
భారత్ బయల్దేరిన ఒబామా బృందం
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీసమేతంగా భారతదేశానికి బయల్దేరారు. వాషింగ్టన్ విమానాశ్రయంలో ఆయన ప్రత్యేక విమానం ఎయిర్ఫోర్స్ వన్ కొద్దిసేపటి క్రితమే టేకాఫ్ తీసుకుంది.
ఆయనతో పాటు పలువురు ఉన్నతాధికారులు, భద్రతా దళానికి చెందిన అధికారులు కూడా భారత్కు అదే విమానంలో బయల్దేరారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ఆయన భారతదేశం చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్రపతి భవన్ వద్ద ఒబామా బృందానికి స్వాగతం పలుకుతారు.