వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడి అధికారిక పర్యటన విమానం ఎయిర్‌ఫోర్స్ వన్ సరికొత్త రూపంలో దర్శనమివ్వనుంది. ఈమేరకు అమెరికా రక్షణా విభాగం ప్రఖ్యాత ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ సంస్థ బోయింగ్‌తో 3.9 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. సీబీఎస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భవిష్యత్ ప్రయోజనాల దృష్ట్యా అమెరికాకు కాబోయే నూతన అధ్యక్షుల కోసం రెండు కొత్త ఎయిర్ ఫోర్స్ వన్‌లను రూపొందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వీటిని బోయింగ్ రూపొందించనున్నట్లు తెలిపారు. ‘కొత్తగా రూపొందించే ఎయిర్‌ఫోర్స్ వన్ చాలా అసామాన్యమైనది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైనది. ఇకపై ఎరుపు, తెలుపు, నీలం రంగుల కలయికతో దర్శనమివ్వబోతుందంటూ’ ట్రంప్ వ్యాఖ్యానించారు.
అమెరికా అధ్యక్షుడి అధికారిక ప్రయాణాల నిమిత్తం రూపొందించిన ఎయిర్ ఫోర్స్ వన్‌లో సకల సౌకర్యాలు కలిగి ఉండి అత్యాధునిక సాంకేతికతో అనుసంధానం చేయబడి ఉంటుంది. అత్యంత పటిష్టమైన ఈ విమానంలో అధ్యక్షుడితో అతికొద్ది మంది ముఖ్యమైన వ్యక్తులు మాత్రమే ప్రయాణించడానికి వీలు ఉంటుంది. మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ కాలం నుంచి తెలుపు, నీలం రంగుల కలయికలో ఉన్న ఎయిర్ ఫోర్స్ వన్‌ను రూపాన్ని మార్చనున్నానమని శ్వేతసౌధ వర్గాలు ప్రకటించాయి. 2024 డిసెంబర్‌లోపు రెండు విమానాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment