో టెర్రరిస్టులు చేసిన దాడిలో కార్గిల్ ఆయుధగారం ధ్వంసమైంది. మన ఆర్మీ తేరుకునే లోపే ద్రాస్, కక్సర్, ముస్తో సెక్టార్లలో శత్రువులు తిష్ట వేశారనే సమాచారం అందింది. తూటాలు కాచుకుంటూ దొంగచాటుగా పాక్ ఆర్మీ కొండల పైకి చేరుకుని బంకర్లు నిర్మించుకోవడంతో ఈ పోరాటంలో తొలుత భారత సైనికులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. పై నుంచి పాక్ సైనికులు, టెర్రరిస్టులు తేలికగా దాడి చేస్తూ తూటాలు, బాంబుల వర్షం కురిసిస్తుండగా.. వాటిని కాచుకుంటూ మన సైనికులు వీరోచితంగా పోరాటం చేయాల్సి వచ్చింది. దీంతో 26న వాయుసేన రంగంలోకి దించింది ఇండియా ప్రభుత్వం. మొదటి వారంలోనే రెండు మిగ్ విమానాలు, ఒక ఆర్మీ హెలికాప్టర్లను మన ఆర్మీ నష్టపోయింది. రోజులు గడుస్తున్నా... రణ క్షేత్రంలో భారత దళాలలకు పట్టు దొరకడం లేదు. దాడి చేస్తున్నది పాకిస్తానే అని తెలిసినా సరైన ఆధారాలు లభించడం లేదు. పాక్ హస్తం జూన్ 5వ తేదిన ముగ్గురు పాక్ సైనికులు భారత భద్రతా దళాలకు చిక్కారు. దీంతో ఈ దాడిలో పాకిస్తాన్ హస్తం ఉందని స్పష్టంగా తేలిపోయింది. అప్పటి వరకు కార్గిల్‌లో స్థానికులు సైన్యంపై తిరుగుబాటు చేస్తున్నారంటూ చెబుతూ వచ్చిన పాక్ నోటికి తాళం పడింది. పొరుగు దేశం కుట్రలు బయట పడటంతో భారత్ పూర్తి స్థాయి యుద్ధానికి రెడీ అయ్యింది. పాక్ ఆర్మీ, , టెర్రరిస్టుల ఆధీనంలోకి వెళ్లిన భూభాగాలను తిరిగి చేజిక్కించుకునేందుకు ఆపరేషన్ విజయ్‌ని ప్రకటించింది. టైగర్ హిల్స్ కార్గిల్ చొరబాటులో కీలకమైన ప్రాంతం టైగర్ హిల్స్. వాటిపై తిష్ట వేసిన పాక్ దళాలు భౌగోళిక పరిస్థితులు ఆసరాగా చేసుకుని దాడులకు తెగబడుతున్నాయి. భారత దళాలు జూన్ 29న టైగర్ హిల్స్ పర్వత పాదాల వద్దకు చేరుకున్నాయి. యుద్ధంలో కీలక ఘట్టం మొదలైంది. వారం రోజుల పాటు హోరాహోరీ పోరు జరిగింది. జులై 4వ తేదిన కీలకమైన టైగర్ హిల్స్‌ని భారత్ స్వాధీనం చేసుకుంది. దీంతో పాక్ ఆర్మీకి దిక్కు తోచని పరిస్థితి ఎదురైంది. తెలుగు వాడైన మేజర్ పద్మఫణి ఆచార్య ఈ యుద్ధ క్షేత్రంలోనే నేలకొరిగారు. తరిమి కొట్టారు టైగర్ హిల్స్ చేజిక్కిన తర్వాత భారత దళాలకు ఎదురే లేకుండా పోయింది. నియంత్రణ రేఖ దాటి చొరబాటు దారులు ఆక్రమించుకున్న స్థలాలను వేగంగా తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే ఇటు రణక్షేత్రం, అటు అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ఏకాకిగా నిలిచింది. ముషారఫ్ కుట్రలు, కుతంత్రాలు పారలేదు. అతని అండతో అతిక్రమణకు పాల్పడిన ఆర్మీ, టెర్రరిస్టులు తోక ముడిచారు. జులై 14 నాటికి అన్ని శత్రు మూకలను తరిమి కొట్టారు. పాక్‌తో చర్చల అనంతరం జులై 26న అధికారికంగా యుద్ధాన్ని ముగిసినట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది. ముషారఫ్ కుయుక్తి పాకిస్తాన్లో ప్రధానులెక్కువగా కీలుబొమ్మలే అయ్యారు. ఆర్మీ అధికారులే నిజమైన అధికారం చెలాయించారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కి చెప్పకుండా అప్పటీ ఆర్మీ చీఫ్ జనరల్ పర్వేజ్ ముషారఫ్ కశ్మీర్‌పై కుయుక్తి పన్నాడు. దొంగచాటుకా భారత భూభాగంలోకి తన సైన్యాన్ని పంపించాడు. చలికాలంలో హిమాలయాల్లో దట్టంగా మంచు పేరుకుపోయే కాలంలో పర్వత శ్రేణుల నుంచి ఇరు దేశాల భద్రతా దళాలు వెనక్కి వస్తాయి. చాన్నాళ్లుగా ఇదే పద్దతి అమలవుతోంది. అయితే దీన్ని తుంగలో తొక్కి భారత దళాలు గస్తీలో లేని సమయం చూసి ముషారఫ్ ఆదేశాలతో పాక్ ఆర్మీతో కూడిన టెర్రరిస్టు మూకలు పాక్ గుండా భారత భూభాగంలో అడుగుపెట్టి కీలక స్థావరాలను ఆక్రమించుకున్నారు. ఫలితంగా యుద్ధం అనివార్యమైంది. అమరులు దాదాపు రెండు నెలల పాటు కొనసాగిన ఈ యుద్ధంలో భారత్ వైపు 527 మంది జవాన్లు అమరులయ్యారు. పాకిస్తాన్ వైపు 453 మంది వరకు చనిపోయినట్టు సమాచారం. ఈ చొరబాట్లలో పాకిస్తాన్‌కి చెందిన స్పెషల్ సర్వీసెస్ గ్రూప్, నార్తర్న్ లైట్‌ఇన్‌ఫాంట్రీ చెందిన సైనికులు పాల్గొన్నట్టు తేలింది. వీరికి కశ్మీరీ తీవ్రవాదులు, ఆఫ్ఘానిస్థాన్‌కి చెందిన కిరాయి ముకలు సహాకరించినట్టు తేలింది. విజయ్ దివాస్ కార్గిల్ విజయ దినోత్సవాన్ని ప్రతీ ఏటా జూలై 26న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజు దేశ రాజధాని న్యూ ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద జరిగే వేడుకల్లో దేశ ప్రధాని హోదాలో నరేంద్రమోదీ పాల్గొని అమర జవానులకు నివాళులు అర్పిస్తారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో ప్రజలు సైతం సైనికుల త్యాగాలకు గుర్తుగా క్యాండిల్స్ వెలిగించి నివాళులు అర్పించడం రివాజు. - సాక్షి , వెబ్‌డెస్క్ -
ఆయన అంతిమ ప్రయాణం అందులోనే!
వాషింగ్టన్ : అమెరికా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన మాజీ అధ్యక్షుడు, దివంగత నేత జార్జ్ హెచ్. డబ్ల్యూ బుష్‌కు ఘనంగా నివాళులు అర్పించేందుకు ఆ దేశ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆయన భౌతికకాయాన్ని వాషింగ్టన్ తీసుకెళ్లేందుకు అధ్యక్షుడి అధికారిక విమానం ఎయిర్‌ఫోర్స్ వన్ను ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. బుష్ గౌరవార్థం ఈ విమానానికి తాత్కాలికంగా ‘స్పెషల్ ఎయిర్‌మిషన్ 41’ అని పేరు కూడా పెట్టారు. ఇక బుష్ పార్థివ దేహానికి వాషింగ్టన్లో నివాళులు అర్పించిన అనంతరం తిరిగి హూస్టన్‌కు తీసుకువచ్చిన తర్వాత టెక్సాస్‌లోని జార్జ్ హెచ్. డబ్ల్యూ బుష్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీలో సందర్శనార్థం ఉంచనున్నారు. ఇందుకు గానూ ‘4141’ అనే ప్రత్యేక రైలును ఉపయోగిస్తున్నారు. అంతిమ ప్రయాణం అందులోనే! సీనియర్ బుష్ అంతిమ ప్రయాణం ఆయన పేరు మీదుగా ఏర్పాటు చేసిన రైలులో సాగనుండటం విశేషం. అమెరికాలోని అతిపెద్ద రైలు రవాణా సంస్థ యూనియన్ పసిఫిక్ తమ దేశ 41వ అధ్యక్షుడు బుష్ గౌరవార్థం ఓ ప్రత్యేక లోకోమోటివ్ను రూపొందించింది. 4141 నంబరు గల ఈ లోకోమోటివ్ను 2005లో సీనియర్ బుష్ ప్రారంభించారు. తమ లోకోమోటివ్‌లకు భిన్నంగా 4141ను అమెరికా అధ్యక్షుడి అధికారిక విమానం ఎయిర్‌ఫోర్స్ వన్ లుక్ ప్రతిబింబించేట్లుగా నీలం, తెలుపు రంగులో దీనిని రూపొందించారు. దీనిపై జార్జ్ బుష్ 41 అనే అక్షరాలను పొందుపరిచారు. స్వయంగా ఆయనే నడిపారు.. ‘4141 ఆవిష్కరణ సమయంలో నేను రైలు నడపవచ్చా అని బుష్ అడిగారు. చిన్నపాటి ట్రెయినింగ్, కొన్ని మెళకువలు చెప్పిన అనంతరం ఇంజనీర్ పర్యవేక్షణలో సుమారు రెండు మైళ్ల దూరం పాటు బుష్ లోకోమోటివ్ను నడిపారు’ అని యూనియన్ పసిఫిక్ రిటైర్డ్ జనరల్ డైరెక్టర్ మైక్ ఇడెన్ ఆనాటి ఙ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. 1969 తర్వాత మొదటిసారి.. మాజీ అధ్యక్షుల పార్థివ దేహాలను అంతిమ ప్రయాణానికి రైళ్లను ఉపయోగించే సంప్రదాయం అబ్రహం లింకన్ కాలం నాటి నుంచే కొనసాగుతోంది. అమెరికా మాజీ అధ్యక్షులు గ్రాంట్, గారీఫీల్డ్, మెకన్లే, హార్డింగ్, రూజ్వెల్ట్ భౌతిక కాయాలను కూడా రైళ్లలోనే తరలించినట్లు యూనియన్ పసిఫిక్ పేర్కొంది. అయితే 1969లో ఐసన్‌హోవర్ తర్వాత మొదటిసారిగా బుష్ పార్థివ దేహాన్ని తీసుకువెళ్లడానికి, ఆయన పేరు మీదుగా రూపొందించిన లోకోమోటివ్ను ఉపయోగించనుండటం తమకు ప్రత్యేకమని తెలిపింది. ‘రెండో ప్రపంచ యుద్ధంలో నేవీ పైలట్‌గా, అధ్యక్షుడిగా తన జీవిత కాలాన్నిఅమెరికా కోసం వెచ్చించిన అధ్యక్షుడు బుష్‌కు కృతఙ్ఞతలు. మీ గౌరవార్థం బుష్ లైబ్రరీ లోకోమోటివ్ను 2005లో ప్రత్యేకంగా రూపొందించాం. మీ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి’ అంటూ ట్విటర్ వేదికగా నివాళులు అర్పించింది. ఈ విధంగా బుష్‌ను చివరిసారిగా దర్శించుకుని, నివాళి అర్పించే అవకాశం 4141 ద్వారా టెక్సాన్లకు దక్కింది. కాగా వాషింగ్టన్‌లోని నేషనల్ క్యాథడ్రల్ చర్చిలో అధికారిక లాంఛనాలతో ఓసారి, హూస్టన్‌లోని సెయింట్‌మార్టిన్ ఎపిస్కోపల్ చర్చిలో మరోసారి బుష్ అంత్యక్రియలు జరగనున్నాయి. గురువారం హూస్టన్‌లో ఆయన భార్య బార్బరా, కుమార్తె రాబిన్ పక్కన బుష్ పార్థివదేహాన్ని ఖననం చేయనున్నారు. Thank you, President Bush, for a life of service, including serving as a Navy combat pilot in World War II. We were honored to pay you tribute with a custom-painted locomotive at the Bush Library in 2005. Our thoughts and prayers are with your family. #Bush41 pic.twitter.com/rPg96allQP — Union Pacific (@UnionPacific) December 1, 2018 -
న్యూలుక్లో ఎయిర్‌ఫోర్స్ వన్..!
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడి అధికారిక పర్యటన విమానం ఎయిర్‌ఫోర్స్ వన్ సరికొత్త రూపంలో దర్శనమివ్వనుంది. ఈమేరకు అమెరికా రక్షణా విభాగం ప్రఖ్యాత ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ సంస్థ బోయింగ్‌తో 3.9 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. సీబీఎస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భవిష్యత్ ప్రయోజనాల దృష్ట్యా అమెరికాకు కాబోయే నూతన అధ్యక్షుల కోసం రెండు కొత్త ఎయిర్ ఫోర్స్ వన్‌లను రూపొందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వీటిని బోయింగ్ రూపొందించనున్నట్లు తెలిపారు. ‘కొత్తగా రూపొందించే ఎయిర్‌ఫోర్స్ వన్ చాలా అసామాన్యమైనది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైనది. ఇకపై ఎరుపు, తెలుపు, నీలం రంగుల కలయికతో దర్శనమివ్వబోతుందంటూ’ ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడి అధికారిక ప్రయాణాల నిమిత్తం రూపొందించిన ఎయిర్ ఫోర్స్ వన్‌లో సకల సౌకర్యాలు కలిగి ఉండి అత్యాధునిక సాంకేతికతో అనుసంధానం చేయబడి ఉంటుంది. అత్యంత పటిష్టమైన ఈ విమానంలో అధ్యక్షుడితో అతికొద్ది మంది ముఖ్యమైన వ్యక్తులు మాత్రమే ప్రయాణించడానికి వీలు ఉంటుంది. మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ కాలం నుంచి తెలుపు, నీలం రంగుల కలయికలో ఉన్న ఎయిర్ ఫోర్స్ వన్ను రూపాన్ని మార్చనున్నానమని శ్వేతసౌధ వర్గాలు ప్రకటించాయి. 2024 డిసెంబర్‌లోపు రెండు విమానాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపాయి. -
భారత్ బయల్దేరిన ఒబామా బృందం
-
భారత్ బయల్దేరిన ఒబామా బృందం
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీసమేతంగా భారతదేశానికి బయల్దేరారు. వాషింగ్టన్ విమానాశ్రయంలో ఆయన ప్రత్యేక విమానం ఎయిర్‌ఫోర్స్ వన్ కొద్దిసేపటి క్రితమే టేకాఫ్ తీసుకుంది. ఆయనతో పాటు పలువురు ఉన్నతాధికారులు, భద్రతా దళానికి చెందిన అధికారులు కూడా భారత్‌కు అదే విమానంలో బయల్దేరారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ఆయన భారతదేశం చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్రపతి భవన్ వద్ద ఒబామా బృందానికి స్వాగతం పలుకుతారు.